Shahid Kapoor | షాహిద్ కపూర్ పై టాలీవుడ్ విలన్ సంచలన కామెంట్స్...
కేజీఎఫ్ 2 దెబ్బకు భయపడి ఓ బాలీవుడ్ హీరో తన సినిమాను వాయిదా వేసుకున్నాడని టాలీవుడ్ విలన్, దర్శకుడు జీవీ సుధాకర్ నాయుడు పేర్కొన్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ను ఉద్దేశించి 1996 ధర్మపురి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పై టాలీవుడ్ విలన్ జీవీ సుధాకర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ వాళ్లను చులకనగా మాట్లాడిన హీరోనే కేజీఎఫ్2 దెబ్బకు భయపడి తన సినిమాను వాయిదా వేసుకున్నాడంటూ షాహిద్ కపూర్ పేరు చెప్పకుండా అతడిపై విమర్శల్ని గుప్పించారు. 1996 ధర్మపురి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుధాకర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుధాకర్ నాయుడు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో సౌత్ ఇండస్ట్రీ వారందరూ కాలర్ ఎత్తుకొని తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని జీవీ అన్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాష ఏదైనా అందరిని బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీకి చెందిన వారిగానే పరిగణిస్తారని అన్నాడు. గతంలో తాను కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సమయంలో సౌత్ వాళ్లందరూ నల్లగానే ఉంటారా అని అడిగారని పేర్కొన్నారు. బాలీవుడ్ వాళ్లను తమను సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లా చూసేవారని జీవీ చెప్పాడు. తాము చులకనగా భావించిన సౌత్ ఇండస్ట్రీ లోని 22 సినిమాల రీమేక్ హక్కులను కొనుక్కొని చాక్లెట్ హీరోలతో బాలీవుడ్ వాళ్లు సినిమాలు చేస్తున్నారని సుధాకర్ నాయుడు వ్యాఖ్యానించారు. హీరోహీరోయిన్లతో పాటు విలన్ లకు కొత్త బట్టలు వేస్తారా...కారావ్యాన్ ప్రత్యేకంగా ఉంటుందా అని ఓ హీరో నన్ను కామెంట్ చేశాడని సుధాకర్ నాయుడు చెప్పాడు. మనకు తల ఎత్తుకొని తిరిగే సమయం వస్తుందని అనుకొని ఆ హీరో మాటల్ని పట్టించుకోకుండా వదిలివేశానని చెప్పాడు.
బాహుబలి , కేజీఎఫ్, పుష్ప సినిమాలతో బాలీవుడ్ వాళ్లలో భయం మొదలైందని జీవీ పేర్కొన్నాడు. సౌత్ వాళ్లను చులకనగా మాట్లాడిన హీరోనే కేజీఎఫ్2 దెబ్బకు భయపడి తన సినిమాను వాయిదా వేసుకున్నాడని సుధాకర్ నాయుడు చెప్పాడు. అయితే షాహిద్ కపూర్ పేరును మాత్రం తన స్పీచ్ లో జీవీ ఎక్కడ వాడలేదు. ఇన్ డైరెక్ట్ గానే అతడిని విమర్శించారు. కేజీఎఫ్ 2 కు పోటీగా విడుదలకావాల్సిన బాలీవుడ్ చిత్రం జెర్సీ వాయిదాపడింది. దాంతో షాహిద్ కపూర్ ను ఉద్దేశించే అతడు ఈ వ్యాఖ్యలు చేశాడని చెబుతున్నారు. అంత:పురం, ఒక్కడు, పోకిరితో పాటు పలు సినిమాల్లో విలన్ గా నటించాడు జీవీ. హీరో, రంగా ది దొంగా సినిమాలకు దర్శకత్వం వహించాడు.
సంబంధిత కథనం