SSMB28 Title: మహేష్-త్రివిక్రమ్ టైటిల్ ఇదేనా? సూపర్ స్టార్‌కు నచ్చిన పేరు..!-mahesh babu likes guntur karam title for ssmb28 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ssmb28 Title: మహేష్-త్రివిక్రమ్ టైటిల్ ఇదేనా? సూపర్ స్టార్‌కు నచ్చిన పేరు..!

SSMB28 Title: మహేష్-త్రివిక్రమ్ టైటిల్ ఇదేనా? సూపర్ స్టార్‌కు నచ్చిన పేరు..!

Maragani Govardhan HT Telugu
May 27, 2023 06:05 PM IST

SSMB28 Title: మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB28 మూవీ టైటిల్‌కు ఓ పేరు ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్‌కు కూడా ఈ పేరు బాగా నచ్చిందని టాక్.

SSMB 28 టైటిల్‌ అప్డేట్
SSMB 28 టైటిల్‌ అప్డేట్

SSMB28 Title: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB 28కి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్నట్లు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. అయితే ఈ మూవీకి ఏ టైటిల్ పెట్టాలనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.

టైటిల్ విషయంలో ఇప్పటికే అమరావతికి అటు ఇటు, ఆరంభం, హాట్ మిర్చి తదితర పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సోషల్ మీడియాలో వినిపించాయి. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాకు గుంటూరు కారం అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ టైటిల్ మహేష్ బాబుకు కూడా బాగా నచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా అభిమానులకు కూడా మూవీకి టైటిల్ మంచి యాప్ట్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

ఎక్కువ మందికి ఈ టైటిల్ నచ్చగా.. మరి త్రివిక్రమ్‌కు నచ్చుతుందో చూడాలి. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలకు ఎక్కువగా అ అనే పేరుమీదుగా స్టార్ట్ అవుతాయి. అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో ఇలా చాలా వరకు అ అక్షరంతోనే మొదలవుతాయి. మరి మహేష్ మూవీకి గుంటూరు కారం ఏ మేరకు నచ్చుతుందో చూడాలి.

త్రివిక్రమ్ తన సొంత సెంటిమెంటును కాదని గుంటూరు కారం టైటిల్‌ను ఎంచుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ టైటిల్‌ను బట్టి చూస్తే గుంటూరు నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్‌ను ఈ నెల 31న రివీల్ చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. సూపర్ స్టార్ కృష్ట పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయనున్నట్లు అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Whats_app_banner