తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Controversy : నీ క్షమాపణలు ఒప్పుకోం.. ఆదిపురుష్ రైటర్‌పై నెటిజన్ల కామెంట్స్

Adipurush Controversy : నీ క్షమాపణలు ఒప్పుకోం.. ఆదిపురుష్ రైటర్‌పై నెటిజన్ల కామెంట్స్

Anand Sai HT Telugu

09 July 2023, 6:04 IST

google News
    • Adipurush Controversy : ఆదిపురుష్ సినిమాపై ఎంత వివాదం చెలరేగిందో తెలిసిందే. చిత్రబృందం విమర్శలపాలైంది. అయితే తాజాగా సినిమా రైటర్ మనోజ్ ముంతాషీర్ క్షమాపణలు చెప్పాడు. కానీ సారీని అంగీకరించమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మనోజ్ ముంతాషిర్ శుక్లా (Photo: ANI)
మనోజ్ ముంతాషిర్ శుక్లా (Photo: ANI)

మనోజ్ ముంతాషిర్ శుక్లా (Photo: ANI)

ఆదిపురుష్ టీమ్(Adipurush Team) విమర్శలకు గురైంది. రామాయణ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సరిగా లేదని చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) రాముడిగా కనిపించాడు. సీతగా కృతి సనన్(Kriti Sanon) నటించింది. ఇంత స్టార్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ సినిమా పరాజయం పాలైంది. దానికి కారణం దర్శకనిర్మాత తప్పిదాలే. ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఈ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్(Manoj Munthashir) చాలా కాలం తర్వాత ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. కానీ దానిని ఒక వర్గం ప్రజలు అంగీకరించడం లేదు.

ఆదిపురుష్ సినిమా(Adipurush Cinema) విడుదలైనప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. హనుమంతుడి డైలాగులు బాగా లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ తన తప్పును ఒప్పుకోవలసి వచ్చింది. కానీ అప్పుడు అతను అసహనానికి గురయ్యాడు. తాము చేసిన పని కరెక్ట్ అన్నట్లుగా ప్రవర్తించాడు. అది ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ఆదిపురుష్ విడుదలకు ముందు ఇది రామాయణం(Ramayanam) నేపథ్యంలో సాగే సినిమా అని చెప్పిన ఆయన, వివాదాల తర్వాత మాట మార్చుకుని మేము రామాయణం ఆధారంగా సినిమా తీయలేదు, స్ఫూర్తి పొందిన సినిమా అని చెప్పుకొచ్చాడు.

మనోజ్ ముంతాషిర్ క్షమాపణ చెప్పాలనుకుంటే ఆదిపురుష్ విడుదలైనప్పుడే తన తప్పును ఒప్పుకుని ఉండాల్సింది. ఇప్పుడు సినిమాను అన్ని థియేటర్ల నుంచి తీసేసిన తర్వాత క్షమాపణలు చెప్పాడు. చాలా మంది అతని క్షమాపణలను అంగీకరించలేదు. అలాగే, కేవలం నోటితో క్షమాపణ అడగడం ఏమిటి? ఆదిపురుష్ సినిమా ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ను గోశాలలకు, దేవాలయాలకు విరాళంగా ఇవ్వాలని పలువురు వ్యాఖ్యానించారు. వీటికి మనోజ్ ముంతాషిర్ ఇంకా సమాధానం చెప్పలేదు.

'ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరిస్తున్నాను. మీరు నన్ను క్షమించాలి. మనమందరం సనాతన ధర్మానికి, ఈ దేశానికి ఒక్కటిగా సేవ చేసేలా బజరంగ్ బలి మనకు శక్తిని ప్రసాదించుగాక.' అని మనోజ్ ముంతాషిర్ ట్వీట్ చేశాడు.

ఆదిపురుష్ సినిమా జూన్ 16న విడుదల కాగా.. తొలి మూడు రోజుల్లో భారీ కలెక్షన్‍లను రాబట్టింది. ఆ తర్వాత వసూళ్లు మందగించాయి. ఈ చిత్రంలో రాఘవుడిగా స్టార్ హీరో ప్రభాస్, జానకిగా కృతిసనన్, లంకేశ్‍గా సైఫ్ అలీఖాన్, బజరంగ్‍గా దేవ్‍దత్ నాగే నటించారు. మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ.480 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం