Adipurush OTT Release: ఓటీటీలోకి ఆదిపురుష్ సినిమా ముందుగా ఆ విధానంలో రానుందా!-adipurush movie may hit ott on a rental basis first ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Ott Release: ఓటీటీలోకి ఆదిపురుష్ సినిమా ముందుగా ఆ విధానంలో రానుందా!

Adipurush OTT Release: ఓటీటీలోకి ఆదిపురుష్ సినిమా ముందుగా ఆ విధానంలో రానుందా!

Adipurush OTT Release: ఆదిపురుష్ సినిమా కలెక్షన్లు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ ఓటీటీ విడుదలకు సంబంధించి తాజాగా ఓ విషయం చక్కర్లు కొడుతోంది.

ఆదిపురుష్ పోస్టర్

Adipurush OTT Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా మిశ్రమ స్పందనను దక్కించుకుంది. జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తొలి మూడు రోజులు కలెక్షన్‍లలో అదరగొట్టింది. మూడు రోజుల్లో రూ.300 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. అయితే, ఆ తర్వాత కలెక్షన్లు భారీగా తగ్గాయి. దీంతోపాటు వివాదాలు, విమర్శలను ఎదుర్కొంటోంది ఆదిపురుష్. ప్రస్తుతం ఈ సినిమాకు దేశవ్యాప్తంగా కలెక్షన్లు మందకొడిగా ఉన్నాయి. దీంతో ఆదిపురుష్ సినిమా ఓటీటీలో రిలీజ్ గురించి ఊహాగానాలు అధికమయ్యాయి. ముందుగా రెంటల్ విధానంలో ఓటీటీలోకి ఆదిపురుష్‍ను అందుబాటులోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్టు లీకులు వస్తున్నాయి. వివరాలివే..

ఆదిపురుష్ మూవీని ఆగస్టులో ఓటీటీలోకి తీసుకురావాలని చిత్రయూనిట్ తొలుత భావించింది. అయితే, థియేటర్లలో స్పందన సరిగాలేకపోవటంతో అనుకున్న దాని కంటే ముందుగానే ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. జూలై మధ్యలో లేకపోతే జూలై నెలాఖర్లో ఓటీటీలోకి ఆదిపురుష్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఆదిపురుష్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే, ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘రెంటల్ విధానం’లో ఆదిపురుష్ అందుబాటులోకి వస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. అంటే అమెజాన్ ప్రైమ్ సబ్‍స్క్రైబర్లు రెంటల్ ఫీజు చెల్లించి ఈ మూవీని చూసే ఛాన్స్ ఉంటుంది. కాగా, రెంటల్ విధానంలో అందుబాటులోకి తెచ్చిన రెండు, మూడు వారాల తర్వాత యూజర్లందరికీ ఆదిపురుష్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి సంకేతాలు వెలువడలేదు.

ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ గురించి చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. అయితే, అమెజాన్ ప్రైమ్‍ వీడియోలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపై మరిన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

కాగా, ఆదిపురుష్‍ సినిమాకు లీక్ దెబ్బ కూడా తగిలింది. ఓటీటీలోకి రాకముందే ఈ మూవీ హెచ్‍డీ పైరసీ వెర్షన్ ఆన్‍లైన్‍లో లీక్ అయింది. చాలా మంది ఈ వెర్షన్‍ను డౌన్‍లోడ్ చేసుకుంటున్నారు. దీంతో అనుకున్న దాని కంటే ముందే ఆదిపురుష్‍ను ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. రూ.500కోట్ల భారీ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. డైలాగ్‍లు, గ్రాఫిక్స్, కథ విషయాల్లో విమర్శల పాలవుతోంది.

సంబంధిత కథనం