తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Comedy Ott: థియేటర్లలో బంపర్ బ్లాక్‍బస్టర్.. ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న హారర్ కామెడీ మూవీ.. మీరు చూశారా?

Horror Comedy OTT: థియేటర్లలో బంపర్ బ్లాక్‍బస్టర్.. ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న హారర్ కామెడీ మూవీ.. మీరు చూశారా?

13 October 2024, 19:23 IST

google News
    • Stree 2 Streaming: స్త్రీ 2 చిత్రం ఓటీటీలోనూ జోరు చూపిస్తోంది. థియేటర్లలో అంచనాలకు మించి కలెక్షన్లతో రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ హారర్ కామెడీ మూవీ దుమ్మురేపుతోంది.
OTT Horror Movie: థియేటర్లలో బంపర్ బ్లాక్‍బస్టర్.. ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న హారర్ కామెడీ మూవీ
OTT Horror Movie: థియేటర్లలో బంపర్ బ్లాక్‍బస్టర్.. ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న హారర్ కామెడీ మూవీ

OTT Horror Movie: థియేటర్లలో బంపర్ బ్లాక్‍బస్టర్.. ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న హారర్ కామెడీ మూవీ

‘స్త్రీ 2’ చిత్రం ఓ సంచలనంగా నిలిచింది. సుమారు రూ.870 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ హారర్ కామెడీ మూవీలో శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్రలు పోషించారు. స్త్రీకి సీక్వెల్‍గా మంచి అంచనాలతో ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ మూవీ రిలీజైంది. అయితే, ఫుల్ పాజిటివ్ టాక్ రావటంతో కలెక్షన్లు వెల్లువగా వచ్చాయి. దీంతో బంపర్ బ్లాక్‍బస్టర్ సాధించి.. బాలీవుడ్‍లో ఈ మూవీ రికార్డులను బద్దలుకొట్టింది. ఓటీటీలోనూ ఇప్పుడు దూసుకెళుతోంది.

టాప్‍లో ట్రెండింగ్

స్త్రీ 2 చిత్రం అక్టోబర్ 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. క్రేజ్‍కు తగ్గట్టు ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్మురేపుతోంది. అప్పుడే ప్రైమ్ వీడియో నేషనల్ వైడ్‍ ట్రెండింగ్‍లో టాప్‍కు చేరింది. భారీ వ్యూస్ సాధిస్తూ అదరగొడుతోంది.

స్త్రీ 2 మూవీ సెప్టెంబర్ చివర్లోనే రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే, అక్టోబర్ 10న ఆ రెంట్ తొలగిపోయింది. రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. దీంతో అప్పటి నుంచి ఈ సినిమా వ్యూస్‍లో అదరగొడుతోంది. ప్రస్తుతం టాప్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.

ఫస్ట్ పార్ట్ కూడా ట్రెండింగ్‍లో..

స్త్రీ మూవీ ఫస్ట్ పార్ట్ కూడా ప్రస్తుతం ప్రైమ్ వీడియో ట్రెండింగ్‍లో మూడో స్థానంలో ఉంది. 2018లో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సీక్వెల్‍గా స్త్రీ 2 రావటంతో కొందరు ఫస్ట్ పార్ట్ కూడా ఇప్పుడు చూస్తున్నారు. దీంతో స్త్రీ కూడా ట్రెండింగ్‍లోకి వచ్చింది. స్త్రీ మూవీ ఫస్ట్ పార్ట్ హాట్‍స్టార్ ఓటీటీలో ఉండగా.. ఇటీవలే ప్రైమ్ వీడియోలో కూడా అడుగుపెట్టింది.

స్త్రీ 2 చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్లతో మెప్పించారు. ఫస్ట్ పార్ట్ కంటే సీక్వెల్ బాగుందనే టాక్ వచ్చింది. దీంతో ఆరంభం నుంచి భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీలో శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్ లీడ్ రోల్స్ చేయగా.. పంకజ్ త్రిపాఠి, అపర్‌శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, అతుల్ శ్రీవాత్సవ, ముస్తాక్ ఖాన్, సునీత రాజ్వర్ కీలకపాత్రలు పోషించారు.

స్త్రీ 2 రికార్డుస్థాయి కలెక్షన్లు

స్త్రీ 2 చిత్రం సుమారు రూ.60కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనా. అయితే, ఈ చిత్రం దాదాపు రూ.870 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకొని బాలీవుడ్‍లో రికార్డులను తిరగరాసింది. ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్న హిందీ మూవీగా రికార్డు సృష్టించింది.

స్త్రీ 2 చిత్రాన్ని మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై దినేశ్ విజన్, జ్యోతి దేశ్‍పాండే ప్రొడ్యూజ్ చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ మూవీ లాభాల వర్షం కురిపించింది. భారీ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సచిన్ - జిగర్, జస్టిన్ వర్గీస్ ఈ మూవీకి సంగీతం అందించారు. జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి హేమంతి సర్కార్ ఎడిటింగ్ చేశారు. టెక్నికల్ పరంగా ఈ మూవీ ఉన్నతంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

తదుపరి వ్యాసం