Shraddha Kapoor: డేటింగ్‍ను కన్ఫర్మ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. బాయ్‍ఫ్రెండ్‍తో ఫొటో పోస్ట్ చేసి..-bollywood actress shraddha kapoor confirms his relation with rahul mody ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shraddha Kapoor: డేటింగ్‍ను కన్ఫర్మ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. బాయ్‍ఫ్రెండ్‍తో ఫొటో పోస్ట్ చేసి..

Shraddha Kapoor: డేటింగ్‍ను కన్ఫర్మ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. బాయ్‍ఫ్రెండ్‍తో ఫొటో పోస్ట్ చేసి..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 19, 2024 02:23 PM IST

Shraddha Kapoor: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన బాయ్‍ఫ్రెండ్‍ను అధికారికంగా వెల్లడించారు. ఇన్‍స్టాగ్రామ్‍లో ఫొటో పోస్ట్ చేసి తన రిలేషన్‍ను కన్ఫర్మ్ చేశారు.

Shraddha Kapoor: డేటింగ్‍ను కన్ఫర్మ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. బాయ్‍ఫ్రెండ్‍తో ఫొటో పోస్ట్ చేసి..
Shraddha Kapoor: డేటింగ్‍ను కన్ఫర్మ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. బాయ్‍ఫ్రెండ్‍తో ఫొటో పోస్ట్ చేసి..

Shraddha Kapoor: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన రిలేషన్‍షిప్‍ను ఖరారు చేశారు. రైటర్ రాహుల్ మోదీతో శ్రద్ధ డేటింగ్ చేస్తున్నారని చాలాకాలం నుంచి రూమర్లు వస్తున్నాయి. ఇంతకాలం ఆ ఇద్దరూ సైలెంట్‍గానూ ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తమ రిలేషన్‍ను శ్రద్ధ వెల్లడించారు.

ఫొటోతో..

తన బాయ్‍ఫ్రెండ్‍ రాహుల్‍తో ఉన్న ఓ ఫొటోను శ్రద్దా కపూర్ నేడు ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో రాహుల్ చేతిని పట్టుకొని శ్రద్ధ నవ్వుతూ కనిపించారు. “నా హృదయాన్ని తీసుకెళ్లు. కానీ కనీసం నా నిద్రనైనా తిరిగిచ్చెయ్” అని రాశారు శ్రద్ధ. స్మైలీ, లవ్ ఎమోజీలను ఉంచారు. ఈ ఫొటోతో తమ రిలేషన్‍ను శ్రద్ధ అధికారికంగా చెప్పేశారు.

గతేడాది తూ జూతి మై మక్కర్ సినిమా సమయంలో శ్రద్ధ, రాహుల్ మోదీ దగ్గరయ్యారని రూమర్లు బయటికి వచ్చాయి. అప్పటి నుంచి వీరు డేటింగ్‍లో ఉన్నారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయినా ఇద్దరూ స్పందించలేదు.

జామ్‍నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్లకు శ్రద్ధా కపూర్, రాహుల్ కలిసి హాజరయ్యారు. ఆ సమయంలోనూ వారి ఫొటోలు బయటికి వచ్చాయి. గతేడాది ముంబైలోనూ ఓసారి డిన్నర్‌ సందర్భంగా కెమెరాలకు చిక్కారు.

తాను రాహుల్‍తో ఉన్న ఫొటోలు బయటికి రావడం చూసి శ్రద్ధ షాకయ్యారనే రూమర్లు కూడా వచ్చాయి. వారు తమ బంధాన్ని ప్రైవేట్‍గా ఉంచుకోవాలని భావించారట. అందుకే ఇంతకాలం మౌనంగా ఉంటూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు తమ రిలేషన్‍ను శ్రద్ధ ఖరారు చేశారు.

గతేడాది ‘తూ జూతి మై మక్కార్’ సినిమా షూటింగ్‍లోనే శ్రద్ధా, రాహుల్ మోదీకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ సినిమాకు రాహుల్ కథ అందించారు. ఈ ఏడాది మార్చిలో ఆర్‌ అనే అక్షరం ఉంటే చౌన్ ధరించి కనిపించారు శ్రద్ధ. ఆ తర్వాతి నుంచి రూమర్లు మరింత ఎక్కువయ్యాయి.

‘స్త్రీ 2’పై భారీ అంచనాలు

శ్రద్ధా కపూర్ ప్రస్తుతం స్త్రీ 2 సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ హారర్ కామెడీ మూవీలో రాజ్‍కుమార్ రావ్ హీరోగా ఉన్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది. 2018లో వచ్చి సర్‌ప్రైజ్ బ్లాక్‍‍బస్టర్ అయిన స్త్రీకి ఆరేళ్ల తర్వాత సీక్వెల్‍గా ఈ మూవీ వస్తోంది. స్త్రీ 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. స్త్రీ 2 సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. నరేన్ భట కథ అందించారు. సచిన్ - జిగర్, జస్టిన్ వర్గీస్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ పతాకాలపై దినేశ్ విజన్, జ్యోతీ దేశ్‍పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

2010లోనే శ్రద్ధా కపూర్ బాలీవుడ్‍లో తెరంగేట్రం చేశారు. ఆషికీ 2, ఏక్ విలన్ చిత్రాలతో స్టార్ డమ్ సాధించారు. ఆ తర్వాతి నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ శ్రద్ధా కపూర్ బాగా ఫేమస్ అయ్యారు.

Whats_app_banner