తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Ott: ప‌ది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి దేవర విలన్ మ‌ల‌యాళం బోల్డ్‌ మూవీ - ఎందులో చూడాలంటే?

Malayalam OTT: ప‌ది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి దేవర విలన్ మ‌ల‌యాళం బోల్డ్‌ మూవీ - ఎందులో చూడాలంటే?

11 October 2024, 13:30 IST

google News
  • Malayalam OTT: ఎన్టీఆర్ దేవ‌ర ఫేమ్ షైన్ టామ్ చాకో హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ వివేకానంద‌న్‌ విరాల‌ను ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ బోల్డ్ కామెడీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకోకు జోడీగా ఐదుగురు హీరోయిన్లు న‌టించ‌డం గ‌మ‌నార్హం.

మ‌ల‌యాళం ఓటీటీ
మ‌ల‌యాళం ఓటీటీ

మ‌ల‌యాళం ఓటీటీ

ఎన్టీఆర్ దేవ‌ర‌తో పాటు మ‌రికొన్ని తెలుగు సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకో. అత‌డు హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ వివేకానంద విరాల‌ను థియేట‌ర్ల‌లో రిలీజైన దాదాపు ప‌ది నెలల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ బోల్డ్‌ కామెడీ డ్రామా మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

వందో సినిమా...

వివేకానంద విరాల‌ను మూవీ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో థియేట‌ర్ల‌లో రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. లిమిటెడ్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు క‌మ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. యాక్ట‌ర్‌గా షైన్ టాక్ చాకో వందో సినిమా ఇది. వివేకానంద‌న్‌ విరాల‌ను మూవీలో షైన్ టామ్ చాకోకు జోడీగా ఐదుగురు హీరోయిన్లు న‌టించారు. స్వాసికా విజ‌య్‌, గ్రేస్ ఆంటోనీ, మ‌రీనా, మంజు పిళ్లై, మాలా పార్వ‌తి క‌థానాయిక‌లుగా క‌నిపించారు.

బోల్డ్ కాన్సెప్ట్‌తో...

శృంగార జీవితం ప‌రంగా మ‌హిళ‌ల‌ను ఎదుర్కొనే ఓ ప్ర‌ధాన‌ స‌మ‌స్య‌ను వివేకానంద‌న్‌ విరాల‌ను మూవీలో ద‌ర్శ‌కుడు చూపించారు. వివేకానంద (షైన్ టామ్ చాకో) ఉమెనైజ‌ర్‌. భార్య సితార ప్ర‌భుత్వ ఉద్యోగి. ప‌ల్లెటూళ్లు ఉంటోంది. సిటీలో ఉద్యోగం చేస్తున్నానంటూ డ‌యానా అనే సినీ ఆర్టిస్ట్‌లో లివింగ్ రిలేష‌న్‌లో ఉంటాడు వివేకానంద‌. ఆ విష‌యాన్ని భార్య ద‌గ్గ‌ర దాచేస్తాడు. అత‌డికి మ‌రో ముగ్గురు మ‌హిళ‌ల‌తో సంబంధాలు ఉంటాయి. వివేకానంద కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతోన్న వారు అత‌డికి ఎలా బుద్ది చెప్పారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

మూడు నేష‌న‌ల్ అవార్డులు...

వివేకానంద‌న్‌ విరాల‌ను మూవీతో దాదాపు ఐదేళ్ల త‌ర్వాత ద‌ర్శ‌కుడు క‌మ‌ల్ మ‌ల‌యాళంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. మ‌ల‌యాళంలో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ అయిన క‌మ‌ల్ వంద సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మూడు నేష‌న‌ల్ అవార్డులు అందుకున్నాడు.

నాని ద‌స‌రా...

నాని ద‌స‌రా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు షైన్ టామ్ చాకో. హీరోయిన్‌పై మోజుప‌డ్డ ఊరి పెద్ద పాత్ర‌లో త‌న విల‌నిజంతో ఆక‌ట్టుకున్నాడు. నాగ‌శౌర్య రంగ‌బ‌లిలో మెయిన్ విల‌న్‌గా క‌నిపించాడు. ఇటీవ‌ల‌ రిలీజై ఎన్టీఆర్ దేవ‌ర‌లో నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్ చేశాడు.

మ‌ల‌యాళంలో మోస్ట్ బిజీయెస్ట్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా షైన్ టామ్ చాకో కొన‌సాగుతోన్నాడు. ఈ ఏడాది ప‌ది నెల‌ల వ్య‌వ‌ధిలోనే అత‌డు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ప‌ద‌కొండు సినిమాలు రిలీజ‌య్యాయి. ప్ర‌స్తుతం మ‌మ్ముట్టి బ‌జూకాతో పాటు మ‌రికొన్ని భారీ బ‌డ్జెట్ మూవీస్ చేయ‌బోతున్నాడు.

తదుపరి వ్యాసం