Recharge Plan : జియో యూజర్లకు అమెజాన్ ప్రైమ్ పూర్తిగా ఉచితం.. 84 రోజుల బెనిఫిట్
Jio Recharge Plan : రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరిగిన తర్వాత యూజర్లు ఇతర ప్రయోజనాల కోసం చూడటం మెుదలుపెట్టారు. ఏ టెలికాం కంపెనీ రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయోనని చూస్తున్నారు. అలానే జియో కస్టమర్లకు కొన్ని బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ ఉన్నాయి.
రిలయన్స్ జియోతో సహా పెద్ద టెలికాం కంపెనీలు గత నెలలో భారత మార్కెట్‌లో తమ ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్లను ఖరీదైనవిగా మార్చాయి. వాటిలో అనేక మార్పులు చేశాయి. ధరలు పెంచడంతో కొంతమంది కస్టమర్లు వేరే నెట్‌వర్క్‌కు మారిపోతున్నారు. మరికొందరేమో.. రీఛార్జ్ ప్లాన్స్‌తో వచ్చే ప్రయోజనాల కోసం చూస్తున్నారు. జియో తన ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అందించే ప్లాన్ల జాబితాలో కొన్ని మార్పులు చేసింది.
జియో కస్టమర్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెబ్ సిరీస్ లేదా మీకు ఇష్టమైన సినిమా చూడాలనుకుంటే ప్రత్యేకంగా సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాంప్లిమెంటరీ మొబైల్ సబ్ స్క్రిప్షన్ 84 రోజుల వ్యాలిడిటీతో జియో చందాదారులకు రోజువారీ డేటాను అందిస్తుంది. అంటే మొబైల్ డివైజ్‌లకు ప్రైమ్ వీడియో యాక్సెస్‌తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
జియో సబ్‌స్క్రైబర్స్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే రూ.1,029 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవాలి. రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇది కాకుండా వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లతో అపరిమిత వాయిస్ కాలింగ్ చేయవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపే ఎంపిక కూడా ఈ రీఛార్జ్‌తో అందుబాటులో ఉంది.
మిగిలిన బెనిఫిట్స్‌లో భాగంగా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ యాప్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ బెనిఫిట్ 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఎడిషన్‌తో, మీరు స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ స్క్రీన్ పై ప్రైమ్ వీడియో కంటెంట్ ను చూడవచ్చు.
అర్హులైన చందాదారుల కోసం రూ .1,029 ధర కలిగిన ఈ ప్లాన్ అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అంటే మీరు జియో 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే, 5జీ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే, రోజువారీ డేటా పరిమితి మీకు వర్తించదు. మీరు అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని పొందుతారు.