Venkatesh Web Series: ఈ సారి ఫ్యామిలీ రూటు - మ‌రో వెబ్‌సిరీస్‌కు వెంక‌టేష్ గ్రీన్ సిగ్న‌ల్ - ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?-venkatesh sign a telugu web series with this director ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh Web Series: ఈ సారి ఫ్యామిలీ రూటు - మ‌రో వెబ్‌సిరీస్‌కు వెంక‌టేష్ గ్రీన్ సిగ్న‌ల్ - ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Venkatesh Web Series: ఈ సారి ఫ్యామిలీ రూటు - మ‌రో వెబ్‌సిరీస్‌కు వెంక‌టేష్ గ్రీన్ సిగ్న‌ల్ - ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

HT Telugu Desk HT Telugu
Jun 15, 2023 06:36 AM IST

Venkatesh Web Series: రానానాయుడు త‌ర్వాత వెంక‌టేష్ మ‌రో వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ సిరీస్‌కు ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే...

వెంక‌టేష్
వెంక‌టేష్

Venkatesh Web Series: రానా నాయుడు(Rana Naidu) త‌ర్వాత వెంక‌టేష్ మ‌రో వెబ్‌సిరీస్‌లో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. రానా నాయుడు త‌ర‌హాలో బూతు కంటెంట్‌తో కాకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సిరీస్ తెర‌కెక్క‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వెంక‌టేష్‌, రానా (Rana) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన రానా నాయుడు సిరీస్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చాయి. మితిమీరిన బూతు, శృంగార స‌న్నివేశాలు ఉండ‌టంతో పోర్న్ సినిమాల‌తో ఈ సిరీస్‌ను పోల్చారు. ఇందులో బూతు త‌ప్ప క‌థే లేదంటూ కామెంట్స్ వ‌చ్చాయి.

ఫ్యామిలీ ఆడియెన్స్‌లో వెంక‌టేష్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్‌ను రానా నాయుడు సిరీస్ గ‌ట్టిగానే దెబ్బ‌కొట్టింది. ముళ్లును ముళ్లుతోనే తీయాల‌న్న సామెత‌ను ఫాలో అవుతూ ఈ సిరీస్ వ‌ల్ల త‌న ఇమేజ్‌కు ఏర్ప‌డిన డ్యామెజీని మ‌రో సిరీస్‌తో మ్యానేజ్‌ చేసేందుకు వెంక‌టేష్ ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. తెలుగులో వెబ్‌ సిరీస్‌కు (Web Series) వెంక‌టేష్‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తె లిసింది.

వెంక‌టేష్‌కు ప‌ట్టు ఉన్న ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో ఈ సిరీస్ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. ఒక్క డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌, రొమాంటిక్ సీన్స్ లేకుండా కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తోన్న‌ట్లు తెలిసింది.

ఇందులో వెంక‌టేష్ తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అత‌డికి జోడీగా సీనియ‌ర్ హీరోయిన్ న‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. ఈ వెబ్‌సిరీస్‌కు న్యూ క‌మ‌ర్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని చేప‌ట్ల‌నున్న‌ట్లు వార్త‌లొచ్చాయి.

అనివార్య కార‌ణాల వ‌ల్ల అత‌డి స్థానంలో జాతిర‌త్నాలు ద‌ర్శ‌కుడు అనుదీప్ కేవీకు డైరెక్ట‌ర్‌ సీట్‌ను అప్ప‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. ఈ ఏడాదే ఈ సిరీస్ సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం హిట్ ఫేమ్ సైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో సైంధ‌వ్(Saindhav) సినిమా చేస్తోన్నాడు వెంక‌టేష్. ఈ సినిమాతోనే పాన్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి వెంక‌టేష్ ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో న‌వాజుద్ధీన్ సిద్ధిఖీతో పాటు శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ‌, ఆండ్రియా కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తోన్నారు.

IPL_Entry_Point