Adventure Thriller OTT: ఓటీటీలోకి మలయాళం అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ - దేవర ను గుర్తుచేసే యాక్షన్ ఎపిసోడ్స్!
Adventure Thriller OTT: మలయాళం యాక్షన్ మూవీ కొండల్ ఓటీటీలోకి వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 18 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఆంథోనీ వర్గీస్, రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో షార్క్ చేప యాక్షన్ సీన్ ఎన్టీఆర్ దేవరను పోలి ఉంటుంది.
Adventure Thriller OTT: మలయాళం మూవీ కొండల్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీలో అంథోనీ వర్గీస్, గౌతమీనాయర్ హీరోహీరోయిన్లుగా నటించారు. కన్నడ అగ్ర దర్శకుడు రాజ్ బీ శెట్టి కీలక పాత్రలో నటించాడు. థియేటర్లలో యాక్షన్‌సీక్వెన్స్‌లతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వస్తోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
కొండల్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 18 నుంచి ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
కొండల్ మూవీ కథ ఇదే...
కొండల్ మూవీకి అజీత్ మాంపల్లి దర్శకత్వం వహించాడు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇమాన్యుయేల్‌కు (అంథోనీ వర్గీస్) కోపం ఎక్కువ. కుటుంబమే ప్రాణంగా బతుకుతుంటాడు. అన్నయ్య డానీ (రాజ్ బీ శెట్టి) మరణంతో ఇమాన్యుయేల్ జీవితం మొత్తం తలక్రిందులవుతుంది.
తాగుడుకు బానిసగా మారుతారు. చేపలు పట్టే విషయంలో ఓ వర్గంతో జరిగిన గొడవలో పోలీసులు ఇమాన్యుయేల్‌ను ఊరి నుంచి బహిష్కరిస్తారు. ఆ తర్వాత మరో హార్బర్‌లో పనిచేయడానికి వచ్చిన అతడికి జూడ్, మైఖేల్‌లతో గొడవలు మొదలవుతాయి. అక్కడే అన్నయ్య మరణానికి సంబంధించిన రహస్యం ఇమాన్యుయేల్‌కు తెలుస్తుంది? అదేమిటి? అన్న మరణంపై అతడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఈ మూవీ కథ.
దేవర మూవీ తో పోలిక...
కొండల్ మూవీలో హీరో ఆంథోనీ వర్గీస్ షార్క్ చేపతో ఫైట్ సీన్ ఎన్టీఆర్ దేవర మూవీని పోలి ఉంటుంది. కొండల్‌లోని ఆ సీన్‌ను దేవరతో కంపేర్ చేస్తూ పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. దేవర 330 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా కొండల్ మాత్రం ఎనిమిది కోట్ల బడ్జెట్ అంటూ పేర్కొంటున్నారు.
కొండల్‌లో ఆంథోనీ వర్గీస్‌పై తెరకెక్కిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. రొటీన్ రివేంజ్ డ్రామాతో పాటు కథలో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్సవ్వడంతో కొండల్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది.
మమ్ముట్టి టర్బోతో..
మమ్ముట్టి హీరోగా నటించిన టర్బో మూవీతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు రాజ్ బీ శెట్టి. మమ్ముట్టి మూవీలోనూ విలన్‌గా కనిపించాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మలయాళంలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఆంథోనీ వర్గీస్. అంగమలై డైరీస్‌తో హీరోగా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆంథోనీ వర్గీస్ జల్లికట్లు, అజగజంతరం సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అతడు హీరోగా నటించిన ఆర్‌డీఎక్స్ మూవీ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది.