Mallika Sherawat : ఈ సెక్స్ సింబల్ ఇమేజ్ను ఎలా తొలగించుకోవాలో ఏంటో?
Mallika Sherawat: తనకున్న సెక్స్ సింబల్ ఇమేజ్ను ఎలా తొలగించుకోవాలో అర్థం కావడం లేదని తెగ ఫీలవుతోంది బాలీవుడ్ భామ మల్లికా షెరావత్. ఇంతకీ ఆమె బాధేంటో మీరూ చూడండి.
Mallika Sherawat: బాలీవుడ్లో ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన నటి మల్లికా షెరావత్. రెండు దశాబ్దాల కిందటే లిప్ లాక్‌లు, బికినీలతో పిచ్చెక్కించింది. మర్డర్ మూవీతో సిల్వర్ స్క్రీన్కు పరిచయమైన ఆమె.. ఆ సినిమాలోనే రెచ్చిపోయి నటించింది. దీంతో ఆమెకు సెక్స్ సింబల్ అనే ఇమేజ్ వచ్చేసింది. ఆమె వికీపీడియా పేజ్‌లో ఆమె ఇండియాలోని సెక్స్ సింబల్స్‌లో ఒకరు అని ఉంటుంది. అయితే దీనిపై ఆమె స్పందించింది.
"ఇలా ఎవరు రాస్తారో కూడా నాకు అర్థం కాదు. వికీపీడియాను ఎవరైనా సీరియస్‌గా తీసుకుంటారా? నేనైతే తీసుకోను. ఇప్పుడేం చేస్తాను. ఈ ఇమేజ్ను ఎలా మార్చుకోగలను? ఎలాగో కూడా నాకు తెలియదు. అందుకే దానిని నేను పట్టించుకోను. నన్ను ఎలా చూడాలన్నది ఆ వ్యక్తుల ఇష్టం. నేను చేసే పని మీదే ఫోకస్ చేస్తాను" అని మల్లికా షెరావత్ చెప్పింది.
మిగతా బాలీవుడ్ నటులతో పోలిస్తే మల్లిక ఇంటర్నెట్, పీఆర్‌కు దూరంగా ఉంటుంది. వార్తల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. షూటింగ్‌ల కోసం ఇండియా, అమెరికా మధ్య తిరుగుతూ ఉంటుంది. "దీని గురించి ఏం చెప్పాలి. ఈ పీఆర్లాంటి వాటికి నేను దూరంగా ఉన్నాను. నా గురించి నేనే చెప్పుకుంటాను. నేను చాలా నిజాయతీపరురాలిని. అందుకే చాలాసార్లు దాని వల్లే ఇబ్బంది పడ్డాను. నేను ఇతర నటీనటులు ఏం చేస్తున్నారు? వాళ్ల పీఆర్లు ఏం చేస్తున్నారన్నది పట్టించుకోను" అని మల్లికా చెప్పింది.
ఈ మధ్యే ఆమె RK/RKay మూవీలో కనిపించింది. ఇక సోషల్ మీడియా గేమ్‌ను కూడా తాను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేసింది. "నాకు సోషల్ మీడియా నచ్చదు. అదంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను ఇంటర్నెట్లో లేను. అక్కడ చాలా నెగటివిటీ ఉంటుంది. నా గురించి ఎవరో మాట్లాడుకోవడం నాకు ఇష్టం ఉండదు" అని మల్లిక చెప్పింది.