తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sharwanand: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శ‌ర్వానంద్ పాన్ ఇండియా మూవీ - ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Sharwanand: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శ‌ర్వానంద్ పాన్ ఇండియా మూవీ - ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

19 September 2024, 13:56 IST

google News
  • Sharwanand: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శ‌ర్వానంద్ ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌న్నాడు. ఈ మూవీని గురువారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేవారు. ఇందులో 1960ల కాలం నాటి యువ‌కుడిగా శ‌ర్వానంద్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

 శ‌ర్వానంద్
శ‌ర్వానంద్

శ‌ర్వానంద్

Sharwanand: ఇప్ప‌టికే రెండు సినిమాల్లో న‌టిస్తూ హీరోగా బిజీగా ఉన్నాడు శ‌ర్వానంద్‌. తాజాగా మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. శ‌ర్వానంద్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబోలో ఓ మూవీ రాబోతోంది. గురువారం ఈ సినిమాను ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో...

1960 టైమ్ పీరియ‌డ్‌లో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. నార్త్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణ‌, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతాల నేప‌థ్యంలో సంప‌త్ నంది ఈ క‌థ‌ను రాసుకున్న‌ట్లు తెలిసింది. భ‌యంతో నిండిన ఓ ప్రాంతంలోని అనేక ప్ర‌శ్న‌ల‌కు ఓ యువ‌కుడు సృష్టించిన ర‌క్త‌పాతం ఎలా స‌మాధానాలు చెప్పింద‌నే పాయింట్‌తో సంప‌త్ నంది ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు చెబుతోన్నారు.

శ‌ర్వానంద్ మేకోవ‌ర్‌...

ఇందులో శ‌ర్వానంద్ 1960ల కాలం నాటి ఓ యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ రోల్ కోసం శ‌ర్వానంద్ కంప్లీట్ మేకోవ‌ర్ అవుతోన్న‌ట్లు తెలిసింది. అత‌డి లుక్, బాడీలాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. గురువారం రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది.

38వ మూవీ...

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న 38వ మూవీ ఇది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తోన్నాడు. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ క్రియేష‌న్స్ ప‌తాకంపై కేకేరాధామోహ‌న్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రూపొందుతోన్న ఈ మూవీని తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

వెబ్ సిరీస్ ద‌ర్శ‌కుడితో...

ప్ర‌స్తుతం తెలుగులో శ‌ర్వానంద్ రెండు సినిమాలు చేస్తోన్నాడు. లూజ‌ర్ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ కంక‌ర ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ బేస్డ్ యాక్ష‌న్ మూవీని అంగీక‌రించాడు శ‌ర్వానంద్‌. యూవీ క్రియేష‌న్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో శ‌ర్వానంద్‌కు జోడీగా మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

రామ్ అబ్బ‌రాజు...

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు రామ్ అబ్బ‌రాజుతో శ‌ర్వానంద్ ఓ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

డైరెక్ట‌ర్‌గా...రైట‌ర్‌గా...

డైరెక్ట‌ర్‌గా ఏమైంది ఈవేళ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సంప‌త్ నంది. రామ్ చ‌ర‌ణ్‌తో ర‌చ్చ, ర‌వితేజ‌తో బెంగాళ్ టైగ‌ర్ సినిమాలు చేశాడు. గోపీచంద్‌తో సీటీమార్‌, గౌత‌మ్ నందా సినిమాల‌ను తెర‌కెక్కించాడు సంప‌త్ నంది. ద‌ర్శ‌కుడిగానే కాకుండా ఓదెల రైల్వేస్టేష‌న్‌, పేప‌ర్ లాంటి చిన్న సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

ప్ర‌స్తుతం త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఓదెల 2 మూవీకి సంప‌త నంది క‌థ‌ను అందించారు. శ‌ర్వానంద్ మూవీ కంటే ముందు సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో సంప‌త్ నంది ఓ సినిమా చేయాల్సింది. . అనౌన్స్‌మెంట్ త‌ర్వాత బ‌డ్జెట్ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల మూవీ ఆగిపోయింది.

తదుపరి వ్యాసం