Manamey OTT: ఓటీటీలోకి శర్వానంద్ రొమాంటిక్ కామెడీ మూవీ మనమే - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?
Manamey OTT: శర్వానంద్ మనమే మూవీ ఓటీటీలోకి రాబోతోంది. జూలై 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

Manamey OTT: శర్వానంద్ మనమే మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న మనమే మూవీ నిర్మాతలకు మాత్రం లాభాలను తెచ్చిపెట్టింది. శర్వానంద్ కామెడీ టైమింగ్ ఆకట్టుకోవడంతో పాటు మనమే రిలీజ్ టైమ్‌లో పెద్ద సినిమాలు ఏవి పోటీగా బాక్సాఫీస్ బరిలో నిలవకపోవడంతో బ్రేక్ ఈవెన్‌ను టార్గెట్‌ను చేరుకొని హిట్టు సినిమా లిస్ట్‌లో మనమే చేరింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో...
తాజాగా శర్వానంద్ మనమే మూవీ ఓటీటీలోకి రాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జూలై 12 నుంచి మనమే మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రివీల్ కానున్నట్లు సమాచారం.
పదహారు పాటలు...
మనమే సినిమాలో శర్వానంద్, కృతిశెట్టితో పాటు సీరత్‌కపూర్, ఆయేషాఖాన్, రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. పదహారు పాటలతో ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేశారు.
మనమే కథ ఇదే...
విక్రమ్ (శర్వానంద్) ప్రాణ స్నేహితుడు అనురాగ్, అతడి భార్య ఓ ప్రమాదంలో కన్నుమూస్తారు. అనురాగ్ కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) సంరక్షణ బాధ్యత విక్రమ్‌తో పాటు సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. ఖుషి కోసంపెళ్లికాకుండానే ఇద్దరు తల్లిదండ్రులుగా మారాల్సివస్తుంది. ఖుషిని పెంచే విషయంలో విక్రమ్, సుభద్రలకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? వీరిద్దరి జీవితాలతో సంబంధం ఉన్న జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్), కార్తీక్ ( శివ కందుకూరి) ఎవరు? సుభద్రకు తన మనసులో ఉన్న ప్రేమను విక్రమ్ ఎలా వ్యక్తం చేశాడు? అన్నదే ఈ మూవీ కథ.
హాలీవుడ్ మూవీ ఆధారంగా...
మనమే మూవీ హాలీవుడ్ మూవీ లైఫ్ యాజ్ వీ నో ఇట్ ఆధారంగా రూపొందినట్లు ప్రచారం జరిగింది. హాలీవుడ్ మూవీ స్టోరీ నుంచి ఇన్‌స్పైర్ అయిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. కాగా మనమే మూవీలో శ్రీరామ్ ఆదిత్య కొడుకు విక్రమ్ ఆదిత్య ఓ కీలక పాత్రలో కనిపించాడు.
రెండేళ్లు గ్యాప్…
ఒకే ఒక జీవితం తర్వాత సినిమాలకు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు శర్వానంద్. 2022లో రిలీజైన ఈ మూవీ తర్వాత మనమేతో లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించాడు. మరోవైపు తెలుగులో కృతిశెట్టి వరుస డిజాస్టర్స్‌కు మనమే మూవీతో బ్రేక్ పడింది. ఉప్పెన తర్వాత తెలుగులో కస్టడీ, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్‌తో పాలు పలు సినిమాలు చేసింది. అవేవీ ఆమెకు సక్సెస్‌లను తెచ్చిపెట్టలేకపోయాయి.
రాజశేఖర్...
మనమే తర్వాత శర్వానంద్ యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తోన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో అభిలాష్‌రెడ్డి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
టాపిక్