తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dunki Ott Streaming: షారుఖ్‌ స‌ర్‌ప్రైజ్ - సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన డంకీ - - ఎందులో చూడాలంటే?

Dunki OTT Streaming: షారుఖ్‌ స‌ర్‌ప్రైజ్ - సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన డంకీ - - ఎందులో చూడాలంటే?

15 February 2024, 8:07 IST

  • Dunki OTT Streaming: షారుఖ్‌ఖాన్ డంకీ మూవీ సెలైంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బాలీవుడ్ మూవీ రిలీజైంది. డంకీ మూవీకి రాజ్‌కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

షారుఖ్ ఖాన్ డంకీ ఓటీటీ స్ట్రీమింగ్‌
షారుఖ్ ఖాన్ డంకీ ఓటీటీ స్ట్రీమింగ్‌

షారుఖ్ ఖాన్ డంకీ ఓటీటీ స్ట్రీమింగ్‌

Dunki OTT Streaming: షారుఖ్‌ఖాన్ లేటెస్ట్‌ మూవీ డంకీ ఎలాంటి ముంద‌స్తు ప్ర‌చారం లేకుండా సెలైంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజైంది. వాలెంటైన్స్ డే రోజు షారుఖ్‌ఖాన్ నుంచి ఓ స‌ర్‌ప్రైజ్ ఉండ‌బోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. డంకీ రిలీజ్ డేట్ గురించి చెబుతార‌ని ఓటీటీ ఆడియెన్స్ ఊహించారు. కానీ వారి ఊహ‌ల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ ఏకంగా డైరెక్ట్‌గా సినిమానే రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది గంట‌ల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లోట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో డంకీ చేరింది. టాప్ ఫైవ్‌లో ఒక‌టిగా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య పెరుగుతూనే ఉన్న గ్యాప్! మీమ్‍లతో ఫ్యాన్స్ వార్

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

Jayanthi Kannappan: కొడుకు మృతితో బాధ.. ఇద్దరి మధ్య దూరం: లలితతో ప్రకాశ్ రాజ్ విడాకులపై జయంతి కన్నప్పన్ వ్యాఖ్యలు

470 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

డంకీ మూవీకి రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. షారుఖ్‌ఖాన్‌, రాజ్‌కుమార్ హిరాణీ కాంబోలో తెర‌కెక్కిన ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ కాంబోపై ఉన్న అంచ‌నాల కార‌ణంగా ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్ని ఉంటాయి. క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో ఈ సినిమా స‌క్సెస్ కాలేక‌పోయింది. ప్ర‌భాస్ స‌లార్‌కు పోటీగా డిసెంబ‌ర్ 21న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో 470 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇండియా వైడ్‌గా ఈ మూవీ 262 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ఓవ‌ర్‌సీస్‌లో 197 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా గ‌త ఏడాది బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ టెన్ మూవీస్‌లో ఒక‌టిగా డంకీ నిలిచింది. 120 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టించిన గ‌త సినిమాలు ప‌ఠాన్‌, జ‌వాన్ బాక్సాఫీస్ వ‌ద్ద వెయ్యి కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌గా డంకీ మాత్రం వాటిలో స‌గం వ‌సూళ్ల‌నే మాత్ర‌మే ద‌క్కించుకొని నిరాశ‌ప‌రిచింది.

డంకీ రూట్స్‌లో...

డంకీ రూట్స్‌లో అక్ర‌మ‌ మార్గాల ద్వారా విదేశాల‌కు వ‌ల‌స వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించే వారి వ్య‌థ‌లతో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డంకీ మూవీని తెర‌కెక్కించాడు రాజ్ కుమార్ హిరాణీ. హ‌ర్డీ సింగ్ (షారుఖ్‌ఖాన్‌), మ‌న్నుతో (తాప్సీ) పాటు ముగ్గురు స్నేహితులు త‌మ స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌డానికి ఇంగ్లాండ్ వెళ్లాల‌ని అనుకుంటారు కానీ వారంద‌రూ వీసా టెస్ట్‌లో ఫెయిల‌వుతారు. అడ్డ‌దారుల్లో ఇంగ్లాండ్‌కు వెళ్లాల‌ని నిశ్చ‌యించుకుంటారు. ఈ ప్ర‌యాణంలో వారికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? మ‌న్నును ప్రేమించిన హ‌ర్డీ సింగ్ త‌న ప్రేమ‌ను ఆమెకు వ్య‌క్తం చేశాడా? ప్రియురాలిని క‌ల‌వాల‌ని క‌ల‌లు క‌న్న‌ సుఖీ జీవితం ఎలా విషాదంగా ముగిసింది అన్న‌దే డంకీ మూవీ క‌థ‌.

సౌత్ డైరెక్ట‌ర్‌తోనే నెక్స్ట్ మూవీ...

డంకీ సినిమాలో హ‌ర్డీ సింగ్‌గా షారుఖ్‌ఖాన్ త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా తాప్సీ క‌థానాయిక‌గా న‌టించింది. విక్కీ కౌశ‌ల్ చిన్న పాత్రే అయినా ఎమోష‌న‌ల్ యాక్టింగ్‌తో అభిమానుల‌ను మెప్పించాడు. డంకీ త‌ర్వాత ఇండియ‌న్ సినిమా పితామ‌హుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న మేడిన్ ఇండియా మూవీకి రాజ్‌కుమార్ హిరాణీ స్టోరీని అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోండ‌టం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు డంకీ త‌ర్వాత షారుఖ్‌ఖాన్ నెక్ట్స్ మూవీ ఏద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌వాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ నేప‌థ్యంలో సౌత్ డైరెక్ట‌ర్‌తోనే త‌న నెక్స్ట్ మూవీని షారుఖ్‌ఖాన్ ప్లాన్ చేసిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం