Vishwak Sen: అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్‌సేన్ ...అఫిషీయ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..-vishwaksen to team up with action arjun ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్‌సేన్ ...అఫిషీయ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..

Vishwak Sen: అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్‌సేన్ ...అఫిషీయ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..

HT Telugu Desk HT Telugu
Jun 19, 2022 01:40 PM IST

విల‌క్ష‌ణ‌ పాత్ర‌ల‌తో నటుడిగా తెలుగు ప్రేక్ష‌కుల్ని అలరించారు యాక్ష‌న్ కింగ్ అర్జున్‌. తాజాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. విశ్వ‌క్‌సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆదివారం వెలువ‌డింది.

<p>విశ్వ‌క్‌సేన్</p>
<p>విశ్వ‌క్‌సేన్</p> (twitter)

టాలీవుడ్ లో మ‌రో కొత్త కాంబినేషన్ కుదిరింది. సీనియ‌ర్ హీరో అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్‌సేన్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతోనే ద‌ర్శ‌కుడిగా అర్జున్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఇందులో ఆయ‌న త‌న‌య ఐశ్వ‌ర్య అర్జున్ హీరోయిన్‌గా న‌టించ‌బోతుండటం  ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది. అంతేకాకుండా తండ్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమాతోనే ఐశ్వ‌ర్య తెలుగులో తొలి అడుగు వేయ‌బోతున్న‌ది.

 ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఆదివారం వెలువ‌డింది. రోడ్ జ‌ర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ప‌చ్చ‌టి పొలాల మ‌ధ్య నుండి కారు వెళుతున్న ఓ ప్రీలుక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాకుండా శ్రీరామ్ పిల్మ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ప‌తాకంపై అర్జున్ స్వ‌యంగా నిర్మిస్తున్నారు. 

తెలుగుతో పాటు క‌న్న‌డంలో సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్