Ayalaan Movie: అయలాన్ తెలుగులో రిలీజ్ కాకుండా షారుఖ్‌ఖాన్ అడ్డుకున్నాడా?- ప్రొడ్యూసర్స్ ట్వీట్ వైరల్
Ayalaan Movie: శివకార్తికేయన్ అయలాన్ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాకపోవడానికి గల కారణాల్ని నిర్మాత వెల్లడించారు. షారుఖ్‌ఖాన్ ఖాన్‌కు చెందిన రెడ్‌చిల్లీస్ వీఎఫ్ఎక్స్ కంపెనీ వల్లే అయలాన్ తెలుగులో రిలీజ్ కాలేదంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Ayalaan Movie: శివకార్తికేయన్ అయలాన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు గుంటూరుకారం, సైంధవ్, హనుమాన్‌తో పాటు నా సామిరంగ నిలవడంతో అయలాన్‌కు థియేటర్లు దొరకలేదు.
దాంతో రెండు వారాలు ఆలస్యంగా జనవరి 26న తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ప్రమోషన్స్ భారీగా నిర్వహించారు. ఈ ప్రమోషన్స్‌లో స్వయంగా శివకార్తికేయన్ కూడా పాల్గొన్నాడు. కానీ అనివార్య కారణాల వల్ల అయలాన్ తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాలేకపోయింది. ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా ఈ మూవీ పోస్ట్‌పోన్ అయినట్లు ప్రచారం జరిగింది.
కారణం ఇదే....
అయలాన్ తెలుగు వెర్షన్ పోస్ట్‌పోన్ కావడానికి గల కారణాన్ని ప్రొడక్షన్ హౌజ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. షారుఖ్‌ఖాన్‌పై ఇన్‌డైరెక్ట్‌గా అయలాన్ ప్రొడ్యూసర్స్ ఫైర్ అయ్యారు. షారుఖ్‌ఖాన్ వీఎఫ్ఎక్స్ కంపెనీ రెడ్‌చిల్లీస్ అయలాన్ తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాలేదంటూ సెటైరికల్‌గా వెల్లడించారు. గుడ్‌జాబ్ రెడ్‌చిల్లీస్ డీఐ అంటూ షారుఖ్‌ఖాన్ కంపెనీ ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రొడక్షన్ హౌజ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. షారుఖ్‌ఖాన్‌తో పాటు రెడ్‌చిల్లీస్‌పై శివకార్తికేయన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు...
ఇంతకీ ఏం జరిగిందంటే?
అయలాన్ సినిమా కథ చాలా వరకు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ప్రధానంగా తెరకెక్కింది. ఇండియాలోనే హయ్యెస్ట్ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ మూవీలోను ఉపయోగించారు. దాదాపు 4500 షాట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అయలాన్‌కు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ను షారుఖ్‌ఖాన్‌కు చెందిన రెడ్‌చిల్లీస్ వీఎఫ్ఎక్స్ కంపెనీ అందించినట్లు తెలిసింది. ఈ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌కు వర్క్‌కు సంబంధించి ప్రొడ్యూసర్స్ భారీగా షారుఖ్ కంపెనీకి బకాయిపడినట్లు తెలిసింది.
ఆ డబ్బులను సకాలంలో చెల్లించకపోవడంతో తెలుగు వెర్షన్ కంటెంట్ నిర్మాతలకు రెడ్‌చిల్లీస్ కంపెనీ ఇవ్వకుండా తమ దగ్గరే అట్టిపెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే తెలుగు వెర్షన్ జనవరి 26న రిలీజ్ కాలేదని అంటున్నారు. రెడ్‌చిల్లీస్ వీఎఫ్ఎక్స్ కంపెనీ వల్లే సినిమా వాయిదాపడటంతో షారుఖ్‌ఖాన్ కంపెనీపై కోపంతోనే ప్రొడ్యూసర్స్ ఈ ట్వీట్ చేసినట్లు సమాచారం. అయలాన్ తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కావడం అనుమానమేనని అంటున్నారు. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్...
అయలాన్ సినిమాలో శివకార్తికేయన్‌కు జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్‌హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో ఆర్ రవికుమార్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. విధ్వంసానికి కుట్రలను పన్నిన ఓ సైంటిస్ట్‌ను ఏలియన్ సహాయంతో ఓ యువకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నది అయలాన్ మూవీ కథ. దాదాపు ఆరేళ్ల పాటు ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకున్నది. కోలీవుడ్‌లో ఎక్కువ కాలం షూటింగ్‌ను జరుపుకున్న మూవీగా అయలాన్‌నిలిచింది. అయలాన్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.
అయలాన్ 2...
అయలాన్ ఓటీటీ హక్కులను సన్ నెక్స్ట్ దక్కించుకున్నది. ఫిబ్రవరి 9 తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయలాన్ సీక్వెల్‌గా అయలాన్ 2 రాబోతోంది. ఇటీవలే సీక్వెల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.