Taapsee Pannu New Car: కొత్త లగ్జరీ కారు కొన్న తాప్సీ.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!-tapsee pannu buys mercedes maybach gls 600 suv know the price of this car ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Taapsee Pannu New Car: కొత్త లగ్జరీ కారు కొన్న తాప్సీ.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

Taapsee Pannu New Car: కొత్త లగ్జరీ కారు కొన్న తాప్సీ.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 18, 2023 06:34 PM IST

Taapsee Pannu New Car: హీరోయిన్ తాప్సీ పన్ను తాజాగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశారు. మెర్సెడెస్ కంపెనీకి చెందిన ఆ ప్రీమియమ్ కారు ధర ఎంతంటే..

Tapsee Pannu New Car: కొత్త లగ్జరీ కారు కొన్న తాప్సీ.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..! (Photo: Twitter)
Tapsee Pannu New Car: కొత్త లగ్జరీ కారు కొన్న తాప్సీ.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..! (Photo: Twitter)

Taapsee Pannu New Car: టాలీవుడ్‍లో కొన్నేళ్లు స్టార్ హీరోయిన్‍గా వెలుగొందిన తాప్సీ పన్ను ప్రస్తుతం ఫుల్‍గా బాలీవుడ్‍పైనే ఫోకస్ పెట్టారు. 2010లో ఝుమ్మంది నాదం చిత్రంతో తెరంగేట్రం చేశారు తాప్సీ. ఆ తర్వాత చాలా తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే, గత ఏడేళ్లుగా బాలీవుడ్‍పైనే ఎక్కువ దృష్టి పెట్టారు తాప్సీ. వరుసగా హిందీ సినిమాలు చేస్తున్నారు. అరుదుగా మాత్రమే వేరే భాషల చిత్రాలు చేస్తున్నారు. మొత్తంగా టాలెంటెడ్ నటిగా తాప్సీ పేరుతెచ్చున్నారు. తాజాగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశారు తాప్సీ. వినాయక చవితి అయిన నేడు (సెప్టెంబర్ 18) నేడు ఈ కారు తీసుకున్నారు. వివరాలివే..

మెర్సెడెస్ మేబారచ్ జీఎల్ఎస్ 600 (Mercedes Maybach GLS 600) ఎస్‍యూవీ కారును తాప్సీ పన్ను కొనుగోలు చేశారు. ఈ కారు ఎక్స్-షోరూం ధర రూ.2.92కోట్లుగా ఉంది. మొజావే సిల్వర్ సింగిల్ టోన్ కలర్ ఫినిష్ ఉన్న కారును ఆమె తీసుకున్నారు. ఆన్‍రోడ్ ధరను బట్టి చూస్తే ఈ కారు ధర రూ.3కోట్లు దాటి ఉంటుంది. లాంజ్ స్టైల్ సీటింగ్, పానరామిక్ సన్‍రూఫ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, మసాజింగ్ సీట్లు, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, వర్చువల్ అసిస్టెంట్, స్మాల్ రిఫ్రిజిరేటర్ సహా చాలా అడ్వాన్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఈ కారు కలిగి ఉంటుంది.

మెర్సెడెస్ మేబారచ్ జీఎల్ఎస్ 600 కారులో 4.0-లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ పవర్ ఫుల్ ఇంజిన్ ఉంటుంది. 9జీ ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కారు వస్తోంది. 550 హెచ్‍పీ వరకు పవర్, 730 ఎన్ఎం వరకు పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేయలగదు. 12.3 ఇంచుల ఇన్ఫోటైన్‍మెంట్ టచ్ స్క్రీన్, 12.3 ఇంచుల డ్రైవర్ డిస్‍ప్లే కూడా ఉంటాయి. మొత్తంగా చాలా లగ్జరీ ఫీచర్లు ఈ మెర్సెడెస్ కారులో ఉంటాయి.

కాగా, షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న డుంకీ సినిమాలో తాప్సీ ప్రస్తుతం నటిస్తున్నారు. ఫిర్ ఆయీ హసీన్ దుల్‍రుబా అనే చిత్రం కూడా చేస్తున్నారు.

IPL_Entry_Point