Ashwatthama Movie: షాహిద్ కపూర్ కెరీర్‌లో ఫస్ట్ మైథలాజికల్ మూవీ - 200 కోట్ల బడ్జెట్ - తెలుగులోనూ రిలీజ్
20 March 2024, 9:27 IST
Ashwatthama Movie: అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్ కంటిన్యూస్ పేరుతో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఓ మైథలాజికల్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.
Ashwatthama Movie
Ashwatthama Movie: మహాభారతంలో అశ్వత్థామ పాత్రను ఆధునిక యుగానికి పరిచయం చేసేందుకు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సచిన్ రవి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ సినిమాను హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
అశ్వత్థామ బతికే ఉన్నడా?
అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నారని చాలా మంది నమ్ముతుంటారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన నేటి ఆధునిక యుగంలో అశ్వత్థామ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు అన్నది ఈ సినిమాలో చూపించబోతున్నమని దర్శకనిర్మాతలు తెలిపారు.
అమర జీవిగా వేల సంవత్సరాలు అశ్వత్థామ ఎలా బతికి ఉన్నాడు అనే పాయింట్‌ను కూడా చూపించబోతోన్నారు. హై యాక్షన్ ప్యాక్‌డ్ సీన్లతో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గతం, వర్తమానం మధ్య జరిగే యుద్ధాన్ని ఈ సినిమాలో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేలా ఆవిష్కరిస్తున్నారు. ప్రతి సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని సినిమా మేకర్స్ చెబుతోన్నారు.
ప్రేక్షకుల హృదయాలపై శాశ్వత ముద్ర...
అశ్వత్థామ గురించి నిర్మాత జాకీ భగ్నాని మాట్లాడుతూ..మేము చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ కేవలం వినోదం మాత్రమే కాదు.. ప్రేక్షకులకు మరిచిపోలేని ఓ అద్భుతమైన అనుభవాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తాం. ప్రేక్షకుల హృదయాలు, మనస్సులపై శాశ్వత ముద్రను వేసేలా ఉండాలని చూస్తాం.
బడే మియా చోటే మియా తర్వాత, నేను ఊహించని సినిమా చేయాలనుకున్నాను. అశ్వత్థామ కథ మనందరికీ తెలిసిందే. ప్రస్తుత ఆధునిక కాల పరిస్థితులపై లెజెండ్ అయిన అశ్వత్థామ ఎలాంటి యుద్ధం చేశాడన్నది హైటెక్నికల్ వాల్యూస్, గ్రాఫిక్స్‌తో ఈ సినిమాలో చూపించబోతున్నట్లు జాకీ భగ్నానీ పేర్కొన్నాడు.
అమరత్వం...
దర్శకుడు సచిన్ రవి మాట్లాడుతూ.. అమరత్వం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇందులో చాలా భావోద్వేగాలు, నాటకీయత ఉంటుంది. మహాభారతంలోని అశ్వత్థామ ఈనాటికీ జీవిస్తున్నాడని నమ్ముతుంటారు. అతను అమరజీవి అని భావిస్తుంటాం. అతడి జీవితాన్ని లోతుగా పరిశోధించాలనే ఆలోచన నుంచే ఈ సినిమా పుట్టింది.
నేటి ఆధునిక యుగంలో అశ్వత్థామ జీవిస్తే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటివరకు బాలీవుడ్ స్క్రీన్‌పై రాని యాక్షన్ అంశాలతో విజువల్ వండర్‌గా ఈ మూవీ ఉంటుందని దర్శకుడు అన్నాడు. ఊహకు, వాస్తవాలకు మధ్య జరిగే అసామన్యమైన కథను, గాథను 'అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్ చూపించబోతున్నట్లు పేర్కొన్నాడు.
రామ్‌చరణ్ అనుకున్నారు...
పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌లు అశ్వత్థామ సినిమాను నిర్మిస్తున్నాడు. సచిన్ రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా త్వరలోనే థియేటర్‌లలో రిలీజ్ చేయబోతున్నారు. తొలుత ఈ మైథలాజికల్ మూవీలో హీరోగా విక్కీ కౌశల్‌ను అనుకున్నారు.డేట్స్ సర్ధుబాటు కాక అతడు తప్పుకోవడంతో రామ్‌చరణ్, యశ్‌తో పాటు చాలా మంది సౌత్ హీరోల పేర్లు వినిపించాయి. చివరకు ఈ అవకాశం షాహిద్‌కపూర్‌ను వరించింది.దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మైథలాజికల్ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
అశ్వాత్థామ ది సాగా కంటిన్యూస్ పేరుతో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఓ మైథలాజికల్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.