తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tv News: టీవీ ఛానెల్‍లోకి నాని మాస్ యాక్షన్ సినిమా వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే

TV News: టీవీ ఛానెల్‍లోకి నాని మాస్ యాక్షన్ సినిమా వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే

23 December 2024, 8:27 IST

google News
    • Saripodhaa Sanivaaram Telecast: సరిపోదా శనివారం చిత్రం టీవీల్లోకి వచ్చేందుకు రెడీ అయింది. టెలికాస్ట్ డేట్, టైమ్ కూడా ఖరారయ్యాయి. త్వరలో అంటూ ఇంతకాలం ఊరించిన టీవీ ఛానెల్ ఇప్పుడు.. వివరాలను వెల్లడించింది.
TV News: టీవీ ఛానెల్‍లోకి నాని మాస్ యాక్షన్ సినిమా వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే
TV News: టీవీ ఛానెల్‍లోకి నాని మాస్ యాక్షన్ సినిమా వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే

TV News: టీవీ ఛానెల్‍లోకి నాని మాస్ యాక్షన్ సినిమా వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సరిపోదా శనివారం’ బంపర్ హిట్ కొట్టింది. నానికి హ్యాట్రిక్ హిట్‍ను అందించింది. ఈ చిత్రం సుమారు రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సరిపోదా శనివారం మూవీ ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. కమర్షియల్‍గా సక్సెస్ అయింది. ఓటీటీలోనూ అదరగొట్టింది. సరిపోదా శనివారం చిత్రం ఇప్పుడు జీ తెలుగు టీవీ ఛానెల్‍లోకి వచ్చేందుకు రెడీ అయింది.

టెలికాస్ట్ ఎప్పుడంటే..

సరిపోదా శనివారం సినిమా డిసెంబర్ 29వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. కొంతకాలంగా త్వరలో అంటూ ఈ ఛానెల్ ఊరిస్తూ వచ్చింది. ఇప్పుడు టెలికాస్ట్ డేట్ టైమ్ రివీల్ చేసింది.

ప్రీమియర్ కోసం నాని ప్రమోషన్

సరిపోదా శనివారం చిత్రం టీవీ ప్రీమియర్ కోసం కూడా ప్రమోషన్ చేశారు నేచురల్ స్టార్ నాని. జీ తెలుగులో సరిగమప సింగింగ్ షోకు వెళ్లారు. నానితో పాటు హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 22న టెలికాస్ట్ అయింది. ఇలా సరిపోదా శనివారం టీవీ ప్రీమియర్ కోసం కూడా ప్రమోషన్‍లో నాని పాల్గొన్నారు.

ఓటీటీలో అదుర్స్.. టీఆర్పీపై ఆసక్తి

సరిపోదా శనివారం చిత్రం థియేటర్లలో దుమ్మురేపింది. ఓటీటీలోనూ అదరగొట్టింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రానికి భారీగా వ్యూస్ వచ్చాయి. చాలా రోజుల పాటు నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో నిలిచింది. మరోసారి నాని చిత్రం ఓటీటీలో దుమ్మురేపింది. అయితే, టీవీల్లో ఇటీవల సినిమాలకు టీఆర్పీ తక్కువగానే వస్తోంది. అయితే నాని చిత్రాలకు మాత్రం టీవీల్లోనూ క్రేజ్ బాగానే ఉంటుంది. దీంతో సరిపోదా శనివారం మూవీకి డిసెంబర్ 29న టీవీల్లో ఎలాంటి టీఆర్పీ వస్తుందోననే ఆసక్తి నెలకొని ఉంది.

సరిపోదా శనివారం మూవీలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ చేశారు. సీఐ దయా అనే నెగెటివ్‍ రోల్‍లో ఎస్‍జే సూర్య అదరగొట్టారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో సాయి కుమార్, అజయ్ ఘోష్, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్ కూడా కీరోల్స్ పోషించారు.

సోకులపాలెంలోని ప్రజలకు అండగా.. సీఐ దయాతో సూర్య (నాని) పోరాడడం చుట్టూ సరిపోదా శనివారం మూవీ సాగుతుంది. అంటే సుందరానికి తర్వాత నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్ రిపీట్ అయింది. సరిపోదా శనివారం చిత్రాన్ని పక్కా యాక్షన్ చిత్రంగా వివేక్ తెరకెక్కించారు. శనివారమే గొడవ పడే హీరో అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ చూపించారు. యాక్షన్ రోల్‍లో నాని దుమ్మురేపారు. ఈ మూవీకి జేక్స్ బెజోయ్ అందించిన సంగీతం కూడా చాలా ప్లస్ అయింది. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.

నాని లైనప్

నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలతో ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నారు. గతేడాది దసరా మూవీలో బ్లాక్‍బస్టర్ కొట్టిన ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో చాలా క్రేజ్ ఉంది. ఈ మూవీ మరింత వైలెంట్ యాక్షన్‍తో ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. హిట్ 3తో పాటు డైరెక్టర్ సుజీత్‍తో మూవీ కూడా నాని లైనప్‍లో ఉన్నాయి.

తదుపరి వ్యాసం