తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Relase Date : రూమర్స్ నమ్మెుద్దు.. సలార్ వచ్చేది అప్పుడే..

Salaar Relase Date : రూమర్స్ నమ్మెుద్దు.. సలార్ వచ్చేది అప్పుడే..

Anand Sai HT Telugu

14 May 2023, 22:23 IST

    • Salaar Relase Date : ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా ఈ చిత్రం విడుదలపై కొన్ని పుకార్లు వస్తు్న్నాయి.
సలార్ విడుదల తేదీ
సలార్ విడుదల తేదీ

సలార్ విడుదల తేదీ

కేజీఎఫ్ తర్వాత.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) నటిస్తున్న చిత్రం సలార్. సెప్టెంబర్ 28న సినిమా విడుదల చేస్తున్నట్టుగా చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అయితే ఈ సినిమా వాయిదా పడుతుందని కొన్ని పుకార్లు లేచాయి. సలార్ విడుదల.. ఆలస్యం అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. నరసింహకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్.. దీపతో మొండిగా వాదించిన శౌర్య

Brahmamudi May 16th Episode: అత్తింట్లో అనామిక పంచాయితీ - క‌ళ్యాణ్ కోసం ఒక్క‌టైన దుగ్గిరాల కుటుంబం - రాజ్‌కు షాక్‌

'ఆలస్యమని సూచించే ఏవైనా నిరాధారమైన పుకార్లను నమ్మకండి. విశ్వాసంతో ఉండండి. విడుదల తేదీ మారదు. మరపురాని సినిమా కోసం సిద్ధంగా ఉండండి.' అని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా పోస్ట్‌పోన్ కానున్నట్టు జ‌రుగుతోన్న ప్రచారాన్ని చిత్రబృందం ఖండించింది. గ్యాంగ్‌స్టార్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్టుగా కొంత‌కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కానుంది సలార్.

మరోవైపు ఈ సినిమా రెండు పార్ట్స్ గా రానున్నట్టు తెలుస్తోంది. ఫ‌స్ట్ పార్ట్‌లో త‌న పాత్ర పెద్దగా క‌నిపించ‌ద‌ని, సెకండ్ పార్ట్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్‌లో న‌టించ‌బోతున్నట్లు పేర్కొన్నాడు నటుడు దేవరాజ్(Devaraj). స‌లార్ రెండు పార్ట్‌లుగా తెరకెక్కబోతున్నట్టు దేవ‌రాజ్ ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు.

స‌లార్ రెండు పార్ట్‌లుగా రూపొంద‌నున్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జ‌రుగుతోంది. కానీ ఇప్పటి వరకూ రెండు పార్ట్‌ల‌పై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేయ‌లేదు. కొన్ని రోజుల కిందట రెండు పార్ట్‌ల‌పై సీనియ‌ర్ నటుడు దేవ‌రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఓ క‌న్నడ‌ ఇంట‌ర్వ్యూలో దేవ‌రాజ్‌ మాట్లాడుతూ స‌లార్ సినిమా(Salaar Cinema)లో తాను ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టుగా పేర్కొన్నాడు.

ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. వ‌ర‌ద‌రాజ మ‌న్నార్ అనే పాత్రలో అత‌డు క‌నిపించ‌బోతున్నాడు. శృతిహాస‌న్ (Shruti Haasan) హీరోయిన్‌గా న‌టిస్తోంది. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ప్రధాన భార‌తీయ భాష‌ల‌న్నింటిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం స‌లార్‌తో పాటు ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్‌తో పాటు మారుతి దర్శకత్వంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం