Pranam Devaraj Vairam: ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దేవరాజ్ తనయుడు ప్రణం దేవరాజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా వైరం. యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్,సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందింది. తాజాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా నటులు దేవరాజ్, చంద్ర దేవరాజ్ హాజరయ్యారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.,సీనియర్ నటులు దేవరాజ్, మాట్లాడుతూ...తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు వస్తున్న నా కొడుకును కూడా అదేవిదంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శకుడు చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా టీజర్ కు కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు టీజర్ కు కూడా అంతే బాగుందని చెపుతున్నారు.,చిత్ర దర్శకుడు సాయి శివన్ జంపాన మాట్లాడుతూ.. ఇది తెలుగు, కన్నడ లో బై లింగ్వేల్ సినిమా. కన్నడలో మంచి హీరో అయిన దేవరాజ్ గారికి నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాను దేవరాజ్ లాంటి స్టార్ హీరో కొడుకు నా సినిమాలో హీరో గా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. గరుడ రామ్ ఈ సినిమా చేస్తాడా లేదా అనుకున్నాను. తనకు ఈ కథ నచ్చి చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది అని అన్నారు.,ప్రణం దేవరాజ్, విన్ను మద్దిపాటి, మోనల్, గరుడ రామ్, కాశీ విశ్వనాధ్, శత్రు, చమ్మక్ చంద్ర, భద్రం తదితరులు నటించారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్,సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్స్ పై మల్లిఖార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివన్ జంపాన దర్శకత్వం వహిస్తున్నారు. మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చగా సామల భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.,