Dulquer Telugu Movie: మరో తెలుగు సినిమాకు దుల్కర్ ఓకే.. సూపర్ హిట్ దర్శకుడితో ప్రాజెక్టుకు రెడీ-director venki atluri next movie malayalam star dulquer salman ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dulquer Telugu Movie: మరో తెలుగు సినిమాకు దుల్కర్ ఓకే.. సూపర్ హిట్ దర్శకుడితో ప్రాజెక్టుకు రెడీ

Dulquer Telugu Movie: మరో తెలుగు సినిమాకు దుల్కర్ ఓకే.. సూపర్ హిట్ దర్శకుడితో ప్రాజెక్టుకు రెడీ

Dulquer Telugu Movie: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు తెరపై కనిపించనున్నాడు. ఇటీవల సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరీతో దుల్కర్ సినిమాకు పచ్చాజెండా ఉపారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్

Dulquer Telugu Movie: మహానటి, సీతారామం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.. భాషతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. మలయాళం సినిమాలతో పాటు వీలు చిక్కినప్పుడల్లా హిందీ, తెలుగు, తమిళంలో మూవీస్ చేస్తున్నాడు. అతడు ఎక్కడ నటించిన తమ సొంతవాడిగా ప్రేక్షకులు ఓన్ చేసుకుంటున్నారు. గతేడాది సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్.. ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌ సినిమా చేయబోతున్నారు.

యువ సంచలన దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఓ ప్రాజెక్టుకు పచ్చాజెండా ఊపారు. ఈ ఏడాది సార్ మూవీతో మంచి సూపర్ హిట్ అందుకున్నారు వెంకీ. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో తెరకెక్కనుంది. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్టార్ మాదిరిగా దుల్కర్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. 2024 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ మూవీలో నటించనున్న తారాగణం, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకీ అట్లూరీ.. ఈ చిత్రంతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తారని సినీ ప్రియులు అంచనా వేసుకుంటున్నారు. ఇది కూడా ఆడియెన్స్‌ను తప్పకుండా అలరించే మరో క్వాలిటీ, కంటెంట్ ఓరియెంటేడ్ సినిమా అవతుందని భావిస్తున్నారు.

సంబంధిత కథనం