Dulquer Salman in Sita Ramam Success Meet: 'ఆ హీరోతో నన్ను పోల్చకండి'.. దుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు -dulquer salman said don t compare him with shah rukh khan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dulquer Salman In Sita Ramam Success Meet: 'ఆ హీరోతో నన్ను పోల్చకండి'.. దుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Dulquer Salman in Sita Ramam Success Meet: 'ఆ హీరోతో నన్ను పోల్చకండి'.. దుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Sep 17, 2022 06:09 PM IST

Dulquer Praises Shah Rukh: షారుఖ్ ఖాన్‌తో తనను పోల్చవద్దని దుల్కర్ సల్మాన్ స్పష్టం చేశాడు. తను నటించిన సీతా రామం సక్సెస్ మీట్ సందర్భంగా విలేకరు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించాడు.

<p>సీతా రామం సక్సెస్ మీట్‌లో మృణాల్ ఠాకూర్‌తో దుల్కర్ సల్మాన్</p>
సీతా రామం సక్సెస్ మీట్‌లో మృణాల్ ఠాకూర్‌తో దుల్కర్ సల్మాన్ (PTI)

Dulquer Salman About Shah rukh Khan: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం సీతా రామం. గత నెలలో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ నెలలో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా సీతా రామం హిందీ వెర్షన్ విజయం సందర్భంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి హాజరైన దుల్కర్ సల్మాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను షారుఖ్ ఖాన్ నటించిన ‘వీర్ జారా’తో పోలుస్తూ విలేకరు అడిగిన ప్రశ్నకు.. తనను ఆయనతో పోల్చవద్దని అన్నారు.

"నేను షారుఖ్ ఖాన్‌కు వీరాభిమానిని. ఆయన సినిమాలను చూస్తూనే పెరిగాను. ఎంతోమంది ఆయన స్ఫూర్తి. అభిమానులను ఆయను చూసుకునే తీరుకు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటాను. ఎవరైన మాట్లాడాలని వస్తే ఆయన ఎంతమందిలో ఉన్నా ప్రతి ఒక్కరితో శ్రద్ధగా మాట్లాడతారు. ఆయన నటించిన దిల్‌వాలే దుల్హానియా లేజాయింగే నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ చిత్రం చాలా సార్లు చూశాను. నాకు ఎప్పుడైనా భవిష్యత్తుపై సందేహం కలిగితే.. షారుఖ్‌ను మనస్సులో తలచుకుంటారు. నటుడిగానే కాకుండా ఆయన చాలా గొప్ప వ్యక్తి. పక్కవారితో ఎలా మాట్లాడాలో ఆయనను చూసే నేర్చుకుంటా. నాకు తెలియకుండానే ఆయన నాపై ప్రభావం చూపారు. నన్ను ఆయనతో పోల్చడం నా దృష్టిలో ఆయనను అవమానపరిచనట్లే. షారుఖ్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు" అని దుల్కర్ సల్మాన్.. బాలీవుడ్ బాద్‌షాపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

సీతా రామం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లో కలిపి వంద కోట్లకు పైచిలుకు వసూళ్లను సాధించింది. హను రాఘవపూడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా దుల్కర్, మృణాల్ ఠాకూర్ నటనకు ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు.

దుల్కర్ సరసన మృణాల్ ఠాకూర్ సీతా మహాలక్ష్మీ పాత్రలో నటించింది. రష్మిక మందన్నా కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకాలపై అశ్విని దత్ నిర్మించారు. సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. దక్షిణాదిన సీతా రామం ఆగస్టు 5న విడుదల కాగా.. ఉత్తరాదిన మాత్రం సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం