Salaar OTT Streaming: ఇంగ్లిష్ వెర్షన్‍లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన సలార్ సినిమా.. ఇక గ్లోబల్‍గా మోతే..
05 February 2024, 15:55 IST
- Salaar Ceasefire OTT Streaming: సలార్ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో మరో భాషలోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. సలార్‌కు ఇంగ్లిష్ వెర్షన్ కూడా యాడ్ అయింది.
Salaar OTT Streaming: ఇంగ్లిష్ వెర్షన్‍లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన సలార్ సినిమా
Salaar OTT Streaming: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్: పార్ట్-1 సీజ్‍ఫైర్’ మూవీ భారీ హిట్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ గత డిసెంబర్ 22న రిలీజ్ కాగా.. రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లకు అందరూ జైకొట్టారు. సలార్ చిత్రం ఓటీటీలోనూ అదే రేంజ్‍లో దుమ్మురేపుతోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో చాలా దేశాల్లో టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఇంగ్లిష్ వెర్షన్ కూడా యాడ్ అయింది.
సలార్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 20వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకెళ్లింది. చాలారోజులు ఇండియాలో టాప్ ట్రెండింగ్‍లో కొనసాగింది. గ్లోబల్‍గానూ చాలా దేశాల్లో టాప్-10లో ట్రెండ్ అవుతోంది. కాగా, ఇప్పుడు సలార్ ఇంగ్లిష్ వెర్షన్ కూడా నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
సలార్ ఇంగ్లిష్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ నేడు (ఫిబ్రవరి 5) అందుబాటులోకి తెచ్చింది. “భారీ డిమాండ్ల మేరకు.. గ్లోబల్ ఆడియన్స్ కోసం యాక్షన్ ఎపిక్ సలార్ ఇంగ్లిష్ వెర్షన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది” అని నెట్‍ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.
గ్లోబల్ రేంజ్‍లో..
సలార్ సినిమా ఇంగ్లిష్ వెర్షన్‍లోకి రాకముందే గ్లోబల్ రేంజ్‍లో దుమ్మురేపింది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్‌తో చాలా దేశాల్లోని ప్రజలు ఈ మూవీని చూశారు. అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెచ్చారు. దీంతో సలార్ గోస్ గ్లోబల్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆ తర్వాత సలార్ ఇంగ్లిష్ వెర్షన్ త్వరగా తీసుకురావాలని చాలా మంది డిమాండ్లు చేశారు.
ఎట్టకేలకు ఇంగ్లిష్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ తీసుకురావటంతో గ్లోబల్ రేంజ్‍లో సలార్ మరింత దుమ్మురేపే అవకాశం ఉంది. చాలా దేశాల్లో ట్రెండ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సలార్ మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
హిందీలో ఎప్పుడు..
కాగా, సలార్ హిందీ వెర్షన్ మాత్రం ఇప్పటి వరకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రాలేదు. ఈ విషయంపై అప్‍డేట్ కూడా ఇవ్వలేదు. 90 రోజుల వెయింటింగ్ పీరియడ్ ఉండడంతో హిందీ వెర్షన్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. సలార్ హిందీ వెర్షన్ మార్చిలో వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ విషయంపై నెట్‍ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయనుంది.
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ, సలార్ చిత్రాలు డిసెంబర్‌లో బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. అయితే, సలార్ చిత్రమే కలెక్షన్లలో దుమ్మురేపింది. దీంతో ఉత్తరాదిలో ప్రభాస్‍కు ఉన్న విపరీతమైన క్రేజ్ మరోసారి ప్రూవ్ అయింది. షారుఖ్ మూవీనే వెనక్కి నెట్టి.. సలార్ అదరగొట్టింది. హిందీలోనూ ఈ చిత్రానికి సుమారు రూ.170 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
సలార్ మూవీలో ప్రభాస్‍తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి, టినూ ఆనంద్, దేవరాజ్, బాబీ సింహా కీలకపాత్రలు చేశారు. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సీక్వెల్‍గా సలార్: పార్ట్-2 శౌర్యంగపర్వం మూవీని కూడా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
టాపిక్