Salaar OTT Release: సలార్ హిందీ వెర్షన్ ఓటీటీలోకి ఆలస్యంగా రానుందా? కారణం ఏంటంటే..
Salaar OTT Release: సలార్ సినిమా త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. థియేటర్లలో బ్లాక్‍బాస్టర్ హిట్ అయిన ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రాబోతోంది. అయితే, హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Salaar OTT Release: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. గత డిసెంబర్ 22వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్‍బాస్టర్ కొట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సలార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.720కోట్లకుపైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఇంకా థియేటర్లలో వసూళ్లను రాబడుతోంది. అయితే, సలార్ త్వరలోనే ఓటీటీలోకి రానుంది.
సలార్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో జనవరి 26న లేకపోతే పిబ్రవరి 4వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ డేట్‍పై ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే, సలార్ సినిమా హిందీ వెర్షన్ మాత్రం ఇంకా ఆలస్యం కానుందని తెలుస్తోంది.
హిందీ ఆలస్యం.. ఎందుకంటే..
హిందీ సినిమాలకు ఓటీటీలోకి వచ్చేందుకు 90 రోజుల తప్పనిసరి వెయిటింగ్ పీరియడ్ నిబంధన ఉంది. అంటే, హిందీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అయిన 90 రోజుల తర్వాతే ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రావాలనే రూల్ ఉంది. దీంతో సలార్ మూవీ హిందీ వెర్షన్ మార్చిలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో దక్షిణాది భాషల వెర్షన్ ముందుగా వచ్చి.. ఆ తర్వాత హిందీ వెర్షన్ రానుందని తెలుస్తోంది.
సంక్రాంతి/ పొంగల్ సందర్భంగా సలార్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల గురించి నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే, వీటిలో హిందీ వెర్షన్‍ను మాత్రం పేర్కొనలేదు. దీంతో హిందీ వెర్షన్ వేరే ప్లాట్‍ఫామ్‍కు వెళ్లిందా అనే రూమర్స్ వచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని, హిందీ వెర్షన్ కూడా నెట్‍ఫ్లిక్స్‌లోనే వస్తుందని హొంబాలే ఫిల్మ్స్ కో-ఫౌండర్ చలువే గౌడ చెప్పినట్టు ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. అయితే, హిందీ వెర్షన్ ఆలస్యంగా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
సలార్ చిత్రాన్ని హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి. డార్లింగ్ ప్రభాస్‍కు తన రేంజ్ బ్లాక్‍బాస్టర్ హిట్ దక్కింది. హిందీలో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ చిత్రం పోటీలో ఉన్నా.. సలార్ మూవీనే అత్యధిక కలెక్షన్లను దక్కించుకుంది.
సలార్ చిత్రంలో దేవాగా ప్రభాస్, వరదరాజ మన్నార్‌గా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. ఖాన్సార్ సిటీపై ఆధిపత్యం కోసం కొన్ని గ్రూపుల మధ్య జరిగే పోరాటం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. శృతి హాసన్, ఈశ్వరి రావు, జగపతి బాబు, శ్రీయారెడ్డి, మైమ్ గోపీ, బాబీ సింహా, టినూ ఆనంద్, దేవరాజ్ కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్సూర్ సంగీతం అందించారు. ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’ కూడా తీసుకురానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.