Salaar 16 Days Collection: ప్రభాస్ సలార్ 16 డేస్ కలెక్షన్స్.. ఏడో భారతీయ చిత్రంగా రికార్డ్.. మూడోసారి దాటిన 600 కోట్లు-prabhas salaar day 16 world wide box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar 16 Days Collection: ప్రభాస్ సలార్ 16 డేస్ కలెక్షన్స్.. ఏడో భారతీయ చిత్రంగా రికార్డ్.. మూడోసారి దాటిన 600 కోట్లు

Salaar 16 Days Collection: ప్రభాస్ సలార్ 16 డేస్ కలెక్షన్స్.. ఏడో భారతీయ చిత్రంగా రికార్డ్.. మూడోసారి దాటిన 600 కోట్లు

Sanjiv Kumar HT Telugu
Jan 07, 2024 10:10 AM IST

Salaar 16 Days Box Office Collection: ప్రభాస్ నటించిన 'సలార్: పార్ట్ వన్ సీజ్ ఫైర్' చిత్రం విడుదలైన రెండో వారంలో 16వ రోజు రూ.5.3 కోట్లు వసూలు చేసింది. ఇలా వసూళ్లతో అరాచకం సృష్టిస్తోన్న సలార్ మూవీకి 16 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలు చూస్తే..

ప్రభాస్ సలార్ 16 డేస్ కలెక్షన్స్.. ఏడో భారతీయ చిత్రంగా రికార్డ్.. మూడోసారి దాటిన 600 కోట్లు
ప్రభాస్ సలార్ 16 డేస్ కలెక్షన్స్.. ఏడో భారతీయ చిత్రంగా రికార్డ్.. మూడోసారి దాటిన 600 కోట్లు (File Image)

Salaar Day 16 Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'సలార్: పార్ట్ వన్' విడుదలైన రెండో వారంలో 16వ రోజు రూ.5.3 కోట్లు వసూలు చేసింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి 16 రోజుల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇలా ఇండియాలో సలార్ రూ. 387.05 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రముఖ సంస్థ Sacnilk గణాంకాలు చెబుతున్నాయి.

క్రిస్మస్తో సహా లాంగ్ వీకెండ్‌కు ముందు విడుదలైన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 16 వ రోజు రూ .5.3 కోట్లు వసూలు చేయగా, అత్యధికంగా రూ .3.75 కోట్లు హిందీ వెర్షన్ నుంచి కలెక్ట్ అయ్యాయి. తరువాత తెలుగులో రూ . 1.37 కోట్లు, తమిళంలో రూ . 0.18 కోట్లు వచ్చిటనట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే సలార్‌కు 15వ రోజు నమోదైన రూ.3.67 కోట్లతో పోలిస్తే 16వ రోజు టికెట్ కొనుగోళ్లు 45.21 శాతం పెరిగాయి.

సలార్ సినిమా 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 147.75 కోట్ల షేర్, రూ. 228.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇక కర్ణాటకలో రూ. 22. 2 కోట్లు, తమిళనాడు రూ. 11.20 కోట్లు, కేరళలో రూ. 6.74 కోట్లు, హిందీతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 71.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 63.60 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్‌గా సలార్ 15 రోజుల్లోనే రూ. 323. 21 కోట్ల షేర్, రూ. 600.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.

ఇప్పుడు 16 రోజుల్లో రూ. 387.05 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే, 16 రోజుల్లో రూ. 650 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్‌లో ఏకంగా మూడు సార్లు రూ. 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ చేరుకున్న హీరోగా ప్రభాస్ కొత్త రికార్డ్ నెలకొల్పాడు. టాలీవుడ్‌లో ప్రభాస్ ఒక్కడే 600 కోట్ల గ్రాస్ మార్క్ దాటి చరిత్ర సృష్టించాడు.

రూ. 270 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సలార్ మూవీ 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ఏడో స్థానాన్ని సంపాదించుకుంది. కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన రోజున ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 90.7 కోట్లు వసూలు చేసింది. తొలి వారాంతంలో ఈ చిత్రం రూ. 209.1 కోట్ల నెట్ ను రాబట్టగా, మొదటి వారం ముగిసే సరికి రూ.308 కోట్ల నెట్ ను రాబట్టింది. మంగళవారం నుంచి కలెక్షన్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సలార్ ప్రదర్శన కూడా తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

సలార్ రెండో వారం వసూళ్లు రూ. 70.17 కోట్లుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కోసం డిసెంబర్ 22కు వాయిదా పడింది. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, మధు గురుస్వామి కీలక పాత్రలు పోషించారు. రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో 14 భారీ సెట్స్ వేసి సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Whats_app_banner