Amaran Real Life Story: సాయి పల్లవి బయోగ్రఫీ మూవీ అమరన్ రియల్ లైఫ్ స్టోరీ ఇదే! ఎవరీ మేజర్ ముకుంద్ వరదరాజన్?
30 October 2024, 11:23 IST
Sai Pallavi Amaran Movie Real Life Story: సాయి పల్లవి నటించిన లేటెస్ట్ బయోగ్రఫీ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీగా తెరకెక్కిన అమరన్ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అమరన్ రియల్ స్టోరీ, మేజర్ ముకుంద్ వరదరాజన్ ఎవరో ఓ లుక్కేద్దాం.
సాయి పల్లవి బయోగ్రఫీ మూవీ అమరన్ రియల్ లైఫ్ స్టోరీ ఇదే! ఎవరీ మేజర్ ముకుంద్ వరదరాజన్?
Sai Pallavi Amaran Movie Real Life Story: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్ జంటగా నటించిన సినిమా అమరన్. బయోగ్రాఫికల్ లవ్ అండ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన అమరన్ మూవీకి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మాతల్లో ఒకరిగా బాధ్యతలు చేపట్టారు.
రియల్ లైఫ్ స్టోరీ
అమరన్ సినిమాలో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ అనే టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. అయితే, ఈ చిత్రం యుద్ధ వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందించారు. శివ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తక సిరీస్‌లోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
అశోక చక్ర అవార్డ్
మేజర్ ముకుంద్ భారత సైన్యంలోని రాజ్‌పుత్ రెజిమెంట్‌లో పనిచేశారు. ఆయన అశోక చక్ర అవార్డ్ గ్రహిత. జమ్మూ, కాశ్మీర్‌లోని 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు డిప్యుటేషన్‌లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో మేజర్ మకుంద్ వరదరాజన్ సాహసోపేత చర్యలకు ఆయన మరణానంతరం అశోక చక్రను ప్రదానం చేశారు.
కెప్టెన్‌గా బాధ్యతలు
1983 ఏప్రిల్ 12న తమిళనాడులోని తాంబరంలో జన్మించిన ముకుంద్ వరదరాజన్ 2014 ఏప్రిల్ 25న 31 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ముకుంద్ 2006 మార్చి 18న రాజ్‌పుత్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా షార్ట్ సర్వీస్ కమీషన్‌ను అందుకున్నారు. ఆ తర్వాత 2011లో మార్చి 18న ఆయనకు లెఫ్టినెంట్ హోదాను కల్పించారు. అలాగే, అక్టోబర్ 18, 2008 నుంచి కెప్టెన్‌గా యాంటీ డేటెడ్ పదోన్నతి పొందారు.
ముగ్గురు ఉగ్రవాదులను
అనంతరం అక్టోబర్ 18, 2012లో రాష్ట్రీయ రైఫిల్స్ 44వ బెటాలియన్‌కు మేజర్‌గా ముకుంద్ వరదరాజన్ నియమింపబడ్డారు. ఆ తర్వాత డిసెంబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పోపియాన్ జిల్లాలలో సేవలు అందించారు. 2014 ఏప్రిల్ 25న ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను అంతమొందించే ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు ముకుంద్ వరదరాజన్.
మిషన్ పూర్తి.. కానీ,
ఈ క్రమంలో ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడినప్పటికీ ముకుంద్ మిషన్‌ను పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో అల్తాఫ్ వానీ బుల్లెట్స్ ముకుంద్‌ను గాయపరిచినప్పటికీ అవుట్‌హౌస్ నుండి బయటకు వచ్చారు. అప్పుడు ఆయన క్షేమంగా కనిపించారు. కానీ, అనంతరం బుల్లెట్స్ గాయాలు ఎక్కువ కావడంతో కుప్పకూలిపోయారు ముకుంద్.
3 బుల్లెట్ గాయాలు
"ఆయన అప్పుడు బాగానే కనిపించాడు. ఆయన బాగానే ఉన్నాడని మేము అనుకున్నాము. కానీ కొద్దిసేపటికే ముకుంద్ కుప్పకూలిపోయారు. చూస్తే మూడు తుపాకీ గాయాలు ఉన్నాయి. దాంతో ఆయన స్పృహ కోల్పోయారు. అప్పుడు మేము ఆయన్ను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించాం. కానీ, అప్పటికే ఆయన ఆ గాయల కారణంగా మరణించారు" అని ముకుంద్ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారి ఒకరు చెప్పారు.
దివాళీ సందర్భంగా
ఇదిలా ఉంటే, అమరన్ సినిమాలో ముకుంద్ భార్యగా ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి యాక్ట్ చేసింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కలిసి నిర్మిస్తున్న అమరన్ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది.