Sivakarthikeyan: సందీప్ రెడ్డి వంగాకు ఆ విషయంలో అభిమానిని: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్-more than his movies i am fan of sandeep reddy vanga interviews says kollywood star sivakarthikeyan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  More Than His Movies I Am Fan Of Sandeep Reddy Vanga Interviews Says Kollywood Star Sivakarthikeyan

Sivakarthikeyan: సందీప్ రెడ్డి వంగాకు ఆ విషయంలో అభిమానిని: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 05, 2024 11:48 PM IST

Sivakarthikeyan on Sandeep Reddy Vanga: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసలు కురిపించాడు తమిళ హీరో శివకార్తికేయన్. ఆయన సినిమాల కంటే ఎక్కువగా నచ్చే విషయం ఏదో వెల్లడించారు.

Sivakarthikeyan: సందీప్ రెడ్డి వంగాకు ఆ విషయంలో అభిమానిని: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్
Sivakarthikeyan: సందీప్ రెడ్డి వంగాకు ఆ విషయంలో అభిమానిని: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్

Sivakarthikeyan: యానిమల్ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టారు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రంపై ఎన్ని విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బంపర్ హిట్ అయింది. సందీప్ రెడ్డి గత చిత్రాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలపై కూడా అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే, గత డిసెంబర్‌లో రిలీజైన యానిమల్ చిత్రంపై విమర్శల దాడి మరింత ఎక్కువగా జరిగింది. అయితే, విమర్శలపై సందీప్ రెడ్డి వంగా కూడా అదే స్థాయిలో దీటుగా స్పందించారు. పలు ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన కామెంట్లు, ఇచ్చిన కౌంటర్లు చాలా వైరల్ అయ్యాయి.

సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూలకు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా ఫిదా అయ్యారు. ఆయన మాట తీరును మెచ్చుకున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడారు. సందీప్ రెడ్డి సినిమాల కంటే.. ఆయన ఇంటర్వ్యూలకే తాను మరింత ఎక్కువ ఫ్యాన్‍ను అని అన్నారు.

థ్రిల్లింగ్‍గా అనిపించింది

యానిమల్ సినిమా చూసి తాను థ్రిల్ అయ్యానని శివకార్తికేయ చెప్పారు. “సందీప్ రెడ్డి వంగా.. క్రాఫ్ట్‌ నాకు బాగా నచ్చుతుంది. ఆయన మ్యూజిక్‍ను ఉపయోగించుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. యానిమల్ సినిమా చూసేటప్పుడు నాకు థ్రిల్లింగ్‍గా అనిపించింది. ఆయన సినిమాల కంటే.. ఆయన ఇంటర్వ్యూలకు నేను అభిమానిని. సమాధానాల విషయంలో ఆయన చాలా ముక్కుసూటిగా ఉంటారు” అని శివకార్తికేయన్ అన్నారు.

తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరు యానిమల్ సినిమాను తీవ్రంగా విమర్శించారు. అయితే, శివకార్తికేయన్ మాత్రం తనకు ఆ చిత్రం నచ్చిందని చెప్పారు. రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్రం రూ.900కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అయింది.

యానిమల్ చిత్రం విషయంలో సందీప్ రెడ్డి వంగాకు ఎన్ని ప్రశంసలు వచ్చాయో.. మరోవైపు విమర్శలు కూడా అదే స్థాయిలో ఎదురయ్యాయి. హింస విపరీతంగా ఉందని, మహిళలను కించపరిచే విధంగా ఉందని చాలా విమర్శలు వచ్చాయి. మహిళలపై వేధింపులకు ప్రోత్సహించేలా ఉందని కామెంట్లు వచ్చాయి. అయితే, విమర్శలకు చాలా దీటుగా, ఘాటుగా సమాధానాలు చెప్పారు సందీప్ రెడ్డి వంగా. సినిమాను సినిమాల్లాగే చూడాలని బదులిచ్చారు. టేకింగ్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ లాంటి క్రాఫ్ట్‌లను చూడకుండా.. కొన్ని విషయాలనే పట్టుకొని మాట్లాడడం సరికాదని గట్టిగా స్పందించారు. చాలా ఇంటర్వ్యూలో అగ్రెసివ్‍గా కామెంట్లు చేశారు.

యానిమల్ సినిమాలో రణ్‍బీర్ కపూర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి, చారు శంకర్, శక్తికపూర్ కీలకపాత్రలు పోషించారు.

రెండు చిత్రాలు చేస్తున్న శివకార్తికేయన్

శివకార్తికేయన్ హీరోగా నటించిన ఆయలాన్ చిత్రం ఈ ఏడాది జనవరి 12న రిలీజ్ అయింది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం శివకార్తికేయన్ రెండు చిత్రాలు చేస్తున్నారు. రాజ్‍కుమార్ పెరియసామి దర్శకత్వంలో అమరన్ చిత్రం చేస్తున్నారు శివ. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సినిమాను దిగ్గజ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‍తోనూ శివకార్తికేయ మరో మూవీ (SK23) చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.

WhatsApp channel