తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amaran Real Story: రియల్ లైఫ్ క్యారెక్టర్‌తో సాయి పల్లవి సినిమా- ఆర్మీ మేజర్ బయోపిక్‌గా అమరన్- మరో సీతా రామం లాంటి మూవీ?

Amaran Real Story: రియల్ లైఫ్ క్యారెక్టర్‌తో సాయి పల్లవి సినిమా- ఆర్మీ మేజర్ బయోపిక్‌గా అమరన్- మరో సీతా రామం లాంటి మూవీ?

Sanjiv Kumar HT Telugu

21 October 2024, 14:09 IST

google News
  • Sai Pallavi Sivakarthikeyan Amaran Story In Telugu: సాయి పల్లవి రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇందు రెబెకా వర్గీస్‌గా నటిస్తున్న బయోపిక్ మూవీ అమరన్. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మరి ఈ సినిమా మరో సీతా రామం కానుందా అనే వివరాల్లోకి వెళితే..

రియల్ లైఫ్ క్యారెక్టర్‌తో సాయి పల్లవి సినిమా- ఆర్మీ మేజర్ బయోపిక్‌గా అమరన్- మరో సీతా రామం లాంటి మూవీ?
రియల్ లైఫ్ క్యారెక్టర్‌తో సాయి పల్లవి సినిమా- ఆర్మీ మేజర్ బయోపిక్‌గా అమరన్- మరో సీతా రామం లాంటి మూవీ?

రియల్ లైఫ్ క్యారెక్టర్‌తో సాయి పల్లవి సినిమా- ఆర్మీ మేజర్ బయోపిక్‌గా అమరన్- మరో సీతా రామం లాంటి మూవీ?

Sai Pallavi Amaran Movie Story: కొన్ని సినిమాలు మనసుకు ఎంతగానో హత్తుకుంటాయి. దశాబ్దాలు గడిచిన కూడా అలాంటి సినిమాలు మదిలో పదిలంగా అలాగే ఉండిపోతాయి. అలాంటి చిత్రాలనే సినీ భాషలో క్లాసిక్ మూవీస్ అంటారు. అలాంటి తెలుగు క్లాసిక్ సినిమాల్లో ఒకటే సీతా రామం.

ఏళ్ల సమయం

ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు మెచ్చిన అందమైన ప్రేమకావ్యమే సీతా రామం చిత్రం. అలాంటి చిత్రాలు రావాలంటే చాలా ఏళ్ల సమయం పడుతుంది. ఒక సినిమా క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్నాక మరో చిత్రం అంతటి ఆదరణ పొందడం చాలా కష్టమనే చెప్పాలి.

మరో ప్రేమకథ

అయితే, ఇప్పుడు అలాంటి మరో సినిమా వస్తుందా అని అంటే.. అవును అనే సమాధానం వస్తోందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రానుంది. అది కూడా సేమ్ ఆర్మీ బ్యాక్ డ్రాప్‌తో ఉన్న స్వచ్ఛమైన ప్రేమకథ. ఆ సినిమానే అమరన్. తమిళ, తెలుగు భాషల్లో మల్టీ లింగువల్ బ్రయోగ్రఫీ చిత్రంగా తెరకెక్కింది ఈ అమరన్ మూవీ.

మేజర్ ముకుంద్ వరదరాజన్ స్టోరీ

సీతా రామం రియల్ లైఫ్ స్టోరీ కాదు. కానీ, నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. కానీ, అమరన్ మాత్రం రియల్ లైఫ్ బయోగ్రఫీ. అది భారత దివంగత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రఫీ ఫిల్మ్ అమరన్. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించగా.. ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి చేసింది.

ఆహ్లాదంగా గ్లింప్స్

కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన అమరన్ టీజర్ గూస్‌బంప్స్ ఇచ్చేలా అట్రాక్ట్ చేసింది. తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు మేజర్ ముకుంద్ కనబర్చిన సాహసం, తెలివితేటలను చూపిస్తూ ఎంతో టెర్రిఫిక్‌గా టీజర్‌ను వదిలారు. ఆ తర్వాత రీసెంట్‌గా సాయి పల్లవి పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సాయి పల్లవి తన నటనతో ఎంతో మెప్పిస్తే.. బీజీఎమ్ ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది.

సీతా రామం-షేర్షా సినిమాలు

ఆర్మీ బ్యాక్‌డ్రాప్, లవ్ స్టోరీ, యాక్షన్ సీన్స్ ఇవన్ని చూస్తుంటే సేమ్ సీతా రామం సినిమాను తలపిస్తున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, హిందీ హిట్ మూవీ షేర్షాతో కూడా అమరన్ చిత్రాన్ని పోలుస్తున్నారు. షేర్షా సినిమా 1999 కార్గిల్‌లో వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.

ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ బుక్ నుంచి

ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేస్తున్న అమరన్ చిత్రాన్ని అశోక చక్ర అవార్డ్ గ్రహిత, భారత ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందించారు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన "ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్" అనే పుస్తకంలోని "మేజర్ వరదరాజన్" చాప్టర్ ఆధారంగా అమరన్‌ను తెరకెక్కించారు.

కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో

2014 ఏప్రిల్ 25న ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఆధారంగా దక్షిణ కాశ్మీర్‌లోని ఓ గ్రామంలో ముకుంద్ టీమ్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో గాయాలపాలైన మకుంద్ వరదరాజన్ కన్నుమూశారు. ఇదిలా ఉంటే, అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం