Mrunal Thakur in Bikini: బికినీలో సీతా రామం బ్యూటీ.. షాక్‌లో అభిమానులు
Mrunal Thakur in Bikini: బికినీలో సీతా రామం బ్యూటీని చూసి అభిమానులు షాక్ తింటున్నారు. బ్లూ బికినీలో ఉన్న తన ఫొటోలను మృనాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
Mrunal Thakur in Bikini: సీతా రామం మూవీతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరైంది మృనాల్ ఠాకూర్. తన అందంతో ఆమె ఎంతగానో ఆకట్టుకుంది. సీతా రామం మూవీలో సీతగా అమాయకంగా కనిపించిన మృనాల్.. తాజాగా బికినీలో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. బ్లూ కలర్ బికినీలో హొయలు పోతూ ఆమె దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఈ ఫొటోలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఇన్‌స్టా పోస్ట్ పై వేల మంది కామెంట్స్ చేస్తున్నారు. మన సీతా మహాలక్ష్మి ఇలాంటి ఫొటోలు పోస్టు చేయడమేంటి అని ఒకరు.. సీతా.. నిన్నిలా చూడటం కష్టంగా ఉందని మరొకరు.. బికినీలో చూడకూడదని అనుకున్న ఏకైకా హీరోయిన్ నువ్వే అంటూ ఇంకొకరు కామెంట్స్ చేశారు.
మరికొందరు మాత్రం బికినీలో మృనాల్ చాలా హాట్ గా ఉందని అన్నారు. నిజానికి సీతా రామం సినిమా తర్వాత మృనాల్ ఎన్నో హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే మరీ ఇలా బికినీలో ఇంతలా రెచ్చిపోయి కెమెరాలకు పోజులివ్వలేదు. సీతా రామం సినిమాలో చాలా పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా, ఎంతో అందంగా కనిపించి అభిమానుల మనసులు గెలుచుకుందామె.
అలాంటి మృనాల్ ను కొందరు ఇలా హాట్ పోజుల్లో చూడలేకపోతున్నారు. మరీ ఇంతలా గ్లామర్ డోసు పెంచడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్ యూజర్లను షాక్ కు గురి చేశాయి. ఫొటో డంప్ అంటూ మంగళవారం (ఏప్రిల్ 4) ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ గుమ్రా సినిమాలో నటించింది. ఈ మూవీ ఈ శుక్రవారం (ఏప్రిల్ 7) రిలీజ్ కాబోతోంది. నాని 30లోనూ ఆమె నటిస్తోంది.
సంబంధిత కథనం