తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: అమరన్ రిలీజ్‍కు ముందు సాయిపల్లవి పాత వీడియో వైరల్.. విమర్శిస్తున్న నెటిజన్లు

Sai Pallavi: అమరన్ రిలీజ్‍కు ముందు సాయిపల్లవి పాత వీడియో వైరల్.. విమర్శిస్తున్న నెటిజన్లు

26 October 2024, 9:41 IST

google News
    • Sai Pallavi: సాయిపల్లవి గతంలో చేసిన ఓ కామెంట్‍కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అమరన్ చిత్రం రిలీజ్‍కు ముందు ఈ వీడియో చక్కర్లు కొడుకోంది. ఆ కామెంట్ల పట్ల కొందరు నెటిజన్లు సాయిపల్లవిని విమర్శిస్తున్నారు.
Sai Pallavi: అమరన్ రిలీజ్‍కు ముందు సాయిపల్లవి పాత వీడియో వైరల్.. విమర్శిస్తున్న నెటిజన్లు
Sai Pallavi: అమరన్ రిలీజ్‍కు ముందు సాయిపల్లవి పాత వీడియో వైరల్.. విమర్శిస్తున్న నెటిజన్లు

Sai Pallavi: అమరన్ రిలీజ్‍కు ముందు సాయిపల్లవి పాత వీడియో వైరల్.. విమర్శిస్తున్న నెటిజన్లు

శివ కార్తికేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో పోషించిన అమరన్ చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించనున్నారు సాయి పల్లవి. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందింది. ఈ చిత్రంలో ముకుంద్ పాత్ర పోషించారు కార్తికేయన్. అయితే, అమరన్ రిలీజ్‍కు ముందు సాయి పల్లవికి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విరాట పర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఉగ్రవాదం గురించి సాయిపల్లవి కొన్ని కామెంట్లు చేశారు. భారత్, పాకిస్థాన్ సైన్యాల గురించి ఇరు దేశాల ప్రజల దృక్పథం గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. సాయి పల్లవిపై విమర్శలు వస్తున్నాయి.

ఏమన్నారంటే..

ఉగ్రవాదం, హింస అంశాల గురించి సాయిపల్లవి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “పాకిస్థాన్ సైనికులను మనం భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే, పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లో చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. దృక్పథాలు ఇలా మారిపోతుంటాయి” అని అప్పట్లో సాయి పల్లవి చెప్పారు.

విమర్శలు

సాయిపల్లవికి సంబంధించిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెను విమర్శిస్తూ కొందరు పోస్టులు చేస్తున్నారు. భారత్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ ఒకటేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ సైనికులు అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి అమాయకులైన భారతీయులపై దాడులు చేస్తున్నారని, భారత ఆర్మీ ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదని అంటున్నారు. ఇండియా, పాకిస్థాన్ ఆర్మీలను ఒకటే అనేలా పోల్చడం తగదని సాయి పల్లవిని విమర్శిస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల వల్లే భారత్‍లో ఉగ్రదాడులు జరిగాయని, భారత్ వల్ల పాక్‍లో ఏ ఉగ్రదాడులు జరగలేదని గుర్తు చేస్తున్నారు.

అమర సైనికుడి జీవితం ఆధారంగా రూపొందించిన అమరన్ చిత్రం రిలీజ్‍కు ముందు సాయిపల్లవి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ చిత్రంలో మేజర్ ముకుంద వరదరాజ్ భార్య ఇందూ రెబకా వర్గీస్ పాత్రను సాయిపల్లవి పోషించారు. ఈ చిత్రంలో ఆమె పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ మూవీ ట్రైలర్ కూడా మెప్పించింది.

సాయి పల్లవికి సపోర్ట్

సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలను కొందరు తీవ్రంగా విమర్శిస్తుంటే.. మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. భారత సైన్యం గురించి సాయిపల్లవి ఏం తప్పుగా మాట్లాడలేదని, కేవలం ఇరు దేశాల ప్రజల ఆలోచనా విధానం గురించి మాత్రమే ఆమె ప్రస్తావించారని కొందరు పోస్టులు చేస్తున్నారు. దృక్పథం ఎలా మారుతుందో ఆమె వివరించారని అంటున్నారు. హింస సరైన విధానం కాదని తాను భావిస్తున్నానే మాటల్లో ఆ వ్యాఖ్యలు చేశారని కామెంట్లు చేస్తున్నారు.

అమరన్ చిత్రానికి రాజ్‍కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా పతాకాలపై లోకనాయకుడు కమల్ హాసన్, మహేంద్రన్, వివేక్ కష్ణని ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.

తదుపరి వ్యాసం