Kamal Haasan: నా మాటలను అపార్థం చేసుకున్నారు: క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్-kamal haasan give clarity on his comment that he likes indian 3 more than indian 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kamal Haasan: నా మాటలను అపార్థం చేసుకున్నారు: క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్

Kamal Haasan: నా మాటలను అపార్థం చేసుకున్నారు: క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 06, 2024 11:23 PM IST

Kamal Haasan - Indian 2: ఇండియన్ 2 (భారతీయుడు 2) చిత్రంపై తాను ఇటీవల చేసిన ఓ కామెంట్‍కు కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. తన మాటలను జనాలు అపార్థం చేసుకున్నారని అన్నారు. ఇండియన్ 3 అంటే ఎక్కువ ఇష్టమన్న తన వ్యాఖ్యలకు స్పష్టత ఇచ్చారు.

Kamal Haasan: నా మాటలను అపార్థం చేసుకున్నారు: క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్
Kamal Haasan: నా మాటలను అపార్థం చేసుకున్నారు: క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్

తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్ 2 (తెలుగులో భారతీయుడు 2) చిత్రం విడుదలకు రెడీ అయింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 12న పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. 1996లో వచ్చిన ఇండియన్ మూవీకి సీక్వెల్‍గా 28 ఏళ్ల తర్వాత ఇండియన్ వస్తోంది. దీని తర్వాత ఇండియన్ 3 కూడా రానుంది.

ఇండియన్ 2 సినిమా కోసం ఇటీవల సింగపూర్‌లో ప్రమోషనల్ ఈవెంట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. తాను ఇండియన్ 3 కోసమే ఇండియన్ 2 చేశానంటూ ఆ ఈవెంట్‍లో కమల్ చెప్పారు. మూడో భాగంపైనే తాను ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నానన్నట్టు కామెంట్లు చేశారు. దీంతో ఇండియన్ 2 చిత్రం ఔట్‍పుట్ కమల్ హాసన్‍కు నచ్చలేదని, అందుకే ఆయన ఇలాంటి కామెంట్లు చేశారనే కొందరు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చలు సాగాయి. దీంతో ఈ విషయంపై తమిళ వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. తన మాటలను జనాలు అపార్థం చేసుకున్నారని, ఇండియన్ 3 ఇష్టమంటే ఇండియన్ 2 నచ్చలేదని కాదు కదా అని కమల్ అన్నారు.

సరిగా అర్థం చేసుకోలేదు

తాను చేసిన కామెంట్లను ప్రజలు సరిగా అర్థం చేసుకోలేదని కమల్ హాసన్ అన్నారు. ఇండియన్ 2 కంటే ఇండియన్ 3 అంటే తనకు ఇష్టమని అపార్థం చేసుకున్నారని చెప్పారు. “నేను ఏం చెప్పాలని ప్రయత్నించానో జనాలు సరిగా అర్థం చేసుకోలేనట్టున్నారు. ఇండియన్ 3 ఎక్కువ ఇష్టమని నేను అన్నాను. అలా అని నాకు ఇండియన్ 2 ఇష్టం లేదని కాదు!. మనం సాంబార్, రసం లాంటి వాటితో భోజనం చేస్తున్నప్పుడు ఆ తర్వాత తినే పాయసం గురించి కూడా ఆలోచిస్తాం కదా. ఇది కూడా అలాంటిదే. ముందుగా మేం దీన్ని (ఇండియన్ 2) ఒక భాగమే అనుకున్నాం. కానీ మరో భాగంగా చేయాల్సి వచ్చింది. దీంతో ఇండియన్ 3కి నేను ప్రాధాన్యమిస్తున్నానంటే ఇండియన్ 2ను తక్కువగా చూస్తున్నట్టు అర్థం చేసుకోవద్దు” అని కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.

మొత్తంగా తనకు ఇండియన్ 2 అంటే ఇష్టమని, అయితే కొన్ని ప్రత్యేకమైన విషయాల వల్ల ఇండియన్ 3 కోసం ఉత్సాహంగా ఉన్నానని కమల్ హాసన్ తెలిపారు. ఇండియన్ 2 చిత్రం జూలై 12వ తేదీన తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ కానుంది.

తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్

భారతీయుడు 2 సినిమా తెలుగు వెర్షన్ కోసం ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు (జూలై 7) జరగనుంది. హైదరాబాద్‍లోని ఎన్ కన్వెన్షన్‍లో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ షురు కానుంది. హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ సహా మరికొందరు మూవీ టీమ్ సభ్యులు హాజరుకానున్నారు.

భారతీయుడు 2 చిత్రంలో ఆరు డిఫరెంట్ లుక్‍ల్లో కమల్ హాసన్ కనిపించనున్నారు. ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‍జే సూర్య, బాబీ సింహ, వివేక్ కీలకపాత్రలు చేశారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Whats_app_banner