Sai Pallavi: అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను.. నాకు పీఆర్ అవసరం లేదు: సాయి పల్లవి-sai pallavi says she decided not to wear certain kinds of clothes on screen she does not need pr agency ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను.. నాకు పీఆర్ అవసరం లేదు: సాయి పల్లవి

Sai Pallavi: అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను.. నాకు పీఆర్ అవసరం లేదు: సాయి పల్లవి

Hari Prasad S HT Telugu

Sai Pallavi: సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. స్క్రీన్ పై తాను కొన్ని రకాలైన దుస్తులు వేసుకోవద్దన్ని చాలా రోజుల కిందటే డిసైడైనట్లు చెప్పింది. అంతకాదు తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి పీఆర్ ఏజెన్సీ కూడా తనకు అవసరం లేదని తేల్చి చెప్పింది.

అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను.. నాకు పీఆర్ అవసరం లేదు: సాయి పల్లవి

Sai Pallavi: సాయి పల్లవి త్వరలోనే అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలుసు కదా. ఈ సినిమాప్రమోషన్లలో భాగంగా ఆమె చాలా బిజీగా ఉంటోంది. ఈ మధ్యే బిహైండ్ వుడ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి వివిధ అంశాలపై మాట్లాడింది. తనకు పీఆర్ ఏజెన్సీ అవసరం లేదని చెప్పడంతోపాటు గ్లామర్ షోకి కూడా తాను దూరంగా ఉంటానని చెప్పింది.

అలాంటి డ్రెస్సులు వేయను: సాయి పల్లవి

సాయి పల్లవి 2015లో వచ్చిన మలయాళం మూవీ ప్రేమమ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే అంతకుముందు తాను చేసిన ఓ డ్యాన్స్ సందర్భంగా తాను వేసుకున్న డ్రెస్ పై విమర్శలు రావడంతో ఇక అలాంటి డ్రెస్సులు వేయకూడదని నిర్ణయించినట్లు సాయి పల్లవి ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.

"చాలా రోజుల కిందట నేను జార్జియాలో ఓ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. దానికి తగినట్లుగా ఉండే డ్రెస్ వేసుకున్నాను. ప్రేమమ్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది నా పాత ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈ వీడియో బయటకు వచ్చినప్పుడు నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. ఎందుకంటే వాళ్లు ఈ వీడియో గురించి మాట్లాడిన తీరు అలా ఉంది. నన్నో మాంసపు ముద్దగాలా చూసే అభిమానుల కోసం నేను నటించను" అని సాయి పల్లవి చెప్పింది.

నాకు పీఆర్ అవసరం లేదు

ఇక తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి పీఆర్ అవసరం లేదని కూడా ఈ సందర్భంగా సాయి పల్లవి స్పష్టం చేసింది. బాలీవుడ్ లోకి కొందరు కొన్నాళ్ల కిందట ఓ పీఆర్ ఏజెన్సీని హైర్ చేసుకోవాలని తనకు సూచించారని ఆమె చెప్పింది. "నన్ను నేను ప్రమోట్ చేసుకోవచ్చని వాళ్లు అన్నాను. మొదట్లో నాకు అర్థం కాలేదు. ప్రమోట్ చేసుకోవడం అంటే ఏంటి అని అడిగాను.

నేను వెలుగులో లేని సమయంలో నా గురించి వాళ్లు ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంటారని వాళ్లు చెప్పారు. కానీ దాని వల్ల నాకు పాత్రలు రావు కదా అన్నాను. నా సినిమాలు రిలీజైనప్పుడే నేను ఇంటర్వ్యూలు ఇస్తానన్నాను. ఎవరైనా మన గురించి మాట్లాడుకుంటూనే ఉంటే.. బోరింగా అనిపిస్తుందన్నది నా ఉద్దేశం. నాకు నచ్చని విషయాను నేను చేయను అని చెప్పాను" అని సాయి పల్లవి ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.

సాయి పల్లవి త్వరలోనే రానున్న అమరన్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదే కాకుండా నాగ చైతన్యతో కలిసి ఆమె తండేల్ అనే మరో మూవీ కూడా చేస్తోంది. ఇక బాలీవుడ్ లో నితేష్ తివారీ రామాయణలోనూ సీతగా నటిస్తోంది. అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానుండగా.. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.