Amaran Trailer: సాయి పల్లవి, శివకార్తికేయన్ జీవించేశారు.. అమరన్ ట్రైలర్ రిలీజ్.. ఓటీటీ పార్ట్‌నర్ కూడా ఫిక్స్
Amaran Trailer: సాయి పల్లవి, శివకార్తికేయన్ కలిసి నటిస్తున్న అమరన్ మూవీ ట్రైలర్ బుధవారం (అక్టోబర్ 23) రిలీజైంది. ఈ నెల 31న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
Amaran Trailer: సాయి పల్లవి, శివకార్తికేయన్ జీవించేశారు. బయోపిక్ అయిన అమరన్ లో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్, అతని భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి పోటీ పడి నటించినట్లు ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా అమరన్ మూవీ రిలీజ్ కాబోతోంది.
అమరన్ ట్రైలర్
తమిళ నటుడు శివకార్తికేయన్ తన కెరీర్లో తొలి బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ పేరు అమరన్. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుండగా.. బుధవారం (అక్టోబర్ 23) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్ నటిస్తున్నాడు.
ఇండియన్ ఆర్మీలోని రాజ్‌పుత్ రెజిమెంట్ లోని అధికారి ఆయన. దేశం కోసం అమరుడైన తర్వాత అశోక చక్ర అవార్డుతో సత్కరించారు. అలాంటి అధికారి పాత్రలో శివకార్తికేయన్ నటిస్తున్నాడు. ఇక అతని భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనిపిస్తోంది. ఈ ఇద్దరూ ట్రైలర్ లో పోటీ పడి నటించారు.
అమరన్ ట్రైలర్ ఎలా ఉందంటే?
అమరన్ మూవీ ట్రైలర్ మేజర్ ముకుంద్ నిజ జీవిత వీడియోతో ప్రారంభమైంది. తన కూతురితో ఆయన ఆడుకుంటున్న వీడియో అది. అక్కడి నుంచి మెల్లగా ఆర్మీలో చేరడం, 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ లో చేరడం.. ఇలా సాగిపోయింది ట్రైలర్. మధ్యలో ఇందు రెబెకా (సాయి పల్లవి)తో ప్రేమ, పెళ్లి, పిల్లలు.. ఇలా వ్యక్తిగత జీవితం గురించి కూడా ట్రైలర్ లో చూపించారు.
అమరన్ ట్రైలర్ చూస్తుంటే సాయి పల్లవి, శివకార్తికేయన్ తమ పాత్రల్లో జీవించేసినట్లు స్పష్టమవుతోంది. ఈ ట్రైలర్ పూర్తి ఎమోషన్స్ తో నిండిపోయింది. అమరన్ మూవీని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో కమల్ హాసన్ నిర్మించాడు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించాడు. రాజ్‌కుమార్ పెరియసామి మూవీని డైరెక్ట్ చేశాడు.
అమరన్ ఓటీటీ పార్ట్‌నర్
సాయి పల్లవి, శివకార్తికేయన్ నటించిన అమరన్ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. బాక్సాఫీస్ రన్ తర్వాత మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ఆ ఓటీటీ దక్కించుకుంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజైన కనీసం నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఇక థియేటర్లలో జయం రవి నటించిన బ్రదర్, కెవిన్ నటించిన బ్లడీ బెగ్గర్ మూవీలతో అమరన్ పోటీ పడనుంది.