తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold Telugu: ఓటీటీలోకి 10 రోజుల్లోనే న్యూ తెలుగు బోల్డ్ కామెడీ మూవీ.. ఆ పండుగ కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

OTT Bold Telugu: ఓటీటీలోకి 10 రోజుల్లోనే న్యూ తెలుగు బోల్డ్ కామెడీ మూవీ.. ఆ పండుగ కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

01 December 2024, 5:30 IST

google News
    • Roti Kapda Romance OTT Streaming: ఓటీటీలో సరికొత్త తెలుగు బోల్డ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీ రోటి కపడా రొమాన్స్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. సుమారుగా థియేట్రికల్ రిలీజ్ అయిన పది రోజుల్లోనే రోటి కపడా రొమాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మరి ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటనే వివరాల్లోకి వెళితే..!
ఓటీటీలోకి 10 రోజుల్లోనే న్యూ తెలుగు బోల్డ్ కామెడీ మూవీ.. ఆ పండుగ కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీలోకి 10 రోజుల్లోనే న్యూ తెలుగు బోల్డ్ కామెడీ మూవీ.. ఆ పండుగ కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

ఓటీటీలోకి 10 రోజుల్లోనే న్యూ తెలుగు బోల్డ్ కామెడీ మూవీ.. ఆ పండుగ కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Roti Kapda Romance OTT Release: ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ కవ్విస్తుంటాయి. కొన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే, మరికొన్ని థియేట్రికల్ విడుదల అనంతరం నెల రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలను అయితే పట్టుమని పదిరోజుల్లోనే ఓటీటీ రిలీజ్ చేస్తుంటారు.

యూత్‌ఫుల్ సినిమాలను

అలాంటి సినిమానే న్యూ తెలుగు మూవీ రోటి కపడా రొమాన్స్. హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన సినిమానే రోటి కపడా రొమాన్స్. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి బెక్కం వెణుగోపాల్ నిర్మించిన రోటి కపడా రొమాన్స్ సినిమాకు విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

రొమాంటింక్ అండ్ బోల్డ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన రోటి కపడా రొమాన్స్ సినిమాలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కించిన రోటి కపడా రొమాన్స్ సినిమా నవంబర్ 28న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ అయింది.

టైటిల్‌కు తగినట్లుగా

థియేటర్లలో విడుదలైన రోటి కపడా రొమాన్స్ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి. అయితే, టాక్ పరంగా బాగున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రావట్లేదు. దీంతో యావరేజ్ టాక్‌తో రోటి కపడా రొమాన్స్ థియేటర్లలో రన్ అవుతోంది. ఇక టైటిల్‌కు తగినట్లుగానే సినిమాలో రొమాన్స్ తాలుకు సీన్స్ బాగానే ఉన్నాయని తెలుస్తోంది.

యూత్‌కు కనెక్ట్ అయ్యేలా లవ్, ఫ్రెండ్షిప్, బ్రేకప్ వంటి పాయింట్స్‌తో సినిమా సాగుతుంది. అలాగే, నేటితరం యువతకు మెసేజ్ కూడా ఇచ్చారు. బోల్డ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలతో పాటు నవ్వుకునే కామెడీ ట్రాక్‌తో యువతకు కనెక్ట్ అయ్యేలా రోటి కపడా రొమాన్స్ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి సినిమా అతి తక్కువ సమయంలో ఓటీటీలోకి వచ్చేయనుందని టాక్.

ఈటీవీ విన్ ఓటీటీలో

రోటి కపడా రొమాన్స్ ఓటీటీ రైట్స్‌ను తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ రిలీజ్‌కు ముందే మంచి ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే, రోటి కపడా రొమాన్స్ సినిమాను థియేట్రికల్ రిలీజ్‌ అయిన 28 రోజులకు అంటే డిసెంబర్ 26న ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 26న ఈటీవీ విన్‌లో రోటి కపడా రొమాన్స్ ఓటీటీ రిలీజ్ కానుందని టాక్.

అయితే, ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో అన్ని రోజులు ఆగకుండా ఇంకాస్తా ముందుగానే డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారని మరో వార్త వినిపిస్తోంది. డిసెంబర్ 9 నుంచే రోటి కపడా రొమాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే, థియేట్రికల్ రిలీజ్ అనంతరం పది రోజులకే రోటి కపడా రొమాన్స్ ఓటీటీలోకి వచ్చేయనుందన్నమాట.

బోల్డ్ సీన్స్‌తో

ఇలా తెలుగు యూత్ ఆడియెన్స్ కోసం పది రోజుల్లోనే రోటి కపడా రొమాన్స్ ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ మూవీ ట్రైలర్‌లో బెడ్‌ మీద ఉన్న హీరోతో అర్జున్ రెడ్డి పాట పెట్టమని రొమాంటిక్‌గా హీరోయిన్ అడగడం హైలెట్ అయింది. ఆ డైలాగ్ తర్వాత బోల్డ్ సీన్స్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇలాంటి బోల్డ్ సీన్స్‌తో రోటి కపడా రొమాన్స్ ఈటీవీ విన్ ఓటీటీలో అలరించనుందని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం