OTT: ఓటీటీలో అదరగొడుతున్న లక్కీ భాస్కర్- దేవరను దాటేసి టాప్‌ 1లో ట్రెండింగ్- డాకు మహారాజ్ అప్డేట్‌ ఇవ్వమన్న నెటిజన్!-lucky bhaskar ott streaming on netflix top 1 trending in 15 countries than devara netizens asks daku maharaj updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలో అదరగొడుతున్న లక్కీ భాస్కర్- దేవరను దాటేసి టాప్‌ 1లో ట్రెండింగ్- డాకు మహారాజ్ అప్డేట్‌ ఇవ్వమన్న నెటిజన్!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న లక్కీ భాస్కర్- దేవరను దాటేసి టాప్‌ 1లో ట్రెండింగ్- డాకు మహారాజ్ అప్డేట్‌ ఇవ్వమన్న నెటిజన్!

Sanjiv Kumar HT Telugu
Nov 30, 2024 09:26 PM IST

Lucky Bhaskar OTT Streaming And Trending: ఓటీటీలో తెలుగు బ్యాంకర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లక్కీ భాస్కర్ దుమ్ముదులుపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను దాటేసి మరి నెంబర్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీ నుంచి 8.3 రేటింగ్ సాధించిన లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో అదరగొడుతున్న లక్కీ భాస్కర్- దేవరను దాటేసి టాప్‌ 1లో ట్రెండింగ్- డాకు మహారాజ్ అప్డేట్‌ ఇవ్వమన్న నెటిజన్!
ఓటీటీలో అదరగొడుతున్న లక్కీ భాస్కర్- దేవరను దాటేసి టాప్‌ 1లో ట్రెండింగ్- డాకు మహారాజ్ అప్డేట్‌ ఇవ్వమన్న నెటిజన్!

Lucky Bhaskar OTT Trending: వివిధ భాషలలో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ "మహానటి", "సీతా రామం" వంటి సినిమాల్లో నటించడమే కాకుండా వాటితో ఘన విజయాలను సొంతం చేసుకున్నాడు.

ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్

ఇక రీసెంట్‌గా దుల్కర్ సల్మాన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ "లక్కీ భాస్కర్". ఈ సినిమాకు ధనుష్‌తో సార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. బ్యాంక్ నేపథ్యంలో క్రైమ్ అండ్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన లక్కీ భాస్కర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జంటగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో లక్కీ భాస్కర్ సినిమా విడుదల కానుంది. లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ నుంచే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

టాప్ 1 ట్రెండింగ్‌లో

థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న లక్కీ భాస్కర్ మూవీ ఇటీవలే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ అయింది. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన తొలి రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో స్థానం సంపాదించుకుంది లక్కీ భాస్కర్ మూవీ. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్ మూవీగా లక్కీ భాస్కర్ నిలిచింది.

ఓటీటీ రిలీజ్ అయిన రెండ్రోజుల్లోనే టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ దుమ్ముదులుపుతోంది తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లక్కీ భాస్కర్. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను దాటేసి మరి టాప్ 1లో సత్తా చాటుతోంది. అయితే, తారక్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో టాప్ 2 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

15 దేశాల్లో ట్రెండింగ్

నెట్‌ఫ్లిక్స్ టాప్ 1 ప్లేస్‌లో లక్కీ భాస్కర్ ఓటీటీ ట్రెండింగ్ అవుతోన్న విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. "ఇళ్లలో కూడా లక్కీ భాస్కర్ మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 15 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల్లో టాప్ 1 స్థానంలో లక్కీ భాస్కర్ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది" అని ట్వీట్ చేశారు.

లక్కీ భాస్కర్ టాప్ 1 ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోన్న పోస్టర్‌తో సహా ఈ ట్వీట్ చేసింది సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ. ఇంతలోనే ఈ పోస్ట్ వైరల్ అయింది. దీంతో నెటిజన్స్ పలు విధాలుగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. చాలా వరకు లక్కీ భాస్కర్ సినిమా చాలా బాగుందని రిప్లైలు ఇస్తున్నారు.

డాకు మహారాజ్ సాంగ్స్ గురించి

అయితే, ఓ నెటిజన్ మాత్రం బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమా గురించి కామెంట్ పెట్టాడు. "డాకు మహారాజ్ సాంగ్స్ అప్డేట్ చెప్పు నాగవంశీ అన్న ప్లీజ్" అని హేమంత్ బాబు అనే నెటిజన్ అడిగాడు. ఇదిలా ఉంటే, మొత్తానికి లక్కీ భాస్కర్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 15 దేశాల్లో టాప్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతూ దుమ్ముదులుపుతోంది.

Whats_app_banner