తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ స‌డెన్‌గా ఆగిపోవ‌డానికి కార‌ణం ఇదే - క్లారిటీ ఇచ్చిన రిషి

Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ స‌డెన్‌గా ఆగిపోవ‌డానికి కార‌ణం ఇదే - క్లారిటీ ఇచ్చిన రిషి

15 September 2024, 21:15 IST

google News
  • Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌ను స‌డెన్‌గా ముగించి ఫ్యాన్స్‌కు స్టార్ మా ఛానెల్ షాకిచ్చింది. టీఆర్‌పీ ప‌రంగా టాప్‌లో ఉన్న గుప్పెడంత మ‌న‌సును ఎండ్ చేయ‌డంపై సీరియ‌ల్ హీరో ముఖేష్ గౌడ అలియాస్ రిషి క్లారిటీ ఇచ్చాడు. అత‌డు ఏమ‌న్నాడంటే?

గుప్పెడంత మనసు రిషి
గుప్పెడంత మనసు రిషి

గుప్పెడంత మనసు రిషి

Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఇటీవ‌లే ముగిసింది. దాదాపు మూడేన్న‌రేళ్ల పాటు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియ‌ల్‌కు స‌డెన్‌గా శుభంకార్డు వేసి ఆడియెన్స్‌కు మేక‌ర్స్ షాకిచ్చారు. రిషి రీఎంట్రీ త‌ర్వాత గుప్పెడంత మ‌న‌సు క‌థ మ‌ళ్లీ ఇంట్రెస్టింగ్ గా మార‌డంతో మ‌రో ఏడాది పాటైన సీరియ‌ల్ టెలికాస్ట్ ఉండ‌వ‌చ్చ‌ని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ ఆశ‌ల‌కు పుల్‌స్టాప్ పెడుతూ రిషి, వ‌సుధార‌ల స‌మ‌స్య‌ల‌ను తీరిపోయిన‌ట్లుగా చూపించేసిన మేక‌ర్స్‌ సీరియ‌ల్‌ను ముగించారు.

టీఆర్‌పీలో టాప్ టెన్‌...

టీఆర్‌పీ ప‌రంగా స్టార్ మా ఛానెల్‌లో టాప్ టెన్‌లో ఉన్న ఈ సీరియ‌ల్‌ను స‌డెన్‌గా ఎండ్ చేయ‌డం ప‌ట్ల ఫ్యాన్స్ డిస‌పాయింట్ అయ్యారు. రిషిధార‌ల‌ను మిస్స‌వుతున్నామంటూ ఇప్ప‌టికీ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. మ‌రికొన్నాళ్లు ఈ సీరియ‌ల్ కొన‌సాగితే బాగుండేదంటూ పేర్కొంటున్నారు

ముఖేష్ గౌడ క్లారిటీ....

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌ను హ‌ఠాత్తుగా ముగించ‌డంపై సీరియ‌ల్ హీరో ముఖేష్ గౌడ అలియాస్ రిషి క్లారిటీ ఇచ్చాడు. ఎంత మంచి క‌థ‌నైనా ఓ టైమ్ వ‌ర‌కు చెబితేనే బాగుంటుంద‌ని ముఖేష్ గౌడ అన్నారు. ఆడియెన్స్ చూస్తున్నారు క‌దా అని క‌థ‌ను సాగ‌దీస్తే సీరియ‌ల్‌కు ఉన్న విలువ ప‌డిపోతుంద‌ని రిషి చెప్పాడు. గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తో పాటు రిషిధార‌ల క్యారెక్ట‌ర్స్ ప‌ట్ల‌ తెలుగు ఆడియెన్స్‌లో ఉన్న అభిమానం, ప్రేమ‌తో పాటు వాల్యూ త‌గ్గిపోకూడ‌ద‌నే సీరియ‌ల్‌ను ఎండ్ చేయాల్సివ‌చ్చింద‌ని రిషి చెప్పాడు.

"రిషిధార‌ల బంధం ఎంత ప‌విత్రంగా మొద‌లైందో అదే బాండింగ్‌తో నీట్‌గా సీరియ‌ల్‌ను ముగించ‌డ‌మే మంచిద‌ని అనిపించింది. ఇప్ప‌టికే మూడున్న‌ర ఏళ్ల నుంచి సీరియ‌ల్ టెలికాస్ట్ అవుతూ వ‌స్తోంది. ఇంకా క‌థ‌ను ల్యాగ్ చేయ‌డం మంచిది కాద‌నిపించింది. అవ‌న్నీ దృష్టిలో పెట్టుకునే గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు ముగించామ‌ని "ముఖేష్ గౌడ అన్నాడు.

సినిమాల క‌మిట్‌మెంట్స్‌..

ప్ర‌స్తుతం తాను రెండు సినిమాల‌ను అంగీక‌రించాన‌ని, వాటి క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల‌ సీరియ‌ల్‌కు టైమ్ కేటాయించ‌లేక‌పోతున్నాని ముఖేష్ గౌడ చెప్పాడు. తాను హీరోగా న‌టిస్తోన్న గీతాశంక‌రం, ప్రియ‌మైన నాన్న‌కు సినిమాలు వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్న‌ట్లు ముఖేష్ గౌడ చెప్పాడు. గీతాశంక‌రం ఈ ఏడాదే రిలీజ్ కావాల్సివుండ‌గా...అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదాప‌డిన‌ట్లు రిషి చెప్పాడు. ప్రియ‌మైన నాన్న‌కు మూవీ తెలుగుతో పాటు క‌న్న‌డంలో తెర‌కెక్కుతోంది.

బిగ్‌బాస్‌కు వెళ్ల‌ను..

బిగ్‌బాస్ 8 తెలుగులో ఆఫ‌ర్ వ‌చ్చినా వెళ్ల‌న‌ని ముఖేష్ గౌడ అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న త‌న మైండ్‌సెట్‌కు బిగ్‌బాస్ స‌రిపోద‌ని చెప్పాడు. గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో వ‌సుధార పాత్ర‌లో ర‌క్షా గౌడ న‌టించింది. సాయికిర‌ణ్‌, సురేష్‌బాబు కీల‌క పాత్ర‌లు పోషించారు.

తదుపరి వ్యాసం