Serial Heroine: పెళ్లిపీట‌లు ఎక్కుతోన్న ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ హీరోయిన్ - ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌-prema entha madhuram serial heroine varsha hk gets engaged to kaushik naidu telugu serial heroine zee telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Serial Heroine: పెళ్లిపీట‌లు ఎక్కుతోన్న ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ హీరోయిన్ - ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌

Serial Heroine: పెళ్లిపీట‌లు ఎక్కుతోన్న ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ హీరోయిన్ - ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 12, 2024 01:55 PM IST

Serial Heroine: ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ హీరోయిన్ వ‌ర్ష హెచ్‌కే క‌న్న‌డ న‌టుడు కౌశిక్‌నాయుడిని పెళ్లిచేసుకోబోతున్న‌ది. వ‌ర్ష‌, కౌశిక్‌నాయుడు ఎంగేజ్‌మెంట్ ఇటీవ‌ల జ‌రిగింది. వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

వ‌ర్ష హెచ్‌కే
వ‌ర్ష హెచ్‌కే

Serial Heroine: ప్రేమ ఎంత మ‌ధురం హీరోయిన్ వ‌ర్ష హెచ్‌కే అలియాస్ అనువ‌ర్ష త్వ‌ర‌లో పెళ్లిపీట‌ల ఎక్క‌నుంది. క‌న్న‌డ న‌టుడితో ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ది. వ‌ర్ష హెచ్‌కే ఎంగేజ్‌మెంట్ క‌న్న‌డ న‌టుడు కౌశిక్ నాయుడితో ఇటీవ‌ల జ‌రిగింది. వ‌ర్ష‌, కౌశిక్ నాయుడు ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

కౌశిక్ నాయుడు కూడా క‌న్న‌డంలో కొన్ని సీరియ‌ల్స్‌తో పాటు సినిమాల్లో న‌టించిన‌ట్లు స‌మాచారం. సీరియ‌ల్స్ ద్వారా వ‌ర్ష‌, కౌశిక్‌నాయుడు మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు స‌మాచారం. పెద్ద‌ల అంగీకారంతోనే ఈ జోడి పెళ్లిపీట‌లు ఎక్క‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ...

ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్‌తో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అను వ‌ర్ష‌. ఈ సీరియ‌ల్‌లో అనుగా అమ‌యాక‌త్వం, ధైర్యం క‌ల‌బోసిన క్యారెక్ట‌ర్‌లో క్యూట్ యాక్టింగ్‌తో మెప్పించింది. ప్రేమ ఎంత మ‌ధురం జీ తెలుగులో 2020లో ప్రారంభ‌మైంది. నాలుగేళ్లుగా టెలికాస్ట్ అవుతోన్న సీరియ‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు 1359 ఎపిసోడ్స్‌ను పూర్తిచేసుకున్న‌ది.

టీఆర్‌పీలో టాప్‌...

జీ తెలుగులో టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్న సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా ప్రేమ ఎంత మ‌ధురం కొన‌సాగుతోంది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ అర్బ‌న్ ప్ల‌స్ రూర‌ల్ ఏరియాల్లో క‌లిపి 3.62 టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకున్న‌ది. అర్బ‌న్ ఏరియాలో 4.75 టీఆర్‌పీ వ‌చ్చింది. ఈ సీరియ‌ల్‌లో త‌మ కెమిస్ట్రీతో శ్రీరామ్‌, అను బుల్లితెర అభిమానుల‌ను మెప్పించారు. ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్‌కు సాయి వెంక‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

క‌న్న‌డంలో మూడు సీరియ‌ల్స్‌...

అను అస‌లు పేరు హ‌ర్ష హెచ్‌. అయితే త‌న నిక్‌నేమ్ అను వ‌ర్ష పేరుతోనే ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యింది. ప్రేమ ఎంత మధురం కంటే ముందు క‌న్న‌డంలో నాగ‌మండ‌లం, క‌స్తూరి నివాస్, రాజారాణి సీరియ‌ల్స్‌లో న‌టించింది. ఈ క‌న్న‌డ సీరియ‌ల్స్‌తో వ‌చ్చిన గుర్తింపు ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. క‌న్న‌డంలో కొన్ని షార్ట్స్ ఫిల్మ్స్‌లో న‌టించింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోంది.

ప్రేమ ఎంత మ‌ధుర సీరియ‌ల్ త‌మిళంతో పాటు క‌న్న‌డ‌, మ‌రాఠీ, బెంగాళీ క‌న్న‌డ ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ రీమేక్ అయ్యింది.