Upendra Om: 550 సార్లు రీ రిలీజ్ అయిన ఉపేంద్ర కన్నడ కల్ట్ క్లాస్ లవ్‌స్టోరీ మూవీ ఏదో తెలుసా?
Upendra Om: ఉపేంద్ర దర్శకత్వంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన కన్నడ మూవీ ఓం ఇప్పటివరకు థియేటర్లలో 550 సార్లు రీ రిలీజైంది. అత్యధిక సార్లు రీ రిలీజైన ఇండియన్ మూవీగా రికార్డ్ నెలకొల్పింది.
Upendra Om: ప్రస్తుతం రీ రిలీజ్ మూవీస్ ట్రెండ్ సౌత్‌లో ఫేమస్ అయ్యింది. బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన పలు కల్ట్ క్లాసిక్ సినిమాలను రీ ప్రింట్ చేస్తూ మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఓ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్ రూపంలో ఒకటి, రెండు సార్లు ప్రేక్షకుల ముందుకు రావడం కామన్.
మహా అయితే ఐదు సార్లు రీ రిలీజ్ కావచ్చు. కానీ ఉపేంద్ర దర్శకత్వంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన కన్నడ మూవీ ఓం ఇప్పటివరకు థియేటర్లలో 550 సార్లు రీ రిలీజ్ అయింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక సార్లు రీ రిలీజ్ అయిన మూవీగా ఓం రికార్డును క్రియేట్ చేసింది.
70 లక్షల బడ్జెట్...
ఓం మూవీతోనే కన్నడంలో స్టార్ డైరెక్టర్‌గా ఉపేంద్ర మారాడు. బెంగళూరు మాఫియా బ్యాక్‌డ్రాప్‌కు లవ్‌స్టోరీని జోడించి తెరకెక్కించిన ఓం మూవీ కన్నడ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. కేవలం 70 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఓం సినిమా ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకొని 1995 నుంచి చాలా ఏళ్ల వరకు ప్రతి రెండు వారాలకు ఓ సారి రీ రిలీజ్‌చేస్తూ వచ్చారు. 2013 వరకే ఈ సినిమా 500 సార్లు రీ రిలీజైంది. 2015కు ఆ సంఖ్య 550కి చేరింది.
పది కోట్లకు శాటిలైట్ రైట్స్...
అంతే కాదు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 2015లో ఉదయ టీవీ పది కోట్లకు కొనుగోలు చేసింది. ఇరవై ఏళ్ల క్రితం రిలీజై అత్యధిక ధరకు శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయిన మూవీగా ఓం నిలిచింది. సౌత్‌లో గ్యాంగ్‌స్టర్ సినిమాలకు స్ఫూర్తిగా ఓం నిలిచింది.
ఓం సినిమాకుగాను బెస్ట్ హీరోగా శివరాజ్‌కుమార్, హీరోయిన్‌గా ప్రేమ, స్క్రీన్‌ప్లే రైటర్‌గా ఉపేంద్ర కర్ణాటక స్టేట్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఓం రిలీజై దాదాపు 29 ఏళ్ల అయినా ఇప్పటికి ఈ లవ్‌స్టోరీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
తెలుగులో రాజశేఖర్ హీరోగా...
ఓం సినిమాకు ఓంకారం పేరుతో రాజశేఖర్ హీరోగా తెలుగులోకి రీమేక్ చేశాడు ఉపేంద్ర. ఈ రీమేక్‌తో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కన్నడంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో మాత్రం యావరేజ్ రిజల్ట్‌ను దక్కించుకున్నది. తెలుగులో ప్రేమ, భాగ్యశ్రీ హీరోయిన్లుగా నటించారు. తెలుగుతో పాటు కన్నడ వెర్షన్స్‌లో ఉపేంద్ర గెస్ట్ రోల్ చేశాడు. తెలుగు వెర్షన్‌కు కమెడియన్ ఎల్‌బీ శ్రీరామ్ మాటలు అందించారు.
కబ్జాతో డిజాస్టర్...
గత ఏడాది కబ్జా సినిమాతో పాన్ ఇండియన్ మూవీ చేశాడు ఉపేంద్ర. కేజీఎఫ్‌కు పోటీగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కబ్జా సినిమాలో కన్నడ హీరోలు శివరాజ్‌కుమార్, సుదీప్ కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం యూఐ పేరుతో ప్రయోగాత్మక సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్నాడు ఉపేంద్ర. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ జూన్‌లో కన్నడంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.యూఐతో పాటు ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న బుద్ధివంత 2, త్రిశూలం సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటోన్నాయి.