Kantara In 100 Crore Club: వంద కోట్ల క్లబ్‌లో కాంతారా - కన్నడంలో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్
Kantara In 100 Crore Club: రిషబ్‌శెట్టి హీరోగా నటించిన కాంతారా సినిమా కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. కన్నడంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఆరో సినిమాగా నిలిచింది

Kantara In 100 Crore Club: కన్నడ సినిమా కాంతారా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రెండు వారాల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరింది. కన్నడంలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 30న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.
శనివారం నాటితో కన్నడ వెర్షన్ వంద కోట్ల కలెక్షన్స్ సాధించింది. కన్నడంలో ఆరో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ జాబితాలో 1207 కోట్లతో కేజీఎఫ్-2 ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. కేజీఎఫ్ -1 సినిమా 250 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలవగా 159 కోట్లతో విక్రాంత్ రోణ మూడో స్థానంలో ఉంది. జేమ్స్ (151 కోట్లు), 777 ఛార్లి (105 కోట్లు) నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. వాటి తర్వాతి స్థానంలో కాంతారా నిలిచింది.
శుక్రవారం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజైంది. తెలుగులో ఈ సినిమా సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకొంది. మొదటి రోజే ఐదు కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. హిందీలో శుక్రవారం నాడు నాలుగు కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది.
తమ భూమిని కాపాడుకోవడం కోసం శివ అనే యువకుడు సాగించిన పోరాటం నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రిషబ్‌శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. శివగా రిషబ్‌శెట్టి యాక్టింగ్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. సప్తగి గౌడ్, అచ్యుత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.