Ghost OTT Release Date: శివ‌రాజ్‌కుమార్ ఘోస్ట్‌... ఒకే నెల‌లో ఇటు థియేట‌ర్‌...అటు ఓటీటీలో రిలీజ్‌-ghost ott release date shivaraj kumar action entertainer movie streaming on zee5 ott on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ghost Ott Release Date: శివ‌రాజ్‌కుమార్ ఘోస్ట్‌... ఒకే నెల‌లో ఇటు థియేట‌ర్‌...అటు ఓటీటీలో రిలీజ్‌

Ghost OTT Release Date: శివ‌రాజ్‌కుమార్ ఘోస్ట్‌... ఒకే నెల‌లో ఇటు థియేట‌ర్‌...అటు ఓటీటీలో రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 03, 2023 05:53 AM IST

Ghost OTT Release Date: క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ ఘోస్ట్ ప‌ద‌మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే ఇటు థియేట‌ర్ల‌లో అటు ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఘోస్ట్ తెలుగు వెర్ష‌న్ న‌వంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. న‌వంబ‌ర్‌లోనే జీ5 ఓటీటీలో ఈ సినిమా విడుదలకానుంది.

 శివ‌రాజ్‌కుమార్ ఘోస్ట్
శివ‌రాజ్‌కుమార్ ఘోస్ట్

Ghost OTT Release Date: క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ ఘోస్ట్ మూవీ ప‌ద‌మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే థియేట‌ర్ల‌తో పాటు ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఘోస్ట్ మూవీ తెలుగు వెర్ష‌న్ న‌వంబ‌ర్ 4న (శ‌నివారం) థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మ‌రోవైపు ఈ సినిమా క‌న్న‌డ వెర్ష‌న్‌ జీ5 ఓటీటీలో న‌వంబ‌ర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

క‌న్న‌డంతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. థియేట‌ర్‌కు, ఓటీటీకి ప‌ద‌మూడు రోజులు మాత్ర‌మే వ్య‌వ‌ధి ఉండ‌టం గ‌మ‌నార్హం. ఘోస్ట్ సినిమా క‌న్న‌డ వెర్ష‌న్ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. తెలుగులోనూ ద‌స‌రాకు ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు.

ద‌స‌రాకు తెలుగులో భ‌గ‌వంత్ కేస‌రి, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావుతో పాటు ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో మూవీ రిలీజ్ కావ‌డంతో ఘోస్ట్‌ తెలుగు వెర్ష‌న్‌కు థియేట‌ర్లు దొర‌క‌లేదు. దాంతో రెండు వారాలు ఆల‌స్యంగా న‌వంబ‌ర్ 4న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఎమ్‌జీ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఘోస్ట్ సినిమాలో అనుప‌మ్‌ఖేర్‌, జ‌య‌రాం కీల‌క పాత్ర‌లు పోషించారు. దాదాపు 15 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఐదు కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఓ జైలును హైజాక్ చేసిన క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్‌...ఆ జైలులోని క్రిమిన‌ల్స్‌ను విడిచిపెట్ట‌మ‌ని అధికారుల‌ను ఎందుకు బెదిరించాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఇందులో శివ‌రాజ్‌కుమార్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించాడు.

టీ20 వరల్డ్ కప్ 2024