Sravanthi Serial: 220 ఎపిసోడ్స్‌తోనే బిగ్‌బాస్ నిఖిల్ సీరియ‌ల్‌కు శుభం కార్డు - ఇదేం ఎండింగ్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్స్‌-bigg boss nikhil maliyakkal sravanthi serial end with only 220 episodes gemini tv bihh boss 8 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sravanthi Serial: 220 ఎపిసోడ్స్‌తోనే బిగ్‌బాస్ నిఖిల్ సీరియ‌ల్‌కు శుభం కార్డు - ఇదేం ఎండింగ్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్స్‌

Sravanthi Serial: 220 ఎపిసోడ్స్‌తోనే బిగ్‌బాస్ నిఖిల్ సీరియ‌ల్‌కు శుభం కార్డు - ఇదేం ఎండింగ్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 08, 2024 07:16 AM IST

Sravanthi Serial: బిగ్‌బాస్ నిఖిల్ లీడ్ రోల్‌లో న‌టించిన స్ర‌వంతి సీరియ‌ల్ ముగిసింది. కేవ‌లం 220 ఎపిసోడ్స్‌తోనే ఈ సీరియ‌ల్‌కు ఎండ్ కార్డు వేసి బుల్లితెర ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ షాకిచ్చారు. డిసెంబ‌ర్ 2023లో ప్రారంభ‌మైన ఈ సీరియ‌ల్‌ను తొమ్మిది నెల‌ల్లోనే ముగించారు.

స్ర‌వంతి సీరియ‌ల్
స్ర‌వంతి సీరియ‌ల్

Sravanthi Serial: బిగ్‌బాస్ 8 తెలుగు ఫేమ్ నిఖిల్ మ‌లియ‌క్క‌ల్‌ లీడ్ రోల్‌లో న‌టించిన స్ర‌వంతి సీరియ‌ల్‌ ముగిసింది. శ‌నివారం నాటి ఎపిసోడ్‌తో మేక‌ర్స్ ఈ సీరియ‌ల్‌ను ఎండ్ చేశారు. కేవ‌లం 220 ఎపిసోడ్స్‌తోనే స్ర‌వంతి సీరియ‌ల్‌ను ముగించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 2023 డిసెంబ‌ర్‌లో స్ర‌వంతి సీరియ‌ల్ టెలికాస్ట్ ప్రారంభ‌మైంది. కేవ‌లం తొమ్మిది నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఈ సీరియ‌ల్‌కు శుభం కార్డు వేశారు. జెమిని టీవీలో అతి త‌క్కువ ఎపిసోడ్స్‌తో ఎండ్ అయిన సీరియ‌ల్‌గా స్ర‌వంతి నిలిచింది.

నంద‌కిషోర్‌, మీనావాసు...

స్ర‌వంతి సీరియ‌ల్‌లో నిఖిల్‌తో పాటు నంద‌కిషోర్‌, మీనావాసు, భ‌ర‌ణి శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సీరియ‌ల్‌కు కేవీఎస్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్ర‌వంతి ఇంట్రెస్టింగ్‌గా న‌డిచే టైమ్‌లోనే హ‌డావిడిగా మేక‌ర్స్ సీరియ‌ల్‌ను ముగించిన‌ట్లుగా క్లైమాక్స్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తోంది.

స్ర‌వంతిని మోసం చేసిన రిషి మారిపోయిన‌ట్లుగా క్లైమాక్స్ ఎపిసోడ్‌లో చూపించారు. ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో తాను పెరిగాన‌ని, ఆ నీడ‌లు న‌న్ను వ‌దిలిపెట్టిపోవాలంటే చ‌నిపోవ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని గ‌న్‌తో షూట్ చేసుకుంటాడు రిషి. కానీ అందులో బుల్లెట్స్ లేక‌పోవ‌డంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తాడు. రిషి మారిపోయాడ‌ని స్ర‌వంతి కూడా న‌మ్మిన‌ట్లుగా ఫైన‌ల్ ఎపిసోడ్‌లో చూపించారు. రిషి, స్ర‌వంతి పెళ్లితో సీరియ‌ల్‌కు ముగింపు ప‌డింది.

ఆన్స‌ర్స్ లేకుండానే...

ఫైన‌ల్ ఎపిసోడ్‌తో పాటు సీరియ‌ల్ క‌థ‌, క‌థ‌నాల‌పై ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. సీరియ‌ల్‌లో రిషి విల‌నిజం స‌రిగా చూపించ‌లేదు. గాయ‌త్రిగా స్ర‌వంతి ఎందుకు యాక్ట్ చేసింది...రిషి మారిపోవ‌డానికి కార‌ణాలు ఏమిట‌నే ట్విస్ట్‌ల‌ను క్లారిటీ ఇస్తూ మ‌రికొన్నాళ్లు సీరియ‌ల్‌ను న‌డిపించే అవ‌కాశం ఉంది. కానీ మేక‌ర్స్ మాత్రం అలాంటివేమీ చూపించ‌కుండానే సీరియ‌ల్‌కు ముగింపు ప‌లికారు. చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కూడా ఇవ్వ‌కుండా ముగించేశారు.

మూడు నెల‌ల వ‌ర‌కు నిఖిల్ దూరం...

నిఖిల్ అందుబాటులో లేక‌పోవ‌డంతోనే స్ర‌వంతి సీరియ‌ల్‌కు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్లు స‌మాచారం. కంటెస్టెంట్‌గా ఇటీవ‌లే బిగ్‌బాస్ 8లోకి ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్‌. అత‌డు మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు బిగ్‌బాస్ హౌజ్‌లోనే ఉండ‌నున్నాడు. నిఖిల్ లేకుండా అప్ప‌టివ‌ర‌కు సీరియ‌ల్‌ను న‌డిపించ‌డం క‌ష్టం కావ‌డంతోనే స్ర‌వంతికి ఎండ్‌కార్డ్ వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సీరియ‌ల్‌లో ఓ క్యారెక్ట‌ర్ స్థానంలో మ‌రో కొత్త యాక్ట‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టి న‌డిపించ‌డం చాలా సంద‌ర్భాల్లో క‌నిపిస్తుంది.

ఈ స్ట్రాట‌జీ ఫాలో అవుతూ నిఖిల్ స్థానంలో మ‌రొక‌రిని తీసుకొని స్ర‌వంతిని మ‌రికొన్నాళ్లు మేక‌ర్స్ ర‌న్ చేస్తార‌ని వార్త‌లొచ్చాయి. కానీ అలాంటి ట్రిక్స్ వాడ‌కుండా సీరియ‌ల్‌కు ఎండ్ కార్డ్ వేశారు. నిఖిల్‌కు ఉన్న క్రేజ్‌ను కార‌ణంగా స్ర‌వంతికి మంచి టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. నిఖిల్ స్థానంలో మ‌రొక‌రిని తీసుకుంటే సీరియ‌ల్‌కు ఉన్న ఫాలోయింగ్ త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని భావించి ఎండ్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఊర్వ‌శివో రాక్ష‌సివో కూడా...

బిగ్‌బాస్ నిఖిల్ లీడ్ రోల్‌లో న‌టించిన మ‌రో సీరియ‌ల్ ఊర్వ‌శివో రాక్ష‌సివో కూడా ఇటీవ‌లే ముగిసింది. తెలుగులో కోయిల‌మ్మ‌, గోరింటాకు, క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖంతో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేశాడు. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ షోలో ఓ కంటెస్టెంట్‌గా నిఖిల్ పాల్గొన్నాడు.