Guppedantha Manasu August 26th Episode: మ‌హేంద్ర‌పై శైలేంద్ర ఎటాక్ - తండ్రిని కాపాడిన రిషి - మ‌నును అనుమానించిన వ‌సుధార‌-guppedantha manasu august 26th episode rishi saves mahindra life star maa telugu serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 26th Episode: మ‌హేంద్ర‌పై శైలేంద్ర ఎటాక్ - తండ్రిని కాపాడిన రిషి - మ‌నును అనుమానించిన వ‌సుధార‌

Guppedantha Manasu August 26th Episode: మ‌హేంద్ర‌పై శైలేంద్ర ఎటాక్ - తండ్రిని కాపాడిన రిషి - మ‌నును అనుమానించిన వ‌సుధార‌

Nelki Naresh Kumar HT Telugu
Aug 26, 2024 07:27 AM IST

Guppedantha Manasu August 26th Episode: గుప్పెడంత మ‌న‌సు ఆగ‌స్ట్ 24 ఎపిసోడ్‌లో మ‌హేంద్ర‌ను చంపించి ఆ నేరాన్ని మ‌నుపై వేయాల‌ని శైలేంద్ర స్కెచ్ వేస్తాడు. శైలేంద్ర నియ‌మించిన మ‌నిషి మ‌హేంద్ర‌ను గ‌న్‌తో షూట్ చేస్తోండ‌గా రిషి తండ్రిని కాపాడుతాడు. మ‌నునే ఈ ఎటాక్ చేశాడ‌ని వ‌సుధార అపార్థం చేసుకుంటుంది

గుప్పెడంత మ‌న‌సు ఆగ‌స్ట్ 24 ఎపిసోడ్‌
గుప్పెడంత మ‌న‌సు ఆగ‌స్ట్ 24 ఎపిసోడ్‌

Guppedantha Manasu August 26th Episode: రంగాగా త‌మ‌ముందు న‌టిస్తున్న‌ది రిషినే అని దేవ‌యాని, శైలేంద్ర అనుమాన‌ప‌డ‌తారు. త‌న అనుమానం నిజ‌మో కాదో తెలుసుకుందామ‌ని రిషి ఇంటికి వెళ‌తాడు శైలేంద్ర‌. ఎందుకొచ్చావ‌ని శైలేంద్ర‌ను అడుగుతాడు రిషి.

బాబాయ్ ఎలా ఉన్నాడో...అస‌లు ఉన్నాడో లేదో చూసి వెళ‌దామ‌ని వ‌చ్చాన‌ని శైలేంద్ర ఆన్స‌ర్ ఇస్తాడు. అత‌డి మాట‌ల‌తో రిషి షాక‌వుతాడు. ఆ త‌ర్వాత మాట మారుస్తాడు శైలేంద్ర‌. బాబాయ్‌కి బోర్ కొడుతుంద‌ని మాట్లాడ‌టానికి వ‌చ్చాన‌ని చెబుతాడు.

ఎందుకు అబ‌ద్ధం చెప్పావ్‌...

ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడాల‌ని రిషిని ప‌క్క‌కు తీసుకెళ‌తాడు శైలేంద్ర‌. నీ గురించి ఎంక్వైరీ చేయ‌డానికి మీ ఊరు వెళ్లాన‌ని, స‌రోజ‌ను క‌లిశాన‌ని రిషితో చెబుతాడు శైలేంద్ర‌. వ‌సుధార నీ మ‌నిషి అని తెలిసిపోయింద‌ని అంటాడు.

నేను మీ ఊరికి వ‌చ్చిన‌ప్పుడు వ‌సుధార ఫొటో చూపించి ఈవిడ నీకు తెలుసా అని అడిగితే ఇంట్లో ఉంచుకొని ఎందుకు తెలియ‌ద‌ని అబ‌ద్దం ఆడావ‌ని రిషిని నిల‌దీస్తాడు శైలేంద్ర‌. నువ్వు నిజంగానే రిషివా? నువ్వు వ‌సుధార క‌లిసి నా ముందు రంగాగా డ్రామాలు ఆడుతున్నారా చెప్పాలంటూ శైలేంద్ర ప‌ట్టుప‌డ‌తాడు.

వ‌సుధార‌కు శ‌త్రువులు...

శైలేంద్ర‌కు పాండు ఫొటో చూపిస్తాడు రిషి. ఈ రౌడీ గ్యాంగ్ వ‌సుధార‌ను చంప‌బోతుంటే నేను కాపాడాడు. ఆ త‌ర్వాత అదే రౌడీ గ్యాంగ్ న‌న్ను చంప‌బోతే వ‌సుధార సేవ్ చేసింది. వ‌సుధార‌కు శ‌త్రువులు ఉన్నార‌ని, ఎవ‌రో ఆమె ప్రాణాలు తీయ‌బోతున్నార‌ని తెలిసి ఆమెను మా ఇంటికి తీసుకెళ్లాన‌ని శైలేంద్ర‌ను న‌మ్మిస్తాడు రిషి.

నువ్వు వ‌సుధార ఫొటో చూపించిన‌ప్పుడు నీ వ‌ల్ల ఆమె ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని భావించి అలా అబ‌ద్ధం ఆడాన‌ని శైలేంద్ర‌తో అంటాడు రిషి. ఆ త‌ర్వాత అయినా వ‌సుధార‌తో ప‌రిచ‌యం ఉంద‌నే నిజం నా ద‌గ్గ‌ర ఎందుకు దాచావ‌ని శైలేంద్ర గొడ‌వ చేస్తాడు. నువ్వు అడ‌గ‌లేదు..అందుకు నేను చెప్ప‌లేద‌ని రిషి మాట దాటేస్తాడు.

సీన్ రివ‌ర్స్‌...

ప్ర‌తిసారి న‌న్ను అనుమానించ‌డం క‌రెక్ట్ కాద‌ని శైలేంద్ర‌తో అంటాడు రిషి. ఇలా బ‌య‌ట‌కు పిలిచి అడ‌గ‌టం బాగాలేద‌ని అంటాడు. క‌ష్టాల్లో ఉన్న కాలేజీని కాపాడాలి, నాకు ప‌ద‌వుల‌పై ఆశ‌లేద‌ని ఏవేవో క‌థ‌లు నువ్వు చెప్పావు. కానీ ఇక్క‌డ సీన్ రివ‌ర్స్‌లా ఉంది. అయినా నిన్ను ఏ రోజు అనుమానించ‌లేద‌ని శైలేంద్ర నోరూమూయిస్తాడు రిషి.

నువ్వు ఎండీ సీట్ కోసం ఎన్నో కుట్ర‌లు చేశావ‌టా. జ‌గ‌తిని భ‌య‌పెట్టావ‌ట‌, ఆమె ప్రాణాలు తీసింది నువ్వేన‌ట‌ క‌దా అని శైలేంద్ర‌తో అంటాడు రిషి. నిజాల‌న్నీ రంగా రూపంలో ఉన్న రిషికి తెలిసిపోవ‌డంతో శైలేంద్ర టెన్ష‌న్‌తో వ‌ణికిపోతాడు. త‌ప్పుల‌న్నీ మీవైపు పెట్టుకొని న‌న్ను ఎలా అనుమానిస్తావ‌ని శైలేంద్ర‌పై రిషి రివ‌ర్స్ ఎటాక్ చేస్తాడు.

రిషిలాన‌టించ‌డానికి...

రిషిలా న‌టించ‌డానికి నేనే వ‌చ్చానా? మీరే న‌న్ను తీసుకొచ్చారా అంటూ నిల‌దీయ‌డంతో శైలేంద్ర సెలైంట్ అవుతాడు. ఇప్పుడు నా చేతిలో ఎండీ ప‌ద‌వి ఉంది.నేను మిమ్మ‌ల్ని మోసం చేయ‌డం ఎంత‌సేపు అని శైలేంద్ర‌కు పంచ్ ఇస్తాడు.

ఇంకోసారి న‌న్ను అనుమానిస్తే చెప్ప‌పెట్ట‌కుండా వెళ్లిపోతాన‌ని శైలేంద్ర‌ను భ‌య‌పెట్టిస్తాడు రిషి. రిషి మాట‌ల‌తో అత‌డు రంగానే ఫిక్స‌వుతాడు శైలేంద్ర‌. త‌న‌వ‌న్నీ భ్ర‌మ‌లు అని తేల్చుకుంటాడు.

శైలేంద్ర కుట్ర‌...

ఇంత‌లోనే శైలేంద్ర‌కు ఓ ఫోన్ వ‌స్తుంది. రిషికి దూరంగా వ‌చ్చి...మొహం గుర్తుందిగా..మిస్స‌వ్వొద్దు అంటూ ఎవ‌రితోనో చెబుతాడు. శైలేంద్ర మాట‌ల్ని రిషి వింటాడు. అన్న‌య్య ఏదో ప్లాన్ చేస్తున్నాడ‌ని అనుమాన‌ప‌డ‌తాడు. ఫ‌ణీంద్ర‌ను సాగ‌నంప‌డానికి కారువ‌ద్ద‌కు వ‌స్తాడు మ‌హేంద్ర‌. శైలేంద్ర నియ‌మించిన షూట‌ర్ మ‌హేంద్ర‌పై గ‌న్ గురిపెట్టి కాల్చుతాడు.

ఆ బుల్లెట్ తండ్రికి త‌గ‌ల‌కుండా మ‌హేంద్ర‌ను కాపాడుతాడు రిషి. గ‌న్ శ‌బ్ధం విని అంద‌రూ కంగారుప‌డ‌తారు. మ‌ళ్లీ త‌న ప్లాన్ ఫెయిల‌వ్వ‌డంతో శైలేంద్ర డిస‌పాయింట్ అవుతాడు. పైకి మాత్రం కంగారు ప‌డిన‌ట్లుగా న‌టిస్తాడు.

పోలీస్ కంప్లైంట్‌...

రిషి వ‌చ్చాడు, క‌ష్టాల‌న్నీ తీరిపోయాయ‌ని అనుకునే టైమ్‌లో మ‌ళ్లీ ఈ ఎటాక్‌లు ఏంటి అని ఫ‌ణీంద్ర భ‌య‌ప‌డ‌తాడు. ఈ సంఘ‌ట‌న‌పై వెంట‌నే పోలీస్ కంప్లైంట్ ఇద్దామ‌ని అంటాడు. పోలీసుల పేరు విన‌గానే శైలేంద్ర టెన్ష‌న్ ప‌డ‌తాడు. వ‌ద్ద‌ని అంటాడు. తాను చూసుకుంటాన‌ని, పోలీస్ కంప్లైంట్ వ‌ద్ద‌ని రిషి కూడా అన‌డంతో ఫ‌ణీంద్ర ఊరుకుంటాడు.

మ‌హేంద్ర ఎమోష‌న‌ల్‌...

బుల్లెట్ త‌గ‌ల‌కుండా త‌న‌ను రిషి కాపాడ‌టంతో మ‌హేంద్ర ఎమోష‌న‌ల్ అవుతాడు. నా ప్రాణం తీయాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంది అని ఆలోచిస్తుంటాడు. మీరు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని తండ్రికి ధైర్యం చెబుతాడు తండ్రి. ఇదంతా ఎవ‌రు చేశారో నాకు తెలుసు అంటూ వ‌సుధార ఆవేశంగా బ‌య‌ట‌కు వ‌స్తుంది. రిషి పిలిచిన ఆగ‌దు.

సరోజ ఫైర్…

త‌న ప్లాన్ ఫెయిల‌వ్వ‌డంతో మ‌రో కొత్త స్కెచ్ వేస్తాడు శైలేంద్ర‌. స‌రోజ‌కు ఫోన్ చేస్తాడు. మీ బావ నీకు దూరం కావ‌డానికి కార‌ణం నేను కాదు...వ‌సుధార అని స‌రోజ‌కు అబ‌ద్ధాలు చెబుతాడు శైలేంద్ర‌. కావాల‌నే వ‌సుధార‌పై స‌రోజ మ‌న‌సులో ద్వేషాన్ని నింపుతాడు.

వ‌సుధార వ‌ల్ల నీకే నాకు చాలా న‌ష్టం జ‌రుగుతుంద‌ని స‌రోజ‌తో అంటాడు. నేను ఓ ప‌నిమీద రంగాను ఇక్క‌డికి తీసుకొస్తే...వ‌సుధార ట్రాప్ చేసి త‌న‌తో పాటు రంగాను తీసుకెళ్లిపోయింద‌ని స‌రోజ‌ను న‌మ్మిస్తాడు. వ‌సుధార అడ్రెస్ స‌రోజ‌కు ఇస్తాడు.

మ‌నుపై వ‌సు అనుమానం...

మ‌హేంద్ర‌పై ఎటాక్ చేసింది మ‌ను అని వ‌సుధార అపోహ‌ప‌డుతుంది. ఆవేశంగా మ‌ను ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. మీకు ఎందుకంతా కోపం, ఆవేశం అని మ‌నును నిల‌దీస్తుంది. మ‌హేంద్ర‌పై ఎందుకు ఎటాక్ చేశావ‌ని నిల‌దీస్తుంది. తాను ఎవ‌రిపై ఎటాక్ చేయ‌లేద‌ని మ‌ను స‌మాధాన‌మిస్తాడు. నాకు మ‌హేంద్ర‌కు ఎలాంటి శ‌త్రుత్వం లేద‌ని, ఆయ‌న‌పై నేనేందుకు ఎటాక్ చేస్తాన‌ని వ‌సుధార‌తో అంటాడు మ‌ను.

మ‌హేంద్ర నీ క‌న్న తండ్రి అనే నిజం మ‌ను ముందు బ‌య‌ట‌పెట్ట‌బోయి ఆగిపోతుంది వ‌సుధార‌. వ‌సుధార అప్పుడు కూడా నిజం దాచిపెడుతుండ‌టం చూసి మ‌ను కోపంతో ర‌గిలిపోతాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.