Venu Swamy Bigg Boss 8: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్‌గా వేణుస్వామి? - భారీ రెమ్యున‌రేష‌న్ ఫిక్స్‌!-celebrity astrologer venu swamy to step in contestant in boss boss season 8 nagarjuna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venu Swamy Bigg Boss 8: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్‌గా వేణుస్వామి? - భారీ రెమ్యున‌రేష‌న్ ఫిక్స్‌!

Venu Swamy Bigg Boss 8: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్‌గా వేణుస్వామి? - భారీ రెమ్యున‌రేష‌న్ ఫిక్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Jul 04, 2024 09:52 AM IST

Venu Swamy Bigg Boss 8: సినిమా స్టార్స్ జాత‌కాలు చెబుతూ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన ఆస్ట్రాల‌జ‌ర్ వేణుస్వామి బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్‌బాస్ పాల్గొన‌డానికి వేణుస్వామిగా భారీగా రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం

వేణుస్వామి
వేణుస్వామి

Venu Swamy Bigg Boss 8: సినీ సెల‌బ్రిటీల‌తో పాటు రాజ‌కీయ‌నాయ‌కులు, క్రీడాకారుల జాత‌కాలు చెబుతూ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యాడు వేణుస్వామి. ఈ ఆస్ట్రాల‌జ‌ర్‌ చెప్పిన జాత‌కాల విష‌యంలో చాలా సార్లు అంచ‌నాలు త‌ల‌క్రిందులు అయ్యాయి.నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌తో పాటు మ‌రికొంద‌రు సినిమా స్టార్స్ కు సంబంధించి వేణు స్వామి చెప్పిన జాత‌కాలు మాత్రం నిజ‌మ‌య్యాయి.

ఏపీ ఎన్నిక‌ల్లో...

ఇటీవ‌ల జ‌రిగిన‌ ఏపీ ఎన్నిక‌ల్లో వైఎస్ జగన్ గెలుస్తారని వేణు స్వామి చెప్పారు. కానీ వేణుస్వామి జాత‌కం నిజం కాలేదు. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మి పాల‌వ్వ‌గా...టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింది. ఎన్నిక‌ల రిజ‌ల్ట్ త‌ర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని వేణుస్వామి ప్రకటన చేశారు.

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ...

జాత‌కాల ద్వారా సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీగా వేణుస్వామి మారిపోయాడు. వీడియోలు, మీమ్స్‌,ట్రోల్స్‌తో త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో క‌నిపించే వేణుస్వామి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్‌బాస్ సీజ‌న్ 8లో ఓ కంటెస్టెంట్‌గా వేణుస్వామి ఫిక్సైన‌ట్లు, హౌజ్‌లో సంద‌డి చేయ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

భారీ రెమ్యున‌రేష‌న్‌...

సోష‌ల్ మీడియాలో వేణు స్వామికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని బిగ్‌బాస్ ఆఫ‌ర్‌తో ఇటీవ‌లే స్టార్ మా యాజ‌మాన్యం వేణుస్వామిని సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వ‌డానికి వేణు స్వామి అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఇందుకోసం వేణుస్వామి భారీగా రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు బిగ్‌బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌లో ఎవ‌రు తీసుకోనంత రెమ్యున‌రేష‌న్‌ను వేణుస్వామి కోరిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వేణు స్వామి ఎంట్రీ ఇస్తే షో స‌క్సెస్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, వ్యూస్‌, టీఆర్‌పీ రేటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉండ‌టంతో వేణుస్వామి కోరినంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ టీమ్ ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం.

ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్‌...

కాగా బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 స‌క్సెస్ నేప‌థ్యంలో బిగ్‌బాస్ 8ను ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్ నెల‌లో ప్రారంభించేందుకు స్టార్‌మా స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం.ఈ సీజ‌న్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా కొంద‌రు టీవీ, సోష‌ల్ మీడియా స్టార్స్ పేర్లు వినిపిస్తోన్నాయి.

కంటెస్టెంట్స్ వీళ్లేనా...

విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్, క‌మెడియ‌న్‌ బంచిక్‌బ‌బ్లూ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. యూట్యూబ్ స్టార్‌ నేత్ర‌తో పాటు ఆమె మాజీ భ‌ర్త వంశీ కూడా బిగ్‌బాస్ 8లో సంద‌డి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. జ‌బ‌ర్ధ‌స్థ్ షో నుంచి పొట్టి న‌రేష్, రియాజ్, కిరాక్ ఆర్‌పీ, బుల్లెట్ భాస్క‌ర్‌ల‌లో ఒక‌రు లేదా ఇద్ద‌రు బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్ట‌నున్న‌ట్లు చెబుతోన్నారు.

బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా రీతూ చౌద‌రి, యూట్యూబ‌ర్ నిఖిల్ విజ‌యేంద్ర‌సింహా, బ‌ర్రెల‌క్క‌, కుమారి ఆంటీ, ఖుషిత క‌ల్ల‌పు పేర్లు కూడా వినిపిస్తోన్నాయి.వీరితో పాటు పాత కంటెస్టెంట్స్ అయినా నైనీ పావ‌ని, యాంక‌ర్ శివ, స్ర‌వంతి చొక్కార‌పు హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

నాగార్జున‌నే హోస్ట్‌...

బిగ్‌బాస్ సీజ‌న్ 8కు నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. నాగార్జున స్థానంలో హోస్ట్‌గా బాల‌కృష్ణ‌తో పాటు మ‌రికొంద‌రు స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. సీజ‌న్ 7 స‌క్సెస్ కావ‌డంతో హోస్ట్‌ను మార్చాల‌నే నిర్ణ‌యంపై బిగ్‌బాస్ యాజ‌మాన్యం వెన‌క్కి త‌గ్గిన‌ట్లు చెబుతోన్నారు.

WhatsApp channel