Badmash Gallaki Bumper Offer: బ‌ద్మాష్‌గాళ్ళ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - హీరోగా మారిన మ్యాడ్ క‌మెడియ‌న్‌!-badmash gallaki bumper offer movie release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Badmash Gallaki Bumper Offer: బ‌ద్మాష్‌గాళ్ళ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - హీరోగా మారిన మ్యాడ్ క‌మెడియ‌న్‌!

Badmash Gallaki Bumper Offer: బ‌ద్మాష్‌గాళ్ళ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - హీరోగా మారిన మ్యాడ్ క‌మెడియ‌న్‌!

Nelki Naresh Kumar HT Telugu
Dec 27, 2023 02:20 PM IST

Badmash Gallaki Bumper Offer: సామాన్యుడు మూవీ ఫేమ్ ర‌వి చావ‌లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న బ‌ద్మాష్‌గాళ్ళ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ మూవీ డిసెంబ‌ర్ 29న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ క‌మ‌ర్షియ‌ల్ కామెడీ మూవీలో సంతోష్‌, ఇంద్ర‌సేన హీరోలుగా న‌టిస్తున్నారు.

బ‌ద్మాష్‌గాళ్ళ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ మూవీ
బ‌ద్మాష్‌గాళ్ళ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ మూవీ

Badmash Gallaki Bumper Offer: మ్యాడ్ ఫేమ్ సంతోష్‌, ఇంద్ర‌సేన హీరోలుగా న‌టించిన బ‌ద్మాష్‌గాళ్ళ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ మూవీ డిసెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. క‌మ‌ర్షియ‌ల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు ర‌వి చావ‌లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌మెన్ ద‌గ్గ‌ర ప‌నిచేసే ఇద్ద‌రు యువ‌కులు డ‌బ్బు కోసం త‌మ య‌జ‌మానినే కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ వారి జీవితాల‌ను ఎలాంటి మ‌లుపులు తిప్పింద‌న్న‌దే బ‌ద్మాష్ గాళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ మూవీ క‌థ‌.

ఈ సినిమాలొ ప్ర‌గ్యా న‌య‌న్‌, న‌వీరెడ్డి హీరోయిన్లుగా న‌టించ‌గా ...మెర్లిన్ ఫిలిప్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. డిసెంబ‌ర్ 29న తెలుగు రాష్ట్రాల‌తో పాటు బెంగ‌ళూరు, అమెరికాలో ఈ మూవీ రిలీజ్ కాబోతున్న‌ట్లు నిర్మాత ర‌మేష్ కుమార్ తెలిపాడు. సామాన్యుడు సినిమాతో డైరెక్ట‌ర్‌గా నంది అవార్డును అందుకున్నాడు ర‌వి చావ‌లి.

ఆ త‌ర్వాత బాల‌కృష్ణ‌తో శ్రీమ‌న్నారాయ‌ణ‌, నితిన్ విక్ట‌రీతో పాటు ద‌గ్గ‌ర‌గా దూరంగా, ప్యార్ మే ప‌డిపోయానే వంటి సినిమాల‌ను తెర‌కెక్కించాడు. శాస‌న‌స‌భ సినిమాతో ఇంద్ర‌సేన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మ్యాడ్ మూవీలో క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు సంతోష్‌. ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

IPL_Entry_Point

టాపిక్