Sreeleela Astrology : శ్రీలీల జాతకం చెప్పిన వేణుస్వామి.. ఆ స్టార్ నటితో పోలిక-today astrology astrologer venu swamy predicts actress sreeleela cinema career she will be the number 1 in south cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreeleela Astrology : శ్రీలీల జాతకం చెప్పిన వేణుస్వామి.. ఆ స్టార్ నటితో పోలిక

Sreeleela Astrology : శ్రీలీల జాతకం చెప్పిన వేణుస్వామి.. ఆ స్టార్ నటితో పోలిక

HT Telugu Desk HT Telugu

Sreeleela Astrology : నటి శ్రీలీల పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో రెండు సినిమాలతోనే సూపర్ పాపులర్ అయిపోయింది. తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఆమె జాతకం గురించి జ్యోతిష్యుడు వేణుస్వామి కొన్ని అంచనాలు వేశారు.

శ్రీలీల జాతకం

శ్రీలీల కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినిమా ప్రపంచంలోకి వచ్చి హిట్ చిత్రాలను ఇచ్చి స్టార్ నటిగా ఎదిగింది. తెలుగు సినిమాల్లోనూ మెరుస్తూ.. అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల బేబీ సినిమా(Baby Cinemaa) సక్సెస్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ కూడా ఆమెను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆమె చేతిలో ఇప్పుడు 8 సినిమాల వరకూ ఉన్నాయి. శ్రీలీల(Sreeleela) డ్యాన్స్, నటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తెలుగులో చాలా బిజీ నటి అయిపోయింది. వాటిలో చాలా వరకు విడుదలకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇదిలా ఉండగా, శ్రీలీల విజయవంతమైన ప్రయాణం గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venuswamy) జోస్యం చెప్పారు. ప్రస్తుతం సక్సెస్ పీక్స్ లో ఉన్న భవిష్యత్తును బయటపెట్టారు. సినీ జనాల గురించి వేణు స్వామి అంచనాలు ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి. ఇప్పుడు ఇదే జ్యోతిష్యుడు శ్రీలీల సినిమా కెరీర్ ఎలా ఉండబోతుందో చెప్పారు.

పెళ్లి సందడి(Pelli Sandadi) సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన శ్రీల, ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ్ నటించిన ధమాకా(Dhamaka) సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఆమె డ్యాన్స్, నటనకు చాలా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు శ్రీలీల తెలుగులోనే 8కి పైగా సినిమాల్లో(Sreeleela Telugu Movies) నటిస్తోంది. ఆమె చాలా సంవత్సరాలు అగ్ర నటిగా కొనసాగుతుందని జ్యోతిష్యుడు వేణుస్వామి అంచనా వేశారు.

'శ్రీలీల సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. నటనలో మరో మైలురాయిని చేరుకోబోతుంది. శ్రీలీలా రాశి మీనరాశి. ఆమె జాతకంలో శక్తివంతమైన రాజయోగం ఉంది. ఈ రాజయోగానికి పెద్ద పేరు తెచ్చే యోగం ఉంది. పేరు పెరిగే కొద్దీ ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. 2028 వరకు శ్రీలీల టాలీవుడ్ లో పెద్ద పేరు తెచ్చుకుంటుంది.' అని వేణు స్వామి అంచనా వేశారు.

సౌత్ సినిమా(South Cinema) ఇండస్ట్రీలో మంచి నటిగా, లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. గత పదేళ్లుగా స్టార్ నటిగా కొనసాగుతోంది. ఈ నటి జాతకానికి అత్యంత సన్నిహిత జాతకం శ్రీలీలదేనని వేణుస్వామి అంచనా. టాలీవుడ్ టాప్ నటీమణులుగా గుర్తింపు తెచ్చుకున్న సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్డేలాగా శ్రీలీల మంచి పేరు తెచ్చుకోనుందట. అయితే సౌత్ సినిమాల్లో శ్రీల నెంబర్ 1 నటిగా నిలుస్తుందని వేణు స్వామి జోస్యం(Venuswamy Astrology) చెప్పారు.

టాలీవుడ్ లో వేణు స్వామి వేసిన ఎన్నో అంచనాలు నిజమయ్యాయి. అలాంటి వాటిలో ఒకటి సమంత, నాగ చైతన్య విడిపోవడం.. ఇలా కొన్ని విషయాల్లో వేణుస్వామి చెప్పిన విషయాలు నిజమయ్యాయి. అంతేకాదు.. స్టార్ నటీమణులు సైతం.. తమ కెరీర్ సక్సెస్ కోసం వేణుస్వామితో పూజలు చేయించుకున్నారు. ఇప్పుడు అదే జ్యోతిష్యుడు శ్రీలీల భవిష్యత్తును కూడా అంచనా వేశారు.