Nidhhi Agerwal - Venu Swamy: నిధి అగ‌ర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజ‌లు - కార‌ణం ఇదేనా-nidhhi agarwal performing special pooja at her home with venu swamy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nidhhi Agerwal - Venu Swamy: నిధి అగ‌ర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజ‌లు - కార‌ణం ఇదేనా

Nidhhi Agerwal - Venu Swamy: నిధి అగ‌ర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజ‌లు - కార‌ణం ఇదేనా

Nelki Naresh Kumar HT Telugu
Mar 28, 2023 07:25 AM IST

Nidhhi Agerwal - Venu Swamy: ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత మ‌రో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది నిధి అగ‌ర్వాల్‌. కెరీర్ స‌జావుగా సాగేందుకు వేణు స్వామి ఆధ్వ‌ర్యంలో నిధి అగ‌ర్వాల్ ప్ర‌త్యేకంగా పూజ‌లు నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం.

నిధి అగ‌ర్వాల్‌
నిధి అగ‌ర్వాల్‌

Nidhhi Agerwal - Venu Swamy: టాలీవుడ్ సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యాడు వేణుస్వామి. స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకుల‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖుల జీవితాల‌పై వేణుస్వామి చెప్పిన కొన్ని విష‌యాలు స‌రిగ్గా జ‌ర‌గ‌డంతో అత‌డి మాట‌ల‌పై చాలా మందికి న‌మ్మ‌కం కుదిరింది.

కామ‌న్ పీపుల్‌తో పాటు హీరోయిన్లు కూడా వేణుస్వామి జాత‌కాల్ని న‌మ్ముతోన్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌త కొన్నాళ్లుగా టాలీవుడ్ ప్ర‌ముఖులు వేణుస్వామి చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఇటీవ‌లే ర‌ష్మిక మంద‌న్నతో వేణు స్వామి ఓ యాగం చేయించిన‌ట్లు స‌మాచారం.

తాజాగా మ‌రో హీరోయిన్ నిధి ఆగ‌ర్వాల్ చేత వేణు స్వామి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. నిధి అగ‌ర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజ‌లు చేస్తోన్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఛాన్స్‌లు పెరిగి కెరీర్ స‌క్ర‌మంగా సాగేలా నిధి అగ‌ర్వాల్ చేత వేణు స్వామి ఓ యాగం చేయించిన‌ట్లు చెబుతోన్నారు. ఈ వీడియోలో వేణు స్వామి చెప్పిన‌ట్లుగా పూజ‌ను నిర్వ‌హిస్తూ నిధి అగ‌ర్వాల్ క‌నిపిస్తోంది. .

2018లో స‌వ్య‌సాచి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి అగ‌ర్వాల్‌. ఐదేళ్ల ప్ర‌యాణంలో తెలుగులో ఇస్మార్ట్ శంక‌ర్‌, హీరోతో పాటు త‌మిళంలో భూమి, ఈశ్వ‌ర‌న్ స‌హా మ‌రికొన్ని సినిమాలు చేసింది. ఇస్మార్ట్ శంక‌ర్ మిన‌హా మిగిలిన సినిమాలు ఆమెకు విజ‌యాల్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది నిధి అగ‌ర్వాల్‌. ఈ సినిమాపైనే భారీగా ఆశ‌లు పెట్టుకున్న‌ది.

WhatsApp channel