Video: సమంత స్టైలిష్ డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్-samantha share her dance video in bali trip video goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Video: సమంత స్టైలిష్ డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్

Video: సమంత స్టైలిష్ డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 28, 2023 03:57 PM IST

Video: బాలీ ట్రిప్‍లో ఉన్న స్టార్ హీరోయిన్ సమంత డ్యాన్స్ అదరగొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Video: సమంత స్టైలిష్ డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్ (Photo: Instagram)
Video: సమంత స్టైలిష్ డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్ (Photo: Instagram)

Video: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకుంది. అంగీకరించిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం ఆమె స్నేహితులతో బాలీ ట్రిప్‍కు వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో సమంత డ్యాన్స్ చేసింది. తన స్నేహితురాలితో కలిసి చాలా గ్రేస్‍గా స్టెప్స్ వేసింది. ఈ వీడియోను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. వివరాలివే..

"గర్ల్స్ ట్రిప్ 100/100" అంటూ ఈ వీడియోను సమంత నేడు పోస్ట్ చేసింది. తన స్నేహితురాలితో కలిసి సమంత చేసిన డ్యాన్స్ పర్‌ఫెక్ట్‌గా ఉంది. వైట్ టాప్, డెనిమ్ బాటమ్ వేసుకొని సమంత అందంగా కనిపించింది. స్టైలిష్, ఎనర్జిటిక్‍గా డ్యాన్స్ చేసింది. సరికొత్త షార్ట్ హెయిర్ స్టైల్‍తో డిఫరెంట్ లుక్‍లో ఉంది. సమంత పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు గంటల్లోనే మిలియన్‍కు పైగా లైక్స్ వచ్చాయి. అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో వైరల్‍గా మారింది. సమంత జోష్ చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. 

విజయ్ దేవరకొండతో సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యాక సమంత బ్రేక్ తీసుకుంది. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

బ్రేక్ తీసుకున్న తర్వాతి నుంచి సమంత సమయాన్ని సరదాగా గడుపుతోంది. ఆధ్యాత్మికతకు కూడా కేటాయిస్తోంది. తాను ధ్యానం చేస్తున్న ఫొటోలను కూడా సమంత ఇటీవల షేర్ చేసింది. ఆ తర్వాత కొత్త హెయిర్ స్టైల్‍తో వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాలీ ట్రిప్‍నకు వెళ్లింది. ఈ వెకేషన్‍కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. సినిమాల నుంచి బ్రేక్‍లో ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‍లోనే ఉంటోంది సామ్.

తాను మయోసైటిస్‍తో బాధపడుతున్నానని గతేడాది సమంత ప్రకటించింది. అయితే, శాకుంతలం మూవీని అలాగే కంప్లీట్ చేసింది. ఈ ఏడాది విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఖుషి మూవీని కూడా పూర్తి చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఖుషి సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. కాగా, మయోసైటిస్‍కు చికిత్స తీసుకునేందుకు సమంత త్వరలోనే అమెరికాకు వెళుతుందని సమాచారం.

Whats_app_banner