Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు రిషి హీరో ఎంట్రీలో ట్విస్ట్ - ప్రియమైన నాన్నకు రిలీజ్ ఎప్పుడంటే?
గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ అలియాస్ రిషి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ప్రస్తుతం గీతా శంకరంతో పాటు ప్రియమైన నాన్నకు అనే సినిమాలు చేస్తోన్నాడు. గీతా శంకరం ఆగిపోవడంతో అతడి సెకండ్ మూవీ ప్రియమైన నాన్నకు.... డెబ్యూ సినిమాగా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలొస్తోన్నాయి.
Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు రిషి. దాదాపు నాలుగేళ్ల పాటు బుల్లితెర అభిమానులను అలరించిన ఈ సీరియల్‌కు ఇటీవలే శుభంకార్డు పడింది. ఆగస్ట్ 31నతో గుప్పెడంత మనసు సీరియల్‌కు మేకర్స్ శుభంకార్డు వేశారు.
లవ్‌స్టోరీ ఎవర్‌గ్రీన్...
గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషిధారల లవ్‌స్టోరీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. తమ కెమిస్ట్రీ, రొమాన్స్‌తో ముఖేష్ గౌడ, రక్షా గౌడ అభిమానులను ఆకట్టుకున్నారు.గుప్పెడంత మనసు మనసు సీరియల్‌కు ఎండ్ కార్డ్ పాడటంతో అభిమానులు డిసపాయింట్ అయ్యారు. రిషిధారలను మిస్సవుతున్నామంటూ పోస్ట్‌లు, కామెంట్స్ పెట్టారు.
హీరోగా ఎంట్రీ...
గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు నాట పాపులర్ అయిన ముఖేష్ గౌడ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. రెండు సినిమాలను అనౌన్స్‌చేశాడు. అందులో ఒకటి బైలింగ్వల్ మూవీ కాగా...మరొకటి స్ట్రెయిట్ తెలుగు మూవీ. స్ట్రెయిట్ తెలుగు మూవీ గీతాశంకరం గత ఏడాది ప్రారంభమైంది. విలేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రుద్ర దర్శకత్వం వహించాడు. ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటించింది.
70 శాతం షూటింగ్ పూర్తి...
దాదాపు 70 శాతం వరకు షూటింగ్ పూర్తయిన తర్వాత గీతా శంకరం మూవీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ముఖేష్ గౌడతో పాటు దర్శకుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. గీతాశంకరం షూటింగ్ మొదలయ్యే అవకాశం లేకపోవడంతో కన్నడ, తెలుగు బైలింగ్వల్ మూవీపై ముఖేష్ గౌడ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. హీరోగా అతడు అంగీకరించిన సెకండ్ మూవీ ….డెబ్యూ సినిమాగా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
ప్రియమైన నాన్నకు...
ప్రియమైన నాన్నకు సినిమాను ఇటీవలే అనౌన్స్‌చేశాడు రిషి. కన్నడంలో తీర్థరూప తండేయావరిగే అనే టైటిల్‌తో ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రియమైన నాన్నకు మూవీకి రామేనహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్నాడు.
వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా తెలుగు, కన్నడ బైలింగ్వల్ మూవీ పోస్టర్స్‌పై ముఖేష్ గౌడ పేరు నిహార్ ముఖేష్‌గా కనిపిస్తోంది. ముఖేష్ గౌడ పేరుతో సీరియల్స్ చేసిన రిషి...సినిమాల్లో మాత్రం నిహార్ ముఖేష్‌గా కొనగాలని రిషి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గుప్పెడంత మనసు 2
రిషి, వసుధారలకు సీరియల్ ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని గుప్పెడంత మనసు సీరియల్‌కు సీక్వెల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం. డిఫరెంట్ స్టోరీతో ఈ సీక్వెల్ సీరియల్ తెరకెక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.