తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Eagle Movie Ott: రెండు ఓటీటీల్లోకి రానున్న రవితేజ ‘ఈగల్’ సినిమా

Eagle Movie OTT: రెండు ఓటీటీల్లోకి రానున్న రవితేజ ‘ఈగల్’ సినిమా

26 February 2024, 21:18 IST

google News
    • Eagle Movie OTT Streaming: ఈగల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమవుతోంది. అయితే, రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం రెండు ఓటీటీల్లో అడుగుపెట్టడం ఖాయమైంది.
Eagle Movie OTT: రెండు ఓటీటీల్లోకి రానున్న రవితేజ ‘ఈగల్’ సినిమా
Eagle Movie OTT: రెండు ఓటీటీల్లోకి రానున్న రవితేజ ‘ఈగల్’ సినిమా

Eagle Movie OTT: రెండు ఓటీటీల్లోకి రానున్న రవితేజ ‘ఈగల్’ సినిమా

Eagle Film OTT: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా మోస్తరు వసూళ్లను రాబట్టింది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆరంభంలో మంచి కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత జోరు తగ్గగా.. అంచనాలను అందుకోలేకపోయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈగల్ మూవీని తెరకెక్కించారు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. రవితేజ గెటప్, యాక్షన్ సీన్లు ఈ మూవీలో హైలైట్‍గా నిలిచాయి. కాగా, ఈగల్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.

రెండు ఓటీటీల్లో..

ఈగల్ సినిమా రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు రావడం ఖాయమైంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఆ విషయం ఇటీవల బయటికి వచ్చింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది.

ఈగల్ సినిమా త్వరలో స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియో నేడు అధికారికంగా ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను ఇంకా వెల్లడించలేదు. ఈటీవీ విన్, ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం రానుండడం ఫిక్స్ అయింది.

ఈగల్ సినిమా మార్చి 2వ తేదీన లేకపోతే 8వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఈగల్ చిత్రంలో రవితేజ యాక్టింగ్ అందరినీ మెప్పించింది. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‍గా నటించారు. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, మధు, శ్రీనివాస్ అవకరాల, మధూ, అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు.

సినిమాటోగ్రాఫర్‌గా పాపులర్ అయిన కార్తిక్ ఘట్టమనేనికి దర్శకుడిగా ఈగల్ రెండో మూవీ. అయితే, టాప్ డైరెక్టర్లలో కార్తిక్ ఒకడిగా అవుతాడని తాను భావిస్తున్నానని రవితేజ.. ఈ మూవీ సక్సెస్ ఈవెంట్‍లో చెప్పారు. అతడి విజన్ టాప్‍లో ఉందని, ఈగల్ చిత్రంలో తనకు తన క్యారెక్టర్ బాగా నచ్చిందని రవితేజ అన్నారు. ఈగల్ మూవీకి డావ్ జంద్ సంగీతం అందించారు.

ఈగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.35కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే భారీగా అంచనాలను పెట్టుకున్నట్టు బ్లాక్‍బాస్టర్ కాలేకపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఈగల్ స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే

పత్తి ఉత్పత్తి చేసే వ్యక్తిగా, ఈగల్ నెట్‍వర్క్‌ హెడ్‍గా ఈగల్ మూవీలో రవితేజ కనిపించారు. తలకోనలో పత్తి మిల్లు నిర్వహించే సహదేవ్ వర్మ (రవితేజ) గురించి జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) ఓ కథనం రాస్తుంది. అయితే, అదే కథను మలుపు తిప్పుతుంది. రా, నక్సళ్లు, ఉగ్రవాదులకు మెయిన్ టార్గెట్‍గా ఈగల్, దాన్ని నడిపే సహదేవ్ ఉన్నాడని నళినికి తెలుస్తుంది. అసలు సహదేవ్ గతమేంటి? ఈగల్ నెట్‍వర్క్ ఏం చేస్తుంది? సహదేవ్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? అనేవే ఈగల్ సినిమాలో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. రవితేజ కొత్త అవతారం, యాక్షన్ సీక్వెన్సులు, కొత్త తరహా నటన ప్రేక్షకులను బాగా మెప్పించాయి. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ కూడా స్టైలిష్‍గా కొత్తగా అనిపిస్తుంది. అయితే, డైలాగ్‍లు, ఫస్టాఫ్‍లో కథనం నిరాశ పరిచిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

తదుపరి వ్యాసం